యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేష‌న్‌ నోటిఫికేషన్‌ విడుదల

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్ నోటిఫికేషన్‌ విడుదల

దూరవిద్యా విధానంలో కేవలం సంప్రదాయ కోర్సులే కాకుండా, ప్రస్తుత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని పలు రంగాలకు సంబందించిన కోర్సులను అత్యున్నత ప్రమాణాలతో అందిస్తే … అ కోర్సుల పట్ల ప్రతి ఒక్కరు మక్కువ చూపుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉన్నత స్థాయి పోస్ట్‌ గ్రాడ్యుయేష‌న్ డిప్లమో కోర్సులను ‘యూనివ‌ర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ – సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ & వర్చువల్‌ లెర్నింగ్‌ ‘ సెంటర్‌ ద్వారా గత ద‌శాబ్దానికిపైగానే అందిస్తుంది. విద్యార్థులతో పాటు ఇప్ప‌టికే ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారు కూడా ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారంటే , ఈ కోర్సులకు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. శిక్షణా తరగతుల నిర్వహణ, స్టడీ మెటీరియ‌ల్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌ నిర్వహణ … తదితర వాిని అయా రంగాల నిపుణులతో పర్యవేక్షించడం వల్లనే ఈ 15 రకాల కోర్సులకు మంచి గుర్తింపు వచ్చింది.

నోటిఫికేషన్‌ విడుదలైంది..
యూనివ‌ర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ .. సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌  సెంటర్‌ ద్వారా అందించే 15 రకాల పోస్ట్‌ గ్రాడ్యుయేష‌న్ డిప్లొమా కోర్సులను కరస్పాండెన్స్‌ కమ్‌ కాంక్ట్‌ పద్ధతిలో ఆఫర్‌ చేస్తుంది. ఇందులో మేనేజ్‌మెంట్‌, లా, సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, లాంగ్వేజ్‌, లైబ్రరీ & అటోమేషన్‌, క్రిమినల్‌ జస్టిస్‌, గవర్నెస్‌, హ్యూమన్ రైట్స్‌, మెడిష‌నల్‌ బోటనీ, ప్రొజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌…
తదితర పలు రకాల సబ్జెక్ట్‌లకు సంబందించిన కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులలో ప్రవేశం కోసం ఇటీవ‌లనే నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
ఆసక్తి కల అభ్యర్థులు www.uohyd.ac.in  వెబ్‌సైట్ ద్వారా లేదా 040-24600264 పోన్‌ నంబర్‌ ద్వారా పూర్తి వివరాలు పొందగలరు.

అతున్నత స్థాయి ప్రమాణాలతో శిక్షణ …
నాణ్యమైన విద్యనందించడంతో పాటు డీఈసీ-యుజీసీ నార్మ్‌కు అనుగుణంగా ఉండే విధంగా సిలబస్‌ను రూపొందించారు. ఇందుకోసం ఇతర యూనివ‌ర్సిటీలకు భిన్నంగా తరగతుల నిర్వహణ, సిలబస్‌ ఫ్రేమింగ్‌, పరీక్షల నిర్వహణ, ప్రాజెక్ట్‌ వర్క్‌ నిర్వహణ… సంబంధిత అంశాల్లో ‘యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌’ రెగ్యులర్‌ ఫ్యాకల్టీ నేరుగా పాలుపంచుకుంటారు. ఆయా విభాగాల్లో నిష్ణాతులైన వారితో గెస్ట్‌ లెక్చర్స్‌ కూడా ఇప్పిస్తారు. ఉదాహరణకు ఫోరెన్సిక్‌ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏపీ ఫోరెన్సిక్‌ లేబోరెటరీ నిపుణులతో ఇంటరాక్షన్‌ సెషన్‌ నిర్వహిస్తారు. ట్రూత్‌ ల్యాబ్స్‌ భాగస్వామ్యంతో కోర్సు నిర్వహణ, స్టడీ మెటీరీయల్‌ రూపకల్పన చేస్తారు. ప్రాజెక్ట్‌ వర్క్‌, ఫీల్డ్‌ వర్క్ వంటి… అంశాలు కూడా కోర్సులో భాగంగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.

రెగ్యులర్‌ కోర్సులతో సమానంగా …
నిపుణులైన ఫ్యాకల్టీ, చక్కి స్టడీ మెిరీయల్‌, ఇండ్రస్టీతో అనుసంధానం, నిష్టాతులతో ప్రాజెక్ట్‌ వర్క్‌ నిర్వహణ, కోర్సులు పూర్తి చేసుకున్న వారికి యూనివ‌ర్సిటీ ప్లేస్‌మెంట్ గైడెన్స్‌… వంటి పలు ఉపయోగాల వలన ఈ కోర్సులు రెగ్యులర్‌ పద్దతిలో అందించే కోర్సులకు కంటే కూడా వినూత్నంగా, నాణ్యతతో అందించబడుతున్నాయనడంలో సందేహం లేదు. ‘యూనివ‌ర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ – సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌’కు హైదరాబాద్‌ మినహా ఎక్కడ స్టడీ సెంటర్లు లేవు. వివిధ చోట్ల నుంచి ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నా నాణ్యత దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో వీటికి అనుమతి ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లోని యూనివ‌ర్సిటీలోనే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. కోర్సులో చేరే వారిలో ఇతర ప్రాంతాల వారు, వేరే రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉంటున్నారు.

2018 సంవత్సరానికిగాను ఇప్ప‌టికే నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. గత సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఈ కోర్సుల పట్ల అసక్తి చూపారు. విద్యార్థులే కాకుండా… ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా రీస్కిల్లింగ్‌ కోసం ఈ కోర్సులలో చేరుతున్నారు. మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఆడ్మిషన్‌ ఉంటుంది. కోర్సుకు కావల్సిన అర్హత.. డిగ్రీలో విద్యార్థులు సాధించిన మార్కులు, ప్రొఫెషనల్‌ ఎక్స్‌పీరియెన్స్‌, ఉన్నత విద్య, తదితర అంశాలను అడ్మిషన్‌ సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు.

ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ని పెంచే ఉన్నత స్థాయి కోర్సులు…


ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ను పెంచుకోవడం కోసం, రీస్కిల్లింగ్‌ కోసం యూనివర్సిటీ అందించే ఈ కోర్సులలో ప్రవేశం పొందవచ్చని ‘సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ & వర్చువల్‌ లెర్నింగ్‌ ‘ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ జిలాని తెలిపారు . యూనివ‌ర్సిటీ ప్రస్తుతం వివిధ విభాగాలకు సంబందించిన 15 రకాల కోర్సులను అందిస్తున్నదని … ఈ కోర్సుల్లో చేరే అభ్యర్థులు స్కిల్స్‌ను పెంచుకోవడం ద్వారా ఉద్యోగ సాధనలో ఇతరుల కంటే ముందు ఉంటార‌ని తెలిపారు. సెంట్రల్ వ‌ర్సిటీ పర్యవేక్షణలో నియమించే నిపుణులైన ఫ్యాకల్టీ ద్వారా అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణ అందుతుందని, తద్వారా అభ్యర్థి తాను చదివే కోర్సులలోని సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయిలో ప్రావీణ్యాన్ని పొందుతారని తెలిపారు. తద్వారా ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ను పెంచుకోవడం కోసం, రీస్కిల్లింగ్‌ కోసం ఈ కోర్సులు చక్కగా ఉపయోగపడతాయని తెలిపారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు www.uohyd.ac.in  వెబ్‌సైట్‌ను బ్రౌజింగ్ చేయ‌గ‌ల‌రు.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *