వీడియో ఎడిటింగ్‌లో ఉప‌యోగ‌ప‌డే ప‌లు ఆన్‌లైన్‌ టూల్స్‌

ఆన్‌లైన్‌లో నేడు ప్రతిదీ ఉచితంగానే ల‌బిస్తుంది. పెయిడ్‌ సర్వీస్‌లు ఉన్నప్పటికీ, అత్యధికంగా ప‌లు సర్వీస్‌లు ఉచితంగానే ల‌బిస్తున్నాయి. ముఖ్యంగా ఓపెన్‌సోర్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సాఫ్ట్‌వేర్స్‌ ఉచితంగానే ల‌బిస్తున్నాయి. పెయిడ్‌ సాఫ్ట్‌వేర్స్‌ కంటే ఇవే బాగా పని చేస్తున్నాయి. ఓపెన్‌సోర్స్‌లో అనేక టూల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించవచ్చు. ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించకుండానే, నేరుగా ఆన్‌లైన్‌లోనే సాఫ్ట్‌వేర్స్‌ను ఉపయోగించేలా ప‌లు ఆన్‌లైన్‌ సర్వీస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీడియో ఎడిటింగ్‌లో ఉపయగించే పలు రకాల‌ ఆన్‌లైన్‌ ఎడిటర్స్‌ గురించి తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌ వీడియో ఎడిటర్స్‌ ద్వారా మీ వీడియోను ఎడిట్‌ చేయడం సువే. ఇంటర్నెట్‌ స్పీడ్‌ అలాగే సిస్టమ్‌లోని ర్యామ్‌ ఎక్కువగా ఉండాలి. వీడియో మొమోరీ ఎక్కువగా ఉంటుంది కావున సిస్టమ్‌ ప్రాసెసర్‌, ర్యామ్‌ కాస్త అడ్వాన్స్‌డ్‌ అయితేనే బాగుంటుంది.
స్మార్ట్‌ ఫోన్స్‌ వచ్చిన తర్వాత అనేక మంది వీడియోల‌ను, పోటోల‌ను సొంతంగానే ఎడిట్ చేసుకోవ‌డం ప్రారంబించారు. నేడు ప్రతి ఒక్కరు
ఒక పోటో, వీడియోగ్రాఫరే. మీ వద్ద వీడియోను ఎడిటింగ్‌ చేయాంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న వీడియోల‌ను నేరుగా ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్స్‌ను ఉపయోగించి సులువుగా చేయగల‌రు. ఆన్‌లైన్‌లో ప‌లు వీడియో ఎడిటర్స్‌ వాడుకలో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా మీ వీడియోల‌ను మీరే ఎడిటింగ్‌ చేయగల‌రు.
youtube, vine, instagram, vimeo … వంటి ప‌లు వెబ్‌సైట్స్‌లో వీడియోను అప్‌లోడ్‌ చేస్తుంటాం. స్మార్ట్‌ఫోన్‌ ద్వారాను లేదా
సిస్టమ్‌లోని స్క్రీన్‌ కాస్టింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తయారు చేసే వీడియోల‌ను మరింత అందంగా తయారు చేయాంటే వీడియో ఎడిటర్స్‌ అవసరం ఉంది.
Youtube Editor (youtube.com/editor)

As of September 20, 2017, Video Editor is no longer available. Any videos published with the Video Editor before September 20 have not been affected.

You can continue to use these other YouTube features like add clips, trim clips, add effects, add music to edit your videos.

వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్స్‌లో కల్లా యుట్యూబ్‌ వెబ్‌సైట్‌ బాగా వాడుకలో ఉంది. అనేక మంది వీడియోల‌ను చూడటం, అక్కడే అప్‌లోడ్‌ చేయడం చేస్తున్నారు. వీడియోల‌ను ఎడిటింగ్‌ చేయడం కోసం యుట్యూబ్‌ ప్రత్యేకంగా ఎడిటర్‌ను అందిస్తుంది. యుట్యూబ్‌ వీడియో ఎడిటర్‌ అందించే ప‌లు ఫీచర్స్‌ ద్వారా వీడియో ఎడిటింగ్‌ను సులువుగా నిర్వహించగల‌రు. వీడియోల‌ను ట్రిమ్మింగ్‌ చేయడం, వీడియోల‌ను కల‌పడం చేయగలం. వీడియోల‌కు అడియో, మ్యూజిక్‌ను కల‌పవచ్చు. యుట్యూబ్‌లోనే సౌండ్‌ ట్రాక్స్‌ ఉంటాయి. నచ్చిన వాటిని మీ వీడియోల‌కు కల‌పవచ్చు. వీటితో పాటుగా కొన్ని రకాల‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, బ్లరింగ్‌ టూల్స్‌ … వంటివి కూడా ఇక్కడ ల‌బిస్తాయి. యుట్యూబ్‌లో అనేక ఉచితంగా ల‌బించే క్రియేటివ్‌ వీడియోలు ఉంటాయి. వీటిని మీ వీడియో ప్రాజెక్ట్‌లో ఉపయోగించవచ్చు.


Wondershare Filmora (https://filmora.wondershare.com/)
వీడియో ఎడిటింగ్‌లో ఉపయోగపడే మరో ఉచిత ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేరే ఫిల్‌మోరా. వీడియో క్లిప్స్‌ను కల‌పడం, ట్రిమ్‌ చేయడం, టెక్స్‌ట్‌ను కల‌పడం, అడియోల‌ను కల‌పడం .. వంటివన్నీ చేయగలం. ఉపయోగపడే ప‌లు వీడియో ఎఫెక్ట్‌ల‌న్నీ ఈ ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌లో ల‌బిస్తాయి.
Kaltura (corp.kaltura.com)
ఓపెన్‌సోర్స్‌ వీడియో ఎడిటింగ్‌ టూల్స్‌లో ఇది మొదటిగా గుర్తింపును పొందింది. ఇతర వీడియో ఎడిటర్స్‌లో కూడా లేని అనేక ఫీచర్స్‌
ఇందులో ల‌బిస్తాయి. ఇక్కడ మీ వీడియో ఎడిటింగ్‌ను సపోర్ట్‌ చేసే అనేక ఎడిటింగ్‌ టూల్స్‌ బిస్తాయి. వీటి ద్వారా మీ వీడియోను సులువుగా ఎడిటింగ్‌ చేయగలం.
Video tool box (videotoolbox.com)
ఈ వీడియో ఎడిటర్‌లో ఎడిటింగ్‌ టూల్స్‌తో పాటుగా ఫైల్‌ మేనేజర్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా ఇతర వెబ్‌సైట్స్‌లోకి ఇక్కడి నుంచే
వీడియోల‌ను అప్‌లోడ్‌ చేయవచ్చు.”adding watermarks, cropping, merge, demux, hand code subtitles” వంటి
ప‌లు రకాల‌ ఫీచర్స్‌ను ఇది అందిస్తుంది. ఈ టూల్‌ ద్వారా వెబ్‌క్యామ్‌ నుంచి, వీడియో కాస్ట్‌ నుంచి వీడియోను రికార్డు చేయగలం. వీడియో ఫైల్స్‌ను ఒక ఫార్మాట్‌ నుంచి వేరొక ఫార్మాట్‌కు కన్వర్ట్‌కూడా చేస్తుంది. 3GP, AMV, ASF, AVI, MOV, MP4, MPG, VOB, WMV …
వంటి ప‌లు ఫైల్‌ ఫార్మాట్స్‌ను ఇది సపోర్ట్‌ చేస్తుంది.
Mixer factory (mixerfactory.com)
చాలా సింపుల్‌ వీడియో ఎడిటింగ్‌ టూల్‌. ప‌లు రకాల‌ టెంప్‌లెట్స్‌, ఫీచర్స్‌ను ఇది అందిస్తుంది. ()transition, text, video, sound effects, frame level cutting .. వంటి పలు ర‌కాల ఫీచర్స్‌ను ఇది అందిస్తుంది.
Magisto (magisto.com)
ఇది కూడా చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ అనేక రకాల పీచర్స్‌ను ఇది అందిస్తుంది. సాధారణంగా ఒక వీడియో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో
ఎటువంటి ఫీచర్స్‌ ఉంటాయో .. అటువంటి ప‌లు ఫీచర్స్‌ దాదాపుగా ఇది కూడా సపోర్ట్‌ చేస్తుంది.
నోట్‌ : ఆన్‌లైన్‌ టూల్స్‌ ద్వారా ప్రొఫెషనల్‌ వీడియోల‌ను తయారు చేయలేనప్పటికీ, కామన్‌గా ఉండే ఫీచర్స్‌ను అన్నింటిని పొందగలం.
వీడియో ఎడిటింగ్‌ హాబీగా ఉన్నవారికి ఇటువంటి టూల్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. కలెక్ట్‌ చేసుకున్న వీడియోల‌ను ఈ టూల్స్‌ ద్వారా ఎడిటింగ్‌ చేసి అవసరమైతే ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్‌ కూడా చేయవచ్చు.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *