యోగా నేర్పించే యాప్స్ మీ కోసం…

మనందరి జీవితాల్లో యోగా, మెడిటేషన్‌ అనేవి చాలా ముఖ్యమైవి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని అచరిస్తూ ఉంటారు.
ఇటీవల‌ మన దేశ ప్రదాని కూడా యోగా అవశ్యకత గురించి ఒక ప్రత్యేక ప్రొగ్రాం ద్వారా తెలియచేసారు. ప్ర‌తి సంవ‌త్స‌రం కూడా యోగా డేను
జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. టెక్నాజీతో యోగా అనేది చాలా సింపుల్‌గా మనం నేర్చుకునే అవ‌కాశం ఉంది.
ఇప్పటికే ఆన్‌లైన్‌లోని వీడియో షేరింగ్‌ వెబ్‌సైట్స్‌ ద్వారా యోగా క్లాస్‌ను ఉచితంగా పొందుతున్నాం. యోగా గురించి తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా పలు రకాల‌ యాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని పెయిడ్‌ కాగా.. చాలా వరకు యాప్స్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించగం.

యోగా నేర్పించే యాప్స్‌ మీ కోసం …
యోగా ప్రాముఖ్యత తెలిసి అల‌వాటు చేసుకుంటూ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కావున ప్రతి ఒక్కరు యోగాను
దానితో పాటుగా మెడిటేషన్‌ అలవాటు చేసుకుంటే మంచిది. యోగా నేర్చుకోవానుకునే పట్టుదల‌ ఉంటే ఎక్కడికో వెళ్లకుండానే
మీ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా యోగాను సులువుగా స్టెప్‌ బై స్టెప్‌ నేర్చుకునే అవకాశం ఉంది. యోగా క్లాస్‌కు రెగ్యుల‌ర్‌గా వెళ్లే అవకాశం లేని వారు ఇటువంటి యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అనేక యోగా యాప్స్‌ ఉన్నప్పటికీ వీటిలో ఉపయోగపడే చక్కటి కొన్ని రకాల‌ యాప్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం.

పాకెట్‌ యోగా … సాధారణంగా యాప్స్‌ పనిచేయాలంటే తప్పకుండా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే
ఆఫ్‌లైన్‌లో కూడా యాప్స్‌ను ఉపయోగించేలా ఈ యోగా యాప్‌ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ ద్వారా యోగాలో స్టెప్‌ బై స్టెప్‌
చేయాల్సిన యోగాసనాల గురించి ఇమేజ్‌ల‌ ద్వారా చక్కగా వివరిస్తుంది. మొదటగా నేర్చుకునే వారికి ఉపయోగపడేలా నియమాలు
లేకుండా పలు రకాల‌ అసనాల ఇమేజ్‌లు ఉంటాయి. దీని వల‌న కాస్త ఇబ్బంది ఉంటుంది. ఈ యాప్‌ను ఉచితంగా పొంద‌గ‌ల‌రు.
ఎప్పటికప్పుడు కొత్త, కొత్త అసనాల‌ డేటాను ఇమేజల‌తో సహా అందిస్తూ ఉంటుంది.

యోగా.కామ్‌ యాప్‌ … ఈ యాప్‌ ద్వారా కూడా యోగా క్లాస్‌ను పొందవచ్చు. ఇందులో మొత్తం 300 రకా యోగాసనాలు గురించి ఉంటుంది. ఉచితంగా ఈ యాప్‌ను మీ అండ్రాయిడ్‌ ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించవచ్చు. ఇమేజ్‌లు, డయాగ్రమ్స్‌, వీడియో డెమోతో  ఈ యాప్‌ యోగా నేర్చుకోవానుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది.

ఎక్‌హార్ట్‌ యోగా … ఇది వరకు చెప్పుకున్నట్టు యుట్యూబ్‌లో కూడా మనకు అనేక రకాల‌ యోగా వీడియోలు ల‌బిస్తున్నాయి. ఇప్పటికే  వీరు యుట్యూబ్‌లో వీడియోల‌ను అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదనంగా “Ekhart Yoga” పేరుతో యోగా యాప్‌ను కూడా తయారు  చేసారు. ఈ యాప్‌ని ఉపయోగించాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక్కడ చెప్పుకునే ఈ యాప్స్‌ కాకుండా యోగా టైమర్‌ “Yoga Timer” అనే మరో యాప్‌ కూడా ఉంది. ఇది ఉచితంగా బిస్తుంది. బిగినర్స్‌కు కూడా అర్థమయ్యేలా చాలా చక్కగా ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.”Yoga Meditation Music” అనే మరో యాప్‌ కూడా యోగా నేర్చుకోవానుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది.

అన్నీ ఉచిత‌మే… యోగాకు సంబందించిన ప‌లు యాప్స్ ఉచితంగానే ల‌బిస్తున్నాయి. యాప్స్ ద్వారా కంటే మ‌రింత సులువుగా
వీడియోలు పొందాలంటే యుట్యూబ్ బెస్ట్ సోర్స్ అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో అనేక ర‌కాల చానల్స్ యోగాకు సంబందించిన
వీడియోల‌ను ఉచితంగా అందిస్తున్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుని వీలున్న స‌మ‌యంలో చూడ‌వ‌చ్చు. యుట్యూబ్ యాప్‌లో కూడా ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది కావున ఉచితంగా ల‌బించే యోగా వీడియోల‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్ప‌డు చూసుకునే వీలుంది.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *