యుట్యూబ్ ని ఉప‌యోగించ‌డంలో టిప్స్ & ట్రిక్స్‌ – Part 1

యుట్యూబ్‌ను ఓపెన్‌ చేసి వీడియోను చూస్తూ ఉంటాం. కానీ యుట్యూబ్‌కు సంబందించిన ప‌లు విషయాను గమనిస్తే అనేక విషయాలు అవునా..! అనేలా అన్పిస్తుంటాయి. అలాగే యుట్యూబ్‌ను ఉపయోగించే సమయంలో ఉపయోగపడే టిప్స్‌ , ట్రిక్స్ , షార్ట్‌కట్స్ .. గురించి వివరంగా తెలుసుకుందాం.
1. యుట్యూబ్‌ అంటే వినోదమే కాదు…
యుట్యూబ్‌ అంటే అతి పెద్ద వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌. అత్యదిక శాతం మంది యుట్యూబ్‌ అంటేనే సినిమా ట్రైల‌ర్స్‌, టీజర్స్‌, సినిమాలు, సాంగ్స్‌ .. వంటి వాటినే చూస్తూంటారు. వీటితో పాటు పెద్ద మొత్తం నాలెడ్జిని అందించే వీడియోలు ఉన్నాయి. చిన్న చిన్న విష‌యాలు..
మొదుకుని అతి క్లిష్ట‌మైన విష‌యాల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే నాలెడ్జి యుట్యూబ్‌లో ఉంది. ముఖ్యంగా ప్రాక్టికల్‌గా
ఉపయోగపడే విషయాు (DIY Skills – Do it yourself skills) ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా అనేక
విషయాల‌ గురించి మనకు తెలుస్తాయి. అనేక మంది ఇక్కడ అనేక విషయాల‌ గురించి వివరంగా తెలియచేస్తున్నారు.
ఒక విధంగా యుట్యూబ్‌ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద క్లాస్‌రూమ్‌గా చెప్పవచ్చు. కానీ ఉపయోగించుకోవడంలోనే ఉంది తేడా.
యువతలో అత్యదిక శాతం విజ్ఞానాన్ని వదిలేసి, వినోదం కోసం, అన‌వ‌స‌రం విష‌యాల‌ను చూడ‌టం కోసం యుట్యూబ్‌ను
ఎంచుకుంటున్నారు.
2. ఒక నిమిషానికి 500 గంటల‌కు పైగా వీడియోలు
2015 గణాంకా ప్రకారం ఒక నిమిషంలో 400 గంట నిడివి కల్గిన వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. వీటి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం 500 గంటల‌కు నిడివి కల్గిన వీడియోలు ఒక నిమిషం వ్యవధిలోనే అప్‌లోడ్‌ అవుతున్నాయి. యుట్యూబ్‌లో అనేక మంది తమ సొంత చానల్స్‌ను ఏర్పాటు చేసుకుని వీడియోను అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఈ విధంగా ప్రతి నిమిషం.. నిరంతరం వీడియోలు అప్‌లోడ్‌ అవుతూనే ఉంటాయి. ఇది యుట్యూబ్‌లో నిత్యం జరిగే కార్యక్రమమే. ఇంత రెస్పాన్స్‌ ఉన్న కారణంగానే నిత్యం అనేక వీడియోలు మనకు యుట్యూబ్‌లో కన్పిస్తూనే ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాంటే యుట్యూబ్‌ అనేది ప్రతి అంశం గురించి అందించే ఒక ఒకే వీడియో ట్యుటోరియల్‌ వెబ్‌సైట్‌గా చెప్పవచ్చు. యుట్యూబ్‌లో అనేక వీడియోస్‌ ఉన్నప్పటికీ, కెరీర్‌ పరంగా విద్యార్థుకు మంచి కంటెంట్‌ను అందించే అనేక వీడియోస్‌ ఉన్నాయి.వీటిని యువత ఉపయోగించుకోవాలి.
3. ఒక బిలియన్‌కు పైగానే యుట్యూబ్‌ యూసర్స్‌
యుట్యూబ్‌ను ఉపయోగించే వారు నిత్యం పెరుగుతున్నారు. ఒక బిలియన్‌కు పైగానే యూసర్స్‌ యూట్యూబ్‌లో ఉన్నారు. అందుకే యుట్యూబ్‌కు వచ్చే యాడ్‌ రెవెన్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. యుట్యూబ్‌లో కొన్ని రకా వీడియోస్‌ చాలా ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. ఉదాహరణకు Charlie Bit My Finger అనే వీడియోకు అత్యదిక శాతం మంది చూసిన Non-Music వీడియోగా చెప్పవచ్చు. ఇందులో ఎటువంటి ప్రత్యేకత లేకపోయినా కూడా అత్యదిక శాతం మంది చూసారు. ఒక పిల్ల‌వాడి వేలును ఇంకో పిల్ల‌వాడు కొరికినప్పుడు తీసిన  చిన్న వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఇటువంటి అనేక వీడియోస్‌ యుట్యూబ్‌లో అత్యదిక వ్యూస్‌ను సాధిస్తున్నాయి. ఉదాహరణకు ప్రభాస్‌ నటించిన రెబల్‌ మూవీ హిట్‌ను సాధించలేదు. కానీ యుట్యూబ్‌లో కోటి వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
4. యుట్యూబ్‌ను వేగంగా సెర్చింగ్‌ చేయండి
క్రోమ్‌ను ఉపయోగిస్తుంటే నేరుగా యుట్యూబ్‌ను ఓపెన్‌ చేసి సెర్చింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. క్రోమ్స్‌ ఒమినిబాక్స్‌లో
youtube.com అని టైప్‌ లేదా పేస్ట్‌ చేయాలి. తర్వాత ట్యాబ్‌ బటన్‌ హిట్‌ చేయాలి. ఇప్పుడు మీ సెర్చి క్వరీని ఉపయోగించి సెర్చింగ్‌
చేయడం ద్వారా నేరుగా మీ సెర్చింగ్‌ పలితాలు డిస్‌ప్లే అవుతాయి. omnibox ట్రిక్స్‌లో ఇది ఒకటి. బ్రౌజింగ్‌ వేగంగా చేయడంలో
ఇటువంటి అనేక టిప్స్‌ ట్రిక్స్‌ ఉంటాయి. వీటిని కూడా ఉపయోగిస్తూ ఉండాలి.


5. యుట్యూబ్‌ను టివి మాదిరిగా
యుట్యూబ్‌ వెబ్‌ వెర్షన్‌లో అనేక క్లట్టర్‌ మనకు కన్పిస్తూ ఉంటుంది. ఒక విధంగా మనం చూసే వీడియో కంటే ఇతర కంటెంట్‌ ఎక్కువగా కన్పిస్తూ ఉంటుంది. ఇలా కాకుండా యుట్యూబ్‌ను టివిలో మాదిరిగా చూడాంటే చాలా సులువు. “http://youtube.com/tv”  అనే లింక్‌ ద్వారా యుట్యూబ్‌ను ఓపెన్‌ చేస్తే సరిపోతుంది.
6. వీడియోను నెమ్మదిగా చూడాలంటే …
యుట్యూబ్‌ వీడియోలు కాస్త నెమ్మదిగా చూడాలంటే చూడవచ్చు. సాదారణంగా ట్యుటోరియల్‌ వీడియోస్‌ను చూసే సమయంలో
మనకు ఏదేని అర్థం కాకపోతే మళ్లీ చూడాల్సి వస్తుంది. ఇలా కాకుండా వీడియోను నెమ్మదిగా చూడాంటే ఈ కింది విధంగా చేయాలి.
ప్లేయర్‌ కంట్రోల్స్‌ ఉండే speed settings ను క్లిక్‌ చేసి స్పీడ్‌ సెట్టింగ్‌ను మార్చాలి. స్పీడ్‌ సెట్టింగ్‌ను నార్మల్‌ నుంచి 0.5 లేదా
0.25గా ఉంచితే సరిపోతుంది.
7. యుట్యూబ్‌ షార్ట్‌కట్స్‌ …
యుట్యూబ్‌ వీడియోస్‌ను తరుచుగా చూస్తూంటాం. వీడియోస్‌ను చూసే సమయంలో వీడియోను పాస్‌ చేయడం, ప్లే చేయడం, ఫార్వాడ్డ్‌ చేయడం, బ్యాక్‌వార్డ్‌ చేయడం .. వంటివి సువుగా చేయగం. దీని కోసం ప్రతిసారి మౌస్‌ను ఉపయోగించ కుండానే 5 రకాల‌ షార్ట్‌కట్‌ కీస్‌తో యుట్యూబ్‌ వీడియోస్‌ను చాలా చక్కగా సులువుగా, వేగంగా చూడగలిగే అవకాశం ఉంది. ఈ కింది షార్ట్‌కట్‌ కీస్‌ను ఒకసారి గుర్తుపెట్టుకొండి.
1. The J key takes the video backward by 10 seconds.
2. The L key takes the video forward by 10 seconds.
3. The K key allows you to play/pause YouTube videos, just like spacebar does. Sandwiched between the J and L keys, it functions like the Play/Pause button found in media player controls on various
keyboards.
4. The 1-9 keys allow you to skip to certain percentages in the video, so pressing 1 takes you 10% into the video, pressing 2 takes you 20% into the video, etc.
5. The 0 key takes you to the start of the video. This works both when you’re playing the video and when you have paused it.

8. మొబైల్‌ యూసర్స్‌ ఎక్కువే …
ఇటీవల‌ స్మార్ట్‌ ఫోన్స్‌ను ఉపయోగించేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. మొబైల్‌, ట్యాబ్స్‌లోనే ఇంటర్నెట్‌ను ఉపయోగించడం, మెయిల్స్‌ చెక్కింగ్‌, కావాల్సిన వీడియోల‌ను చూడటం.. ఇలా అనేక పనులు చేస్తున్నారు. మొబైల్స్‌ ద్వారానే షాపింగ్‌, బిల్లు కట్టడం వంటివన్ని కూడా చేస్తున్నారు. సూక్ష్మంగా చెప్పాంటే మొదట్లో డెస్క్‌టాప్‌ పీసీను ఉపయోగించేవారు .. తర్వాత ల్యాప్‌టాప్‌ను ఇప్పుడు మొబైల్స్‌, ట్యాబ్స్‌లోనే ఎక్కువగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గణంకాల‌ ప్రకారం యుట్యూబ్‌ను ఉపయోగించే యూసర్స్‌లో సగానికి కంటే ఎక్కువ మంది వీడియోను తమ మొబైల్‌, ట్యాబ్స్‌ ద్వారానే చూస్తున్నారు.
మొబైల్‌లో యుట్యూబ్‌ వీడియోస్‌ను వాచ్‌ చేసే వారు కనీసం అంటే 50 నిమిషాల‌ వరకు పైగానే వీడియోను చూస్తున్నారు.

మ‌రిన్ని యూట్యూబ్ విష‌యాల‌ను రెండ‌వ పార్ట్‌లో తెలుసుకుందాం.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *