వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం ప‌లు సిఎంఎస్ సాఫ్ట్‌వేర్స్‌ – Part 1

నేడు ఆన్‌లైన్‌లో అనేక రకాల వెబ్‌సైట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్స్ చూడానికి కూడా చాలా అందంగా కన్పిస్తుంటాయి. పలు రకాల ఫీచర్స్‌ను జోడించి వెబ్‌సైట్స్‌ను కావాల్సిన రీతిలో తయారు చేసుకునే వీలుంది. వెబ్‌సైట్స్‌ను అందంగా తీర్చిదిద్దడం కోసం అనేక రకాల టూల్స్‌ వాడుకలోకి వచ్చాయి. వెబ్‌సైట్స్‌ను సులువుగా, వేగంగా తయారు చేయడానికి ఈ టూల్స్‌ ఉపయోగపడతాయి. వీటిని సిఎంఎస్‌ “Content Management System (CMS)” టూల్స్‌ అని పిలుస్తాం. ప్రాచుర్యాన్ని పొంది ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ఈ పది రకాల టూల్స్‌ గురించి తెలుసుకుందాం. వీటిలో చాలా వరకు టూల్స్‌ ఉచితంగానే లబిస్తున్నాయి. కొన్నింటికి నామమాత్రపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సిఎంఎస్ టూల్స్‌లో మ‌నం త‌రుచుగా వినేవి … Word Press, Joomla, Drupal .. ఇవే కాకుండా ఇంకా అనేకం వాడుక‌లో ఉన్నాయి.
ఇంటర్నెట్లో నిత్యం మనం అనేక వెబ్‌సైట్స్ ను చూస్తూ ఉన్నాం. కొన్ని వెబ్‌సైట్స్ ను చూసి ఎంత చక్కగా డిజైన్‌ చేశారో అనుకుంటూ ఉంటాం. మొద‌ట్లో వెబ్‌డిజైనింగ్‌ చాలా కష్టంగా వుండేది. హెచ్‌టిఎంఎల్‌ వాడే రోజుల్లో ఈ పరిస్థితి వుండేది. ప్రస్తుతం డ్రీమ్‌వీవర్‌, పోటోషాప్‌, ఫ్లాష్‌… వంటి సాఫ్ట్‌వేర్స్‌ వాడుకలో వుండటంతో వీటిని నేర్చుకోవడం ద్వారా వెబ్‌డిజైనింగ్‌ను మరింత సులువుగా పూర్తి చేయగలం. ఇటీవ‌ల‌ కాలంలో టెక్నాలజీలో వచ్చిన మార్పుల వలన “Content Management System (CMS) ప్రవేశించింది. దీని ద్వారా సులువుగా వెబ్‌సైట్స్‌ను క్రియేట్ చేయడం, ఎడిట్‌ చేయడం, ఎప్ప‌టికప్పుడు మార్పులు, చేర్పులు చేయడం…వంటివి చేయగలం. వెబ్‌సైట్స్ తయారీలో ఉచితంగా లభిస్తూ కొన్ని ర‌కాల సిఎంఎస్‌ టూల్స్‌ గురించి …

Content Management System (CMS) …
వెబ్‌పేజీల డిజైనింగ్‌కు సంభందించి తరుచుగా మనం వినే సిఎంఎస్‌ అంటే వెబ్‌సైట్‌ను తయారు చేయడం కోసం, వాటిని ఎడిట్ చేయడం కోసం లభించే పలు ఉచిత సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ అని అర్థం. వీటి ద్వారానే వెబ్ కంటెంట్‌ను మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకునే వీలుంది. అందుకే ఈ టూల్స్‌ను వెబ్ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ టూల్స్‌ అని కూడా పిలుస్తారు. వీటి ద్వారా మనమే నేరుగా వెబ్‌పేజీలను డిజైన్‌ చేయడం, వాటిని ఎడిట్ చేయడం…వంటివి చేయవచ్చు. తద్వారా మన వెబ్‌సైట్స్‌ను మనమే తయారు చేసుకోవచ్చు. దీని కారణంగా నేడు కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ టూల్స్‌కు మంచి ప్రజాదరణ లబిస్తున్నది. ఈ టూల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం, మ‌న వెబ్‌సైట్‌కు త‌గ్గ విధంగా క‌స్ట‌మైజ్‌ చేయడం అంత సులువు కాదు. ఒకసారి వాటిని వుపయోగించే సమయంలో ప్రాక్టికల్‌గా చూడటం ద్వారా నేర్చుకోవచ్చు. ఈ టూల్స్‌ను వుపయోగించే సమయంలో పోటోషాప్‌, హెచ్‌టిఎంఎల్‌ కూడా అవసరం అవుతుంది. చాలా తక్కువగా మాత్రమే వీటిని వుపయోగించాల్సి వుంటుంది. డ్రీమ్‌వీవర్‌లో మాదిరిగా లే అవుట్ కోసం శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ సిఎంఎస్‌ సాఫ్ట్‌వేర్స్‌ను పిహెచ్‌పిని వుపయోగించి తయారుచేశారు. వెబ్‌సైట్స్ తయారీ కోసం “CMS made simple, modx, square space, wordpress, expression engine, textpattern, joomla, drupal”… వంటి పలు రకాల సిఎంఎస్‌ టూల్స్‌ వాడుకలోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో ఉచితంగా లభిస్తున్న ఈ సాఫ్ట్‌వేర్స్‌ను ఓపన్‌సోర్స్‌ డెవలప్‌మెంట్ కింద అనేక మంది కంట్రిబ్యూట్ చేయడం వల్లనే అవి పూర్తిస్థాయిలో అభివృద్ది చెంది వాడుకలోకి వచ్చాయి.
ఈ ఉచిత టూల్స్‌ను “General Public License (GPU) కింద ఉచితంగా ఆన్‌లైన్‌లో లబిస్తున్నాయి. ఇక్కడ చెప్పుకునే సిఎంఎస్‌ టూల్స్‌ కూడా పిహెచ్‌పి (PHP) లో తయారు చేయబడి ఉచితంగా అందుబాటులో వున్నాయి.మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌, ఉబంటు లినక్స్‌…వంటి సాఫ్ట్‌వేర్స్‌ ఆన్‌లైన్‌లో ఉచితంగా లబిస్తూ ఎంతగానో ప్రాచుర్యాన్ని పొందిన విషయం తెలిసిందే.
CMS Made simple …
పేరులో ఉన్నట్టుగానే సింపుల్‌గా వెబ్‌సైట్స్‌ తయారు చేయాలంటే ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. సులువుగా, వేగంగా వెబ్‌సైట్స్ తయారీ, నిర్వహణ ఉంటుంది. వెబ్‌డిజైనింగ్‌ ప్రొఫెషనల్స్‌కు శక్తివంతంగాను, బిగినర్స్‌కు సింపుల్‌గాను ఉంటుంది. ఇందులోని ఫీచర్స్‌ను ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునే వీలుంది. దీన్ని cmsmadesimple.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
MOD X …
సులువుగా వెబ్‌సైట్స్‌ను తయారు చేయడంలో ఉపయోగపడే మరో సిఎంఎస్‌ టూల్‌ ఇది. ఇప్ప‌టివరకు ఒక లక్షకు పైగానే వెబ్‌సైట్స్‌ను ఇందులో డెవలప్‌ చేయడం జరిగింది. వెబ్‌పేజీలను చక్కగా చూపించడంలోను అదే విదంగా seo ఫ్రెండ్లీగా (search engine optimizaiton) వెబ్‌సైట్స్ ను తీర్చిదిద్దడంలో ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. ఈ టూల్‌ని modx.com వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
UMBRACO …
సిఎంఎస్‌ టూల్స్‌లో చాలా వరకు టూల్స్‌ని ఓపెన్‌సోర్స్‌లో డెవలప్‌ చేసి ఉంటారు. మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన టూల్స్‌లో ఈ టూల్ ఒకటి. దీని ద్వారా వెబ్‌సైట్స్‌ని చాలా చక్కగా తయారు చేసుకునే వీలుంది. Asp.Net టెక్నాలజీని ఉపయోగించి ఈ టూల్‌ని డెవలప్‌ చేశారు. డాట్ నెట్ టెక్నాల‌జీని ఉపయోగించే అనేక మంది ఈ టూల్‌ని ఉపయోగించడానికి అసక్తి చూపుతుాంరు. ఇది ఎమ్‌ఎస్‌వర్డ్‌, ఫ్లాష్‌, సిల్వర్ లైట్ అప్లికేషన్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. పెయిడ్‌ ప్రొగ్రామింగ్‌ సాఫ్ట్‌వేర్‌ని Asp.Net ఉపయోగించి తయారు చేసిన ఓపెన్‌ సోర్స్‌ టూల్‌. దీన్ని umbraco.com వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
SQUARE SPACE …
బెస్ట్‌ సిఎంఎస్‌ టూల్స్‌లో ఇది ఒకటి. ఈ టూల్‌లో అనేక ముఖ్యమైన ఫీచర్స్‌ ఉన్నాయి. వీటి ద్వారా వెబ్‌సైట్‌ని ఎలా కావాలంటే అలా డిజైన్‌ చేసుకునే వీలుంది. మొబైల్‌, యూజ‌ర్‌ ఫ్రెండ్లీగాను… (ఎస్ఇఓ – సెర్చి ఇంజ‌న్ అప్టిమైజేష‌న్) ఫ్రెండ్లీగాను తయారు చేయగలం. చూడగానే ముచ్చటగొలిపే అనేక డిజైన్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. మీడియా గ్యాలరీలను, బ్లాగ్స్‌ను తయారు చేయడంలో ఈ టూల్‌ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కావాల్సిన రీతిలో (కస్టమ్‌ డిజైన్స్‌) వెబ్‌సైట్‌ను తయారు చేసుకోగలరు. రియల్‌ టైమ్‌లో కామెంట్స్ ఉండేలా అలాగే ఫీడ్‌బ్యాక్‌, యూసర్‌ సౌకర్యం…తదితర ఫీచర్స్‌ అన్నీ కూడా ఇందులో లబిస్తాయి. దీన్ని squarespace.com వెబ్‌సైట్ లింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోగలరు.
Contao …
వెబ్‌సైట్స్‌ను seo ఫ్రెండ్లీగాను, అలాగే సైట్స్‌కు హ్యాకర్స్‌ నుంచి సెక్యూరిటీ ఇవ్వడంలోను ఈ టూల్స్‌ ఉపయోగపడతాయి. లైవ్ అప్‌డేషన్‌లోను, లేటెస్ట్‌ సిఎస్‌ఎస్‌ (cascading style sheets) ఫ్రేమ్‌వర్క్‌ని అందించడంలోను, యూసర్ రైట్స్ మేనేజ్‌మెంట్‌లోను ఈ టూల్‌ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్నే టైపోలైట్ అని కూడా పిలుస్తారు. దీన్ని contao.org వైబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించగలరు.
Text pattern …
సులువుగా ఉపయోగించడానికి వీలున్న టూల్స్‌లో ఇది కూడా ఒకటి. దాదాపుగా 800 రకాల ప్లగ్‌ఇన్స్‌ను అందిస్తుంది. మనం తయారు చేసే వెబ్‌సైట్స్‌లో అవసరాన్ని బ‌ట్టి పలు రకాల ప్లగ్‌ఇన్స్‌ను ఇంటిగ్రేట్ చేయాలి. ఉదాహరణకు సోషల్‌ మీడియాతో టచ్‌లో ఉండాలంటే దానికి సంబందించిన ప్లగ్‌ఇన్‌ని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. ఇది అందించే ప్లగ్‌ఇన్స్‌లో మీకు అవసరం ఉన్న దాన్ని సులువుగా ఇంటిగ్రేట్ చేసుకుని ఉపయోగించే వీలు ఉంటుంది. ప్రత్యేకంగా ఈ టూల్‌ కోసం Text pattern community support ఉండటం వలన ఏదేని సమస్య ఉంటే ఈ కమ్యూనిటీ ద్వారా సులువుగా సాల్వ్‌ చేసుకోగలరు. దీన్ని Textpattern.com లింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోగలరు.
Expression engine …
ఈ సిఎంఎస్‌ టూల్‌ ఉచితంగా లబించదు. కొంత మొత్తం చెల్లించి దీన్ని కొనుగోలు చేయాలి. వెబ్‌ డెవలపర్స్‌కు అన్ని విదాల సహకరించడంలో ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. యూసర్‌ ఫ్రెండ్లీగాను, వెబ్‌సైట్ ఫ్లెక్సీబిలిటీలోను, సెక్యూరిటీని అందించడంలోను ఈ సిఎంఎస్‌ టూల్‌ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పెయిడ్‌ టూల్‌ వద్దనుకుంటే దీన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇక్కడే చెప్పిన ఇతర టూల్స్‌ కూడా చాలా సమర్దవంతంగా పనిచేస్తాయి.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *