ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల‌ను ఇలా నిర్వ‌హించి చూడండి

ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల‌ను ఉపయోగించే స‌మ‌యంలో ఈ 8 త‌ప్పుల‌ను మీరు చేస్తున్నారా..! కంప్యూటర్స్‌ను ఉపయోగించడంలోనే
కాదు… జనరల్‌గా కూడా ఇలా చేస్తే తప్పు అంటే .. అలానే చేస్తుంటాం. అత్యదిక శాతం మంది ఇలానే చేస్తుంటారు. ల్యాప్‌టాప్‌,
డెస్క్‌టాప్‌ల‌ను ఉప‌యోగించేవారు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే వాటి లైఫ్ టైమ్ పెరుగుతుంది. వేగంగా కూడా ప‌నిచేస్తాయి.
కంప్యూట‌ర్ యూస‌ర్స్ వాటిని ఉప‌యోగించే విష‌యంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్స్‌ ఉపయోగించే వారిలో
ఈ దోరణి ఎక్కువగా ఉంటుంది. మన అవసరాల‌కు కంప్యూటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంటే దాని సక్రమంగా నిర్వహించుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అప్పుడే కంప్యూటర్‌ మన మాట వింటుంది. వేగంగా కూడా పనిచేస్తుంది.


ఈ 8 టిప్స్‌ను పాటించి చూడండి
పీసీ యూసర్స్‌ 8 రకాలుగా పీసీ పనితనాన్ని స్వయంగా వారే పాడు చేస్తున్నారు. దాంతో పనిచేయాల్సిన దానికంటే నెమ్మదిగా
మీ కంప్యూటర్‌ పనిచేస్తుంది. తరుచుగా ఎర్రర్ మేసేజ్‌లు రావడం, సిస్టమ్‌ స్లోగా పనిచేయడం, స్ట్రక్‌ కావడం, కొన్ని ప్రొగ్రామ్‌లు ఓపెన్‌
కాకపోవడం… వంటి సమస్యల‌న్నీ కూడా వస్తుంటాయి. ఇంతకీ మనం చేసే 8 తప్పులు ఏమిటి…?
1. సరైన గాలి లేకపోవడం …
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల‌న్నీ కూడా వాటిని తయారు చేసే సమయంలో లోపల‌ ఉండే వేడిని పోయే విధంగా ఫ్యాన్స్‌ను అమర్చి ఉంటారు. కంప్యూటర్స్‌తో పనిచేసే సమయంలో లోపలి వేడి పుడుతుంది. లోపలి ఈ వేడిని బయటకు పంపడానికే ఈ ఫ్యాన్స్, ఎయిర్ వెంట్స్ ఉపయోగపడతాయి. కానీ మనం సిస్టమ్‌ను సరైన గాలి రాని చోట అలాగే డెస్క్‌ కిందను, అలాగే గోడకు తగిలేటట్టు పెట్టడం ద్వారా .. కంప్యూటర్‌కు ఊపిరి అగకుండా చేయడమే అవుతుంది. కంప్యూటర్స్‌ లోపలి గాలి బయటకు వచ్చే విదంగా ఉండాలి.
అలాగే మనం పనిచేస్తున్న చోట తగినంత గాలి వచ్చేలా ఉండాలి. అది మన అరోగ్యానికి కూడా ముఖ్యమే కదా మరి.
లోపలి ఉండే వేడి గాలి బ‌య‌ట‌కి పోయేలా మనం చూడాలి. ల్యాప్‌టాప్‌ను కూడా బెడ్‌పైన పెట్టి, దిండుపై, మీ కాళ్లపై ..
ఇలా ఉపయోగించడం వల‌న కూడా గాలి బయటికి రాదు. ల్యాప్‌టాప్‌ కింది బాగాన, సైడ్‌ బాగాన గాలి పోవడానికి వీలు ఉంటుంది.
అలాగే ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌ను పెట్టి ఉపయోగించడం కోసం ఎక్స్‌టర్నల్‌ ఫ్యాన్ కేస్‌లు వస్తున్నాయి. వీటిని ఉపయోగించి చూడండి.
2. విపరీతమైన డస్ట్‌ పేర్కొని పోవడం ద్వారా…
ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్స్‌ను కొంత కాలం ఉపయోగించిన తర్వాత ఓపెన్‌ చేసి చూడండి. విపరీతంగా డస్ట్‌ పేర్కొని ఉంటుంది. అయినపప్పటికీ ఈ డివైజ్‌లు చక్కగా పనిచేస్తుంటాయి. ఎందుకంటే డస్ట్‌,హీట్‌కు తట్టుకునేలా వీటిని తయారు చేసారు.
కానీ డస్ట్‌ ఎక్కువయ్యే కొద్ది, ఎల‌క్ర్టానిక్ డివైజ్‌ లైప్ స్పాన్‌ తగ్గుతుంది. కావున ఖచ్చితంగా డస్ట్‌ను బ్లోయర్‌ ద్వారా క్లీన్‌ చేసుకోవాలి.
కొన్ని సిస్టమ్స్‌లో సంవత్సరాల‌ తరబడి డస్ట్‌ పేర్కొని ఉంటుంది. విపరీతమైన డస్ట్‌ ఉంటుంది. ఫాన్స్‌, ఎయిర్ వెంట్స్ దగ్గర డస్ట్‌ పేర్కొని పోవడం, మదర్‌బోర్డ్‌ మొదలుకుని ప్రతి కాంపోనెంట్‌ దగ్గర విపరీతంగా డస్ట్‌ పేర్కొని ఉంటుంది. దీని వన సిస్టమ్‌ ఖచ్చితంగా నెమ్మదిగా పనిచేస్తుంది. 90 శాతం మంది డస్ట్‌ను పట్టించుకోరు. తప్పకుండా మీ ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ను కూడా క్లీనింగ్‌ చేసుకొండి. ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల‌ను క్లీనింగా ఉంచ‌డం ద్వారా తేడా మీకే తెలుస్తుంది.
3. కేబుల్స్ లూజ్‌గా ఉండటం ..
కంప్యూట‌ర్ ఆన్‌ కావడం లేదంటే కామన్‌గా చెప్పే సమస్య కేబుల్స్ లూజ్‌గా ఉన్నాయా, లేదా కనెక్ట్ కాలేదా అని చెక్‌ చేసుకుంటాం.
సిస్టమ్‌ యూనిట్‌కు పవర్‌నిచ్చే పవర్‌ కేబుల్ లూజ్‌గా ఉండే అవకాశం ఉంది. సిస్టమ్‌ యూనిట్‌ లోపల‌ కూడా కేబుల్స్ లూజ్‌గా ఉండవచ్చు. మదర్‌బోర్డ్‌ నుంచి వెళ్లే పు కనెక్షన్స్‌ ఎలా ఉన్నాయో చెక్‌ చేసుకోవాలి. ఇవన్నీ లూజ్‌గా ఉండకుండా చూడాలి.
4. విద్యుత్‌ హెచ్చు, తగ్గులు…
Power surges కారణంగా అనేక సమస్యను మనం చూస్తూ ఉంటాం. ఇంట్లోని ఎక్ట్రానిక్ డివైజ్‌లు కాలిపోవడం మనం చూస్తూ ఉంటాం.
పీసీ వరకు గమనిస్తే విద్యుత్‌ హెచ్చు,తగ్గులు వల‌న సిస్టమ్‌లోని మదర్‌ బోర్డ్‌, పవర్‌ సప్లై యూనిట్‌, హార్డ్‌డిస్క్‌…వంటివి కాలిపోవడానికి అవకాశం ఉంది. కావున దీనికి పరిష్కారం విద్యుత్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రత్యేకంగా యుపిఎస్‌ను ఉపయోగించండి.
5. అలాగే తరుచుగా పవర్‌కట్స్‌ కూడా ఉంటాయి.
వీటి వల‌న నేరుగా సిస్టమ్‌ ఆఫ్‌ అవుతూ ఉంటుంది. దీని వల‌న సిస్టమ్‌లోని సాఫ్ట్‌వేర్స్‌ కరప్ట్‌ కావడానికి అవకాశం ఉంది.
మద్యలోనే అగిపోవడం ద్వారా చేస్తున్న పనికి సంబందించిన డేటా కూడా లాస్‌ అయ్యే మీంది. కావున ఇంటిలో ఇన్వర్టర్‌ లేదా యుపిఎస్‌, త‌ప్ప‌నిస‌రిగా ఉపయోగించాలి.
6. ల్యాప్‌టాప్‌ బ్యాటరీ గురించి …
ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్‌ తగ్గకుండా చూసుకోవాలి. బ్యాటరీ డ్రైన్‌ అవడానికి కొన్ని కారణాల‌ను ఇక్కడ గమనిద్దాం. ల్యాప్‌టాప్‌ ఎక్కువగా
హీట్‌ కావడం ద్వారా అనేక సమస్యలు ఉంటున్నాయి. వీటిలో ఒకటి బ్యాటరీ డీగ్రేడ్‌ అవుతుంది. ల్యాప్‌టాప్‌ ఎప్పుడూ చార్జింగ్‌ అవుతూనే ఉండాల‌ని లేదు. మీరు మీ డెస్క్‌పై పెట్టి ఉపయోగిస్తున్నప్పటీకీ బ్యాటరీ ద్వారానే కాసేపు ఉపయోగించండి. చార్జింగ్‌ అవసరమైన ప్పుడు చేయండి. అలాగే బ్యాటరీ పూర్తిగా చార్జింగ్‌ అయిపోయే వరకు ఉండకూడదు. ఎప్పటికీ తగినంత చార్జింగ్‌ ఉండాలి. ఆఫీస్‌లోనే ఎక్కువ సేపు ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తుంటే 100 శాతం చార్జింగ్‌ వచ్చిన తర్వాత, ఇంకా చార్జింగ్ అవసరం ఉండదు కదా. నేరుగా బ్యాటరీ ద్వారానే ల్యాప్‌టాప్‌ను ఉపయోగించండి.
7. పిజికల్‌ డ్యామేజీ …
ల్యాప్‌టాప్‌కు తరుచుగా ఇలా జరుగుతుంది. పొరపాటున ల్యాప్‌టాప్‌ కింద ప‌డ‌టం ద్వారా స్క్రీన్‌ పాడు కావడం జరుగుతుంది. ఈ స్క్రీన్‌ను మార్చడానికి అవకాశం ఉంది. కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ. త‌రుచుగా కింద పడ‌టం ద్వారా ల్యాప్‌టాప్ ప‌నిచేస్తూ ఉండ‌వ‌చ్చు. కానీ
మున్ముందు స‌మ్య‌స‌లు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. ల్యాప్‌టాప్‌ను స‌క్ర‌మంగా జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించ‌డం ఎంతైనా అవ‌స‌రం.
8. సాఫ్ట్‌వేర్‌ సమస్యలు…
కంప్యూటర్‌కు హార్డ్‌వేర్‌ ద్వారా వచ్చే సమస్యతో పాటు సాఫ్ట్‌వేర్‌ ద్వారా కూడా సమస్యలు ఉంటాయి. ఎర్రర్‌ మేసేజ్‌లు రావడం,
కొన్ని రకా ఫైల్స్‌ ఓపెన్‌ కాకపోవడం, సాఫ్ట్‌వేర్స్‌ ఓపెన్‌ కాకుండా స్ట్రక్‌ కావడం.. వంటి సమస్యలు సాఫ్ట్‌వేర్స్‌ ద్వారానే వస్తుంటాయి.
ఓరిజనల్‌ ఓఎస్‌ను ఉపయోగిస్తుంటే తప్పకుండా అప్‌డేట్‌ చేయాలి. పైరేటెడ్‌ ఓఎస్‌ను ఉపయోగిస్తుంటే అప్‌డేట్స్‌ చేయకూడదు.
అయితే కొన్ని రకాల‌ ఉచిత సాఫ్ట్‌వేర్స్‌ను అవసరం అనుకుంటే అప్‌డేట్‌ చేసుకొండి. అనవసరంగా ఉండే సాఫ్ట్‌వేర్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌
చేయండి.
సిస్ట‌మ్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్స్‌ను ఖచ్చితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్స్‌లో ఓరిజనల్‌ సాఫ్ట్‌వేర్స్‌ కానీ లేదా ఉచితంగా
ల‌బించే బెస్ట్‌ సాఫ్ట్‌వేర్స్‌ను కానీ ఉపయోగించండి. క్యాస్పర్‌ స్కై, క్విక్‌హీల్‌, ఎవిజి, నార్టన్‌, అవాస్ట్‌ .. వంటి సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్స్‌
అందుబాటులో ఉన్నాయి. ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్స్ విష‌యంలో పెయిడ్ వాటిని ఉప‌యోగించ‌డం ద్వారా స‌మ‌ర్ద‌వంతంగా
ప‌నిచేస్తాయి. రెగ్యుల‌ర్‌గా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. కేవ‌లం యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ కాకుండా, కంప్లీట్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్‌ను
ఉప‌యోగించ‌డం మంచిది. రూ. 400 నుంచి రూ.800 లోపు ప‌లు సాఫ్ట్‌వేర్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక సంవ‌త్స‌రం వాలిడీటితో వ‌చ్చే వీటిని 365 రోజుల పూర్త‌యిన వెంట‌నే రెన్యూవ‌ల్ చేసుకుంటే స‌రిపోతుంది.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *