వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం ప‌లు సిఎంఎస్ సాఫ్ట్‌వేర్స్‌ – Part 2

సిఎంఎస్‌ Content Management System (CMS) సాఫ్ట్‌వేర్స్‌లో కొన్నింటి గురించి పార్ట్ 1 లో తెలుసుకున్నాం. ప్రాచుర్యాన్ని పొంది ప్రపంచవ్యాప్తంగా మ‌రో మూడు రకాల టూల్స్‌ గురించి తెలుసుకుందాం. వ‌ర్డ్ ప్రెస్‌, జుమ్లా,డ్రుపాల్ గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

WordPress …
బాగా ప్రాచుర్యాన్ని పొందిన సిఎంఎస్‌ టూల్స్‌లో ఇది ఒకటి. మరోసారి దీనికి సంబందించిన విషయాలు తెలుసుకుందాం. వెబ్‌సైట్‌ లేదా బ్లాగ్‌ను తయారుచేయడం కోసం వర్డ్‌ప్రెస్‌లో అనేక ఫీచర్స్‌ బిల్ట్‌ఇన్‌ అయి వుంటాయి. వీటి ద్వారా సులువుగా వెబ్‌పేజీలను తయారుచేయగలం. వర్డ్‌ప్రెస్‌ థీమ్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసి వాటి మద్య స్విచ్‌ కావచ్చు. థీమ్స్‌ ద్వారా వర్డ్‌ప్రెస్‌ వెబ్‌సైట్ కన్పించే విధానాన్ని, ఫంక్షనాలిటీని మార్చవచ్చు. ఈ థీమ్స్‌ను “WordPress Dashboard Administration tool” ద్వారా ఇన్‌స్టాల్‌ చేయాలి. లేదా ఎఫ్‌టిపి ద్వారా థీమ్స్‌ ఫోల్డర్‌ను అప్‌లోడ్‌ చేయాలి. థీమ్స్‌లో వుండే “PHP, HTML” కోడ్‌ను కూడా ఎడిట్ చేసి మరింతంగా కస్టమైజేషన్‌ చేయవచ్చు. వర్డ్‌ప్రెస్‌ అందించే మరో ముఖ్యమైన పీచర్‌ ప్లగిన్స్‌. అనేక ప్లగ్‌ఇన్స్‌ను కల్గిన ఆర్కిటెక్షర్‌ను వుండటం వలన వెబ్‌సైట్స్‌ను ఎంతో డైనమిక్‌గా తయారుచేసే వీలుంది. వర్డ్‌ప్రెస్‌లో దాదాపుగా 18,000 ప్లగ్‌ఇన్స్‌ వుండటం విశేషం. వీటి ద్వారా విడ్‌గెట్స్ యాడ్‌ చేయడం మొదలుకుని ఎస్‌ఈఓ చేయడం వరకు పలు విధాలుగా వుపయోగించేకునే వీలుంది. విడ్‌గెట్స్ ద్వారా సైట్‌లోని ఎదో ఒక ఫంక్షన్‌ను (అవసరాన్ని బట్టి) సులువుగా యాడ్‌ చేసుకునే వీలుంది. ఉదాహరణకు స్లైడ్‌ షో, ఫేస్‌బుక్‌ మాదిరిగా వుండే బాక్స్‌, చిన్న న్యూస్‌ స్లైడర్‌…వంటివి.
మల్టీ యూసర్‌, మల్టీ బ్లాగింగ్‌ ఫీచర్‌ను కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ అందిస్తుంది. మొబైల్స్‌లో వుపయోగించే అండ్రాయిడ్‌, విండోస్‌ పోన్‌ 7, వెబ్‌ ఓఎస్‌, ఐఓఎస్‌…వంటివి మొబైల్ ఆప‌రేటింగ్‌ సిస్టమ్స్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది. దీని ద్వారా మీరు తయారుచేసే వెబ్‌సైట్స్ మొబైల్స్‌లో కూడా డిస్‌ప్లే చేయడానికి అవకాశం వుంటుంది. ఇవే కాకుండా వర్డ్‌ప్రెస్‌ … ఇంటిగ్రేటెడ్ లింక్‌ మేనేజ్‌మెంట్‌, సెర్చ్‌ ఇంజన్‌ ఫ్రెండ్లీ, క్లీన్ పెరమాలింక్‌ స్ట్రక్షర్‌…వంటి ఫీచర్స్‌ను కూడా అందిస్తుంది. వర్డ్‌ప్రెస్‌కు సంభందించిన మరిన్ని వివరాల కోసం wordpress.org అనే వెబ్‌సైట్ లోకి లాగిన్‌ కండి.
Joomla …
ఇట‌వల కాలంలో ఈ సిఎంఎస్‌ టెక్నాలజీని వుపయోగించడం పెరుగుతుంది. 2005లో జుమ్లా ప్రవేశించిన తర్వాత, వుపయోగించేవారు తక్కువగా వున్నప్ప‌టికీ, 2016 నాటికి అనేక మంది ఈ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం జరిగింది. ఇందులో ఉచితంగాను, డబ్బులు వెచ్చించడం ద్వారాను లబించే ఎక్స్‌టెన్షన్స్‌ అనేకం వున్నాయి. జుమ్లాను ఉచితంగా లబించే “Content Management Freamework (CMF)” గా పిలుస్తారు. దీన్ని కూడా PHP లో తయారుచేసినప్పికీ, వెర్షన్‌ 1.5 నుంచి ఇందులో Object oriented programming టెక్నిక్స్‌ను, సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ ప్యాటరన్స్‌ను కూడా వుపయోగించడం జరిగింది. జుమ్లాలో డేటాబేస్‌ను “MySQL లేదా MS SQL” లో స్టోర్‌ చేసుకునే అవకాశం వుంది.
జుమ్లాను “linux.com, itwire.com, computernetworkingnotes.com” … వంటి పలు ప్రాచుర్యాన్ని పొందిన వెబ్‌సైట్స్‌ను తయారు చేయడానికి వుపయోగించడం విశేషం. వర్డ్‌ప్రెస్ మాదిరిగానే జుమ్లా కూడా అనేక టెంప్‌లేట్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. జుమ్లా టెంప్‌లేట్స్‌ నేరుగా లేఅవుట్‌ను, డిజైన్‌, వెబ్‌సైట్ స్ట్రక్షర్‌ను డెవలప్‌ చేయడంలో వుపయోగపడుతుంది. సిఎమ్‌ఎస్‌ టూల్‌ వెబ్‌పేజీ తయారీ, ఎడిటింగ్ .. వంటి వాటిని సపోర్ట్‌ చేస్తుంటే టెంప్‌లేట్స్ వెబ్‌సైట్స్ కన్పించే విధానాన్ని మార్చుకునే వీలు కల్పిస్తుంది.జుమ్లా టెంప్‌లేట్‌లో వేరుగా వుంటుంది కావున దీన్ని ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం… వంటివి సులువుగా చేయగలం. మొత్తంగా నచ్చిన టెంప్లేట్‌ను సెలెక్ట్‌ చేసుకున్న తర్వాత దాన్ని కావాల్సిన రీతిలో ఎడిట్ చేసుకోవాల్సి వుంటుంది. టెంప్‌లేట్‌లో వుండే కాంపోనెంట్స్‌ను పరిశీలిస్తే…
మొత్తం టెంప్‌లేట్స్ లేఅవుట్ కన్పిస్తుంది. ఈ లేఅవుట్‌నే యూసర్‌ తనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. వెబ్‌సైట్‌లోని కాంపోనెంట్స్‌, మాడ్యూల్స్‌, ప్లగ్‌ఇన్స్‌…తదితర వాటిని మార్చుకునే వీలుంది. వెబ్‌సైట్‌లో ఇమేజ్‌లను వుంచుతుంటే వాటిని ఎలా కావాలంటే అలా కూడా డిజైన్‌ లేదా లేఅవుట్ చేయవచ్చు. ఇమేజ్‌లకు ఫ్లాష్‌ మాదిరిగా ఎఫెక్ట్స్‌ను, డ్రాప్‌డౌన్‌ మెనూలను … తదితర ఎఫెక్ట్స్‌ను తయారు చేసుకునే వీలుంది. ఇమేజ్‌లు, కలర్స్‌ను మార్చుకునే మాదిరిగానే ఫాంట్స్‌ను కూడా మార్పులు, చేర్పులు చేయవచ్చు. ముఖ్యంగా జుమ్లాలో 5 రకాల ఎక్స్‌టెన్షన్స్‌ కన్పిస్తాయి. కాంపోనెంట్స్‌, మాడ్యూల్స్‌, ప్లగ్‌ఇన్స్‌,టెంప్‌లేట్స్‌, లాంగ్వేజీలు … మొదలైనవి. ఈ ఎక్స్‌టెన్షన్స్‌ ద్వారా మొత్తం వెబ్‌సైట్‌ను ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దుకునే అవకాశం వుంది. సాదారణంగా వెబ్‌సైట్‌లో ఏమేమి అవసరం ఉంటాయో, దాని అదారంగానే మొత్తం టెంప్‌లేట్ వుంటుంది. ఇందులో వుండే వివిధ ఎక్స్‌టెన్షన్స్‌ ద్వారా పలు రకాల పనులు పూర్తి చేయగలం. వర్డ్‌ప్రెస్‌లో మాదిరిగానే ఇందులో కూడా జుమ్లాను ఇన్‌స్టాల్‌ చేయాల్సి వుంటుంది. తర్వాత జుమ్లాను వుపయోగించి వెబ్‌పేజీలను కస్టమైజ్‌ చేయాలి. జుమ్లా డౌన్‌లోడ్‌ ఇతర వివరాల కోసం www.joomla.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కండి.
Drupal …
ఉచితంగా లబిస్తూ ప్రాచుర్యాన్ని పొందిన మరో సిఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ టూలే డ్రుపాల్‌. మొత్తం వెబ్‌సైట్స్‌లో కనీసం 2.5 శాతం వెబ్‌సైట్స్‌ను ఈ టెక్నాలజీని వుపయోగించి తయారుచేసినవే. ఇటీవల కాలంలో వర్డ్‌ప్రెస్‌, జుమ్లాతో పాటుగా డ్రుపాల్‌ కూడా వాడుకలోకి వస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ టూల్‌కు సంభందించిన వివరాల కోసం http://drupal.in/ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కాగలరు. డ్రుపాల్‌ కూడా అనేక ఫీచర్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. యూసర్ అక్కౌంట్‌ రిజిస్ట్రేషన్స్‌, మెను మేనేజ్‌మెంట్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడ్స్‌, పేజీ లేఅవుట్ కస్టమైజేషన్‌…తదితర వాటిని అందిస్తుంది. డ్రుపాల్‌ అన్ని ఫ్లాట్‌ఫాంల‌పైన పనిచేస్తుంది. కావాల్సినన్ని థీమ్స్‌, పలు రకాల కస్టమైజేషన్‌ టూల్స్‌ను అందిస్తుంది. ఇప్ప‌టి వరకు చెప్పుకున్న ఈ టూల్స్‌ కేవలం డిజైన్‌ వరకు మాత్రమే కాకుండా వెబ్‌సైట్‌లోని డేటాబేస్‌ కోసం ప్రత్యేకంగా డేటాబేస్‌ను కూడా సపోర్ట్‌ చేస్తాయి. మొబైల్‌ సపోర్టింగ్‌, పలు రకాల ఎడింగ్‌, కస్టమైజేషన్‌ టూల్స్‌ను అందించడం…ఇలా వెబ్‌డిజైనింగ్‌లో నూటికి నూరు శాతం తమ సపోర్ట్‌ని అందిస్తున్నాయి. దీని కారణంగానే ఇటీవల కాలంలో బ్లాగ్స్‌, వెబ్‌సైట్స్‌ను వీటిని వుపయోగించే తయారు చేస్తున్నారు. బ్లాగ్స్‌ను నేరుగా బ్లాగ్ స్పాట్ లో మాదిరిగా సింపుల్‌ పేజీ మాదిరిగా కాకుండా వెబ్‌సైట్ మాదిరిగా కూడా తయారుచేయవచ్చు. దీని కోసం కూడా వెబ్‌సైట్‌ను రిజిష్టర్‌ చేసి పోస్టింగ్స్‌ను అనుమతించాలి. ఇందులో యూసర్‌ రిజిస్ట్రేషన్‌, షేరింగ్‌, కామెంట్స్‌, ఫీడ్‌బ్యాక్‌…తదితర వాటిని వుంచాలంటే మాత్రం ఇక్కడ చెప్పుకునే ఈ మూడు సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ ఏదో ఒకదాన్ని వుపయోగించాలి. లేదా ప్రత్యేకంగా పిహెచ్‌పి లో ప్రొగ్రామింగ్‌ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో కూడా అవసరమున్న చోట ఇటువంటి ఫంక్షన్స్‌ను వుంచితే వాటిని కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌లో తయారుచేసుకునే వీలుంది.
గతంలో కంటే కాస్త సులువుగా నేరుగా పిహెచ్‌పిలో వెబ్‌పేజీలు ఎలా వుండాలో దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన ఈ మూడు రకాల సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ నేడు వెబ్‌ డిజైనర్స్‌ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీని కారణంగా నేడు అనేక మంది వెబ్‌సైట్స్‌ను ప్రత్యేకంగా డ్రీమ్‌వీవర్‌, హెచ్‌టిఎంఎల్, పోటోషాప్‌…వంటి వాటితో కాకుండా సిఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని తయారు చేస్తున్నారు. వీటిని ఇన్‌స్టాల్‌ చేయడానికంటే ముందు వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్‌, హోస్టింగ్‌ స్పేస్‌…వంటివి తీసుకుని వుండాలి. ఇన్‌స్టాల్‌ చేయడం, సిఎంఎస్‌ టూల్స్‌ను వుపయోగించడం చాలా తేలిక అనుకోవద్దు. వీటినే ఇప్ప‌టికే వుపయోగిస్తున్న వారి వద్ద కొంత శిక్షణ తీసుకోవడం ఎంతైనా అవసరం. దీనితో పాటుగా హెచ్‌టిఎంఎల్‌, పోటోషాప్‌ గురించి కూడా తెలిసి వుంటే మంచిది. సిఎంఎస్‌ టూల్స్‌కు సంబందించిన ట్యుోరియల్స్ యుట్యూబ్‌లో కూడా ఉచితంగా లబిస్తున్నాయి.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *