వెబ్‌సైట్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో వ‌ర్డ్ ప్రెస్ థీమ్స్‌

వెబ్‌సైట్‌ను డెవల‌ప్‌మెంట్‌లో “Content Management System (CMS)” టూల్స్‌ చాలా కీల‌కంగా ఉంటున్నాయి. వెబ్‌సైట్‌ను తయారు చేయడంలో ఉపయోగపడే వాటిలో “WordPress, Zoomla, Drupal” అనే మూడు రకాల సిఎంఎస్‌ సాఫ్ట్‌వేర్స్‌ చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిలో అత్యధిక శాతం మంది వర్డ్‌ప్రెస్‌ని ఉపయోగిస్తున్నారు. వర్డ్‌ప్రెస్‌ని ఉపయోగించడం గురించి తెలియచేస్తూనే వర్డ్‌ప్రెస్ ద్వారా ఉన్న ముఖ్య సమస్య థీమ్స్‌ దొరకడం. దీని గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

అందుబాటులో అనేక ఉచిత థీమ్స్‌
వెబ్‌సైట్‌ డెవప్‌మెంట్‌లో వర్డ్‌ప్రెస్‌ చాలా కీల‌కంగా ఉంటుంది. వర్డ్‌ప్రెస్‌ను వెబ్‌ సర్వర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత, నేరుగా లాగిన్‌ అయి వర్డ్‌ప్రెస్‌ ద్వారా వెబ్‌సైట్‌ను కావాల్సిన విదంగా కస్టమైజ్‌ చేసుకోవచ్చు. వర్డ్‌ప్రెస్‌ గురించి బేసిక్‌ అంశాల‌ గురించి మ‌నం ఇది వ‌ర‌కే కంప్యూట‌ర్స్ ఫ‌ర్ యు మ్యాగ‌జైన్ ద్వారా తెలుసుకున్నాం. వర్డ్‌ప్రెస్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత, దీన్ని ఉపయోగిస్తూ మనం వెబ్‌పేజీను డిజైన్ చేయ‌డం, కస్టమైజ్ చేయ‌డం చేస్తాం. ఇది నేరుగా వర్డ్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్‌ చేసినా లేదా మనం స్పేస్‌ తీసుకున్న సర్వర్‌ నుంచే చేస్తాం. దీన్నే బ్యాక్‌ ఎండ్‌ అని పిలుస్తాం. మనం వర్క్‌ చేసిన తర్వాత అప్‌లోడ్‌ చేసిన వెంటనే అది ఫ్రంట్‌ ఎండ్‌ అంటే బ్రౌజర్‌లో కన్పిస్తూ ఉంటుంది.

వర్డ్‌ పెస్ర్‌ థీమ్స్‌ గురించి …
వర్డ్‌ప్రెస్‌ని ఉపయోగించి వెబ్‌ డిజైన్ మ‌రియు డెవప్‌మెంట్‌ చేసే సమయంలో మనకు థీమ్స్‌ అనేవి ముఖ్య సమస్యగా ఉంటాయి. వర్డ్‌ప్రెస్‌ ద్వారా డిజైన్‌ చేసే ముందుగా మనకు అక్కడ ల‌బించే థీమ్స్‌ను ఎంచుకోవాలి. ఈ థీమ్స్‌ను సెలెక్ట్‌ చేసుకున్న తర్వాత వాటిని ఉపయోగించే
వెబ్‌ పేజీల‌ను తయారు చేస్తాం. థీమ్స్‌తో పాటు పలు రకాల ఫీచర్స్‌ను అందించే ప్లగ్‌ఇన్స్‌ కూడా ఇక్కడ ఉంటాయి. ఉదాహరణకు
ఫోటో గ్యాల‌రీ కావాలంటే అక్కడ ల‌బించే ప్లగ్‌ఇన్‌ను సెలెక్ట్‌ చేసుకోవడమే. ఇలా పలు ర‌కాలుగా వెబ్‌డిజైన్‌ చేయడంలో వర్డ్‌ప్రెస్‌ సహకరిస్తుంది.

థీమ్స్‌తో ఉన్న సమస్య ఏమిటి …
వర్డ్‌ప్రెస్‌లో అనేక థీమ్స్‌ మనకు కన్పిస్తుంటాయి. కొన్ని థీమ్స్ ఉచితంగా ఉంటే, మరికొన్నింటిని కొంత డబ్బు చెల్లిచండం ద్వారా కొనుగోలు చేయాలి. అలాగే ఆన్‌లైన్‌లో మనం థీమ్స్‌ను సెర్చింగ్‌ చేసి వాటిని కూడా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన థీమ్‌ ఏదేని వెబ్‌సైట్‌లో ఉంటే ముందుగా దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత దీన్ని వర్డ్‌ప్రెస్‌ను ఉపయోగించే డాష్‌బోర్డ్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న
ఈ థీమ్‌ను సెలెక్ట్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వర్డ్‌ప్రెస్‌లో అనేక రకాల‌ థీమ్స్‌ మనకు కన్పిస్తూ ఉంటాయి. ఈ థీమ్స్‌ను యాక్టివేట్‌ చేసిన తర్వాత కస్టమైజ్‌ చేసే సమయంలో పూర్తి స్థాయి ఫీచర్స్‌ మనకు కన్పించవు. పెయిడ్‌ థీమ్‌లోనే పూర్తి స్థాయి ఫీచర్స్‌ ఉంటాయనే మేసేజ్‌ మనకు కన్పిస్తూ ఉంటుంది. అంటే థీమ్‌ను ఇక్కడ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వర్డ్‌ప్రెస్‌ థీమ్స్‌లలో అనేకం అక్కడ కన్పిస్తున్నప్పటికీ వాస్తవంగా వాటిని కస్టమైజ్‌ చేసే సమయంలో మాత్రం అవి పూర్తి స్థాయిలో ఉపయోగపడవు. కానీ పెయిడ్‌ థీమ్స్‌ కాకుండా ఉచితంగా ల‌బించే థీమ్స్‌ కూడా అనేకం ఉన్నాయి. వీటిని గుర్తిస్తే సరిపోతుంది. ఉచితంగా ల‌భించే ఈ థీమ్స్‌ను తీసుకుని వాటిని యాక్టివేట్‌ చేయడం ద్వారా థీమ్‌ను పూర్తి స్థాయిలో కస్టమైజ్‌ చేసుకోగలం.

ఉచితంగా అనేక వర్డ్‌ పెస్ర్‌ థీమ్స్‌…
రెస్పాన్సివ్‌ థీమ్స్‌, ఎస్‌ఈఓ ఫ్రెండ్లీ థీమ్స్ … ఇలా అనేక థీమ్స్‌ వర్డ్‌ ప్రెస్‌ ద్వారా మనకు ల‌బిస్తాయి. అక్కడ మనకు కన్పించే అనేక థీమ్స్‌ ఉచితంగానే ఉన్నప్పటికీ వాటిని యాక్టివేట్‌ చేస్తే మాత్రం అందులోని కొన్ని ఫీచర్స్‌ మనకు కన్పించవు. అందుకే ఉచితంగా ల‌బించే వాటిని తీసుకుని వాటిని ఇక్కడ లిస్ట్‌ చేస్తున్నాం.
వెబ్‌సైట్‌ను చక్కగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడే అనేక థీమ్స్‌లో ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే …Twenty Sixteen, Luminescence Lite, Recepter, FluxiPress, BLDR, Celebrate, Responsive brix, Virtue, Ample Multipurpose Theme, Klasik, zAlive, Customizer, i – excel, Corpo, Attitude … వంటి మొదలైన థీమ్స్‌ ఉపయోగపడతాయి.
ఇక్కడ చెప్పుకునే థీమ్స్‌ పేరును నేరుగా వర్డ్‌ప్రెస్‌లో అందుబాటులో ఉంటే అ పేరుతో సెర్చింగ్‌ చేయడం ద్వారా అ థీమ్‌ను పొందగలం. కొన్ని రకా థీమ్స్‌ను “wordpress.org/themes” వెబ్‌సైట్‌లో సెర్చింగ్‌ చేయడం ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. నేరుగా గూగుల్ నుంచి కూడా ఉచితంగా ల‌బించే వాటిని సెర్చింగ్ చేసుకుని త‌ర్వాత డౌన్‌లోడ్ చేసుకుని వాటిని నేరుగా మీ వ‌ర్డ‌ప్రెస్ డ్యాష్‌బోర్డ్ లోకి తీసుకుని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. ఉచితంగా ల‌బించే థీమ్స్‌ పేర్లు తెలిస్తే వాటిని వర్డ్‌ప్రెస్‌లో వుంటే యాక్టివేట్‌ చేసుకుని కస్టమైజ్‌ చేసుకోగ‌లం. లేదా వర్డ్‌ప్రెస్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

ఉచితంగా ల‌బించే మరిన్ని వర్డ్‌ప్రెస్‌ థీమ్స్‌ …
MultiPurpose, MesoColumn, zeeDynamic, SuevaFree, Terrifico, Duena, FreshLite, Fruitful, Clean Black, Codium Grid, Delighted, GreenPage, Shopping, Bearded, Neutro … మొదలైన థీమ్స్‌ ద్వారా వెబ్‌సైట్‌ను కావాల్సిన విదంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ అనేక థీమ్స్‌ పేర్లు ఇచ్చినప్పటికీ వీటిలో మీకు నచ్చిన థీమ్‌ లేదా మీ అవసరాల‌కు తగ్గ థీమ్‌ ఏమిటో గుర్తించాలి. అలా గుర్తించిన థీమ్‌ను యాక్టివేట్‌ చేసుకుని ఉపయోగించాలి. ఇంకా ఉచితంగా బించే మరిన్ని థీమ్స్‌ లిస్ట్‌ ఇలా ఉంది … One Column, WP Jurist, ZeeMinty, Hannari, Writr, Hueman, Modern Real Estate,White Paper, Mountain Creek, ProMax, Time Turner , The Newswire, WiziApp … మొదలైన థీమ్స్‌ పేర్లు ద్వారా అ థీమ్‌ ఎక్కడ ఉందో వర్డ్‌ప్రెస్‌లోనే సెర్చింగ్‌ చేయడం ద్వారా వాటిని పొందవచ్చు. వర్డ్‌ప్రెస్‌ సాఫ్ట్‌వేర్‌లోనే ఉంటే అక్కడే యాక్టివేట్‌ చేస్తే థీమ్‌ వాడుకలోకి వస్తుంది. ఇక నేరుగా మీరు వెబ్‌ పేజీ కోసం థీమ్‌ను కస్టమైజ్‌ చేస్తూ వెబ్‌డిజైనింగ్‌ చేయవచ్చు.అక్కడ లేకపోతే వర్డ్‌ప్రెస్‌ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. ఉచితంగా బించే మరిన్ని వర్డ్‌ ప్రెస్‌ థీమ్స్‌ పేర్లును ఇక్కడ అందిస్తున్నాం. పైన చెప్పుకున్న వాటికి ఇవి అదనం … Twenty Fourteen, Asteria Lite, ButterBelly, Dark Orange, Dellow, Flounder, Inkness, Medicine, One Page, Osiris, Premium Style, Interface, Bunny, Looki Lite, Padhang, Radiant, Stork, Tonal, Vision, VRYN Restaurant … ఇలా అనేక రకాల‌ ఉచిత థీమ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ థీమ్‌ను ఉచితంగా బిస్తుందో వాటి పేరు తెలియాలి. లేదంటే ప్రతి థీమ్‌ను ఉపయోగిస్తుంటే .. ఇది పూర్తిగా ఉచితం కాదు కొన్ని ఫీచర్స్ కోసం డబ్బు చెల్లించాలి .. వంటి మేసేజ్‌లు చూస్తుంటాం. ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే వర్డ్‌ప్రెస్‌ థీమ్స్‌లో ఉచితంగా బించేవి ఏమిటి .. వాటి పేర్లను ఇచ్చాం.. దీని వన ఉచిత థీమ్స్‌ కోసం వెతకకుండా ఈ పేరు ద్వారా వాటిని పొందగల‌రు. సొంతంగా కూడా నేరుగా వ‌ర్డ్‌ప్రెస్ డ్యాష్‌బోర్డ్‌లోనే థీమ్స్‌ను సెర్చింగ్ చేసి యాడ్ చేసుకోవ‌చ్చు. గూగుల్ నుంచి సెర్చింగ్ చేసి కూడా పొంద‌వ‌చ్చు.

Note  : ఇంట‌ర్నెట్‌లో అనేక వెబ్‌సైట్స్‌ను ఈ సిఎంఎస్ సాఫ్ట్‌వేర్స్ ద్వారానే త‌యారు చేస్తున్నారు. చాలా వ‌ర‌కు ఫీచ‌ర్స్‌ను ఈ సిఎంఎస్ సాఫ్ట్‌వేర్స్ అందిస్తున్న కార‌ణంగా మ‌నం ఎటువంటి వెబ్‌సైట్‌నైనా సులువుగా త‌యారు చేయ‌గ‌లం. కొన్ని గ‌ణాంకాల ప్ర‌కారం స‌గానికి పైగా వెబ్‌సైట్స్ ఈ సిఎంఎస్ టూల్స్ (వ‌ర్డ‌ప్రెస్‌, జుమ్లా, డ్రుపాల్) ద్వారానే తయారు చేస్తున్నారు.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *