యుట్యూబ్ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు – Part 3

యుట్యూబర్స్‌ అనేక రకాలుగా …
యుట్యూబ్‌లో అనేక మంది యుట్యూబర్స్‌ (యుట్యూబ్‌లో చానల్‌ ఓపెన్‌ చేసినవారు) ఉన్నారు. కొంత మంది టెక్నికల్‌ కంటెంట్‌ ఇస్తే కొంతమంది కుకింగ్‌ గురించి అందిస్తున్నారు. ఇలా అనేక మంది యుట్యూబ్‌ ద్వారా వీడియోను అందిస్తూ చాలా డబ్బు గడిస్తున్నారు.ప్ర‌తి విబాగానికి సంబందించిన అనేక చాన‌ల్స్ మ‌న‌కు యుట్యూబ్‌లో క‌నిపిస్తాయి.
చిన్నపిల్ల‌లు చాలా మంది బొమ్మలు కొంటూ ఉంటారు. కొన్నింటిలో తినే పదార్థంతో పాటు బొమ్మ కూడా ఉంటుంది. ఇలాంటి సర్‌ప్రైజ్‌ టాయిస్‌ అన్ని కూడా మార్కెట్లో బాగానే అమ్ముడు పోతుంటాయి. అయితే చిన్న పిల్ల‌లు ఎక్కువగా ఇటువంటి వాటిని కొనలేరు. అప్పుడుప్పుడు సరదాకి కొంటూ ఉంటారు. అయితే చిన్న పిల్ల‌ల‌లో ఈ సర్‌ప్రైజ్‌ టాయిస్‌లో ఏమి ఉంటాయో తెలుసుకోవాల‌నే ఆసక్తి ఉంటుంది. పెద్దవాళ్లకు కూడా ఈ ఆసక్తి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే FunToyzCollector కు సంబందించిన పలు చానల్స్‌ బాగా క్లిక్‌ అయ్యాయి. వీటిని పెట్టిన యుట్యూబర్స్‌ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. అనేక మందికి ఈ సర్‌ప్రైజ్‌ టాయిస్ లోపల ఏమి ఉంటాయో తెలుసుకోవాల‌ని ఉంటుంది. అలాగే కొన్ని చిన్న చిన్న టాయిస్‌ను ఎలా చేయాలో కూడా ఈ వీడియోస్‌లో చూపిస్తుంటారు. ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఇటువంటి క్రియేటివ్ వ‌ర్క్‌లు అనేకం యుట్యూబ్ ద్వారా చేస్తూ మంచి పేరును, డ‌బ్బులు గ‌డించ‌వ‌చ్చు.

టెక్నాజీ కోసం అనేక చానల్స్‌…
యుట్యూబ్‌లో టెక్నాజీ గురించి వివరించే అనేక చానల్స్‌ ఉన్నాయి. సాదారణంగా యుట్యూబ్‌లో సెర్చింగ్‌ చేయడం ద్వారా కూడా ఈ వివరాల‌ను తెలుసుకోవచ్చు. కాకపోతే అనేక టెక్నాజీ చానల్స్‌ ఉన్నప్పటికీ వీటిలో దమ్ముగా ఉన్న టెక్నాజీ చానల్స్‌ చాలా తక్కువే అని చెప్పాలి. ముఖ్యమైన టెక్నాజీ చానల్స్‌ గురించి ఇక్కడ చెప్పుకుందాం. CNET, Mashable, Computer world, Techno Buffalo, Lifhacker, Eli the computer guy, Chris Pirillo, Soldier Knows Best, PC WizKid, Google Tech Talks … వంటి పది రకాల‌ టెక్నాజీ చానల్స్‌ మంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. వీటిలో ఏదేని చానల్‌ను ఓపెన్‌ చేయాంటే నేరుగా యుట్యూబ్‌లో సెర్చింగ్‌ చేయడం లేదా https://www.youtube.com/user/mashable అని బ్రౌజర్‌లో టైప్‌ చేస్తే నేరుగా అ చానల్‌ ఓపెన్‌ అవుతుంది.
యుట్యూబ్‌ ట్రాఫిక్‌ … ఇది నిజమా…!
యుట్యూబ్‌లో ఉండే కంటెంట్‌ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. కాకపోతే యుట్యూబ్‌కు వచ్చే 99 శాతం ట్రాఫిక్‌ కేవం 30 శాతం వీడియోస్‌కు మాత్రమే వస్తుంది. దీన్ని గతంలోనే యుట్యూబ్‌లో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బయటపెట్టాడు. యుట్యూబ్‌లో అనేక వీడియోలు ఉంటున్నప్పుటికీ ఎక్కువ శాతం చెత్తగా ఉన్నట్టే లెక్క. వీటికి వచ్చే వ్యూస్‌ చాలా తక్కువే. అనేక వీడియోను చాలా మంది నెటిజన్స్‌ పట్టించుకోరు. మనం ఇచ్చే వీడియోలో సత్తా ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు.
యుట్యూబ్‌ను పెట్టిన మొదట్లోనే ఈ సైట్‌ బాగా పాపుర్‌ అయింది. దీని వన UTube.com అనే మరో కంపెనీకి అనేక మంది విజిటర్స్‌ వచ్చేవారు. దీంతో కంపెనీకి వచ్చే వెబ్‌సైట్‌కు ట్రాఫిక్‌ ఎక్కువ కావడం నిజమైన కంపెనీ వినియోగ‌దారులు వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయలేకపోవడంతో కంపెనీ ఇబ్బంది పడిన మాట వాస్తవమే. తర్వాత వీరు వారి వెబ్‌సైట్‌ను utubeonline.com గా మార్చుకున్నారు.
యుట్యూబ్‌లో మొదటి వీడియో ఏది…?
యుట్యూబ్‌లో నేడు అనేక వీడియోస్‌ ఉన్నాయి. కానీ మొదటి వీడియో Me at the zoo. ఈ వీడియోను 23rd April 2005 తేధిన co-founder, Jawed Karim అప్‌లోడ్‌ చేసారు.
మరికొన్ని ఆసక్తికరమైన విషయాల‌ గురించి..
అమెరికాలో అనేక మంది మొదట్లో వారి పెంపుడు జంతువుల‌ వీడియోల‌నే ఎక్కువగా అప్‌లోడ్‌ చేసేవారు. యుట్యూబ్‌ను స్థాపించిన Chad Hurley, Steve Chen, and Jawed Karim ముగ్గురు అంతకు ముందు పేపాల్ సంస్థ‌లో పనిచేసేవారు. యుట్యూబ్‌ను స్థాపించిన కొంత కాలానికి వీరు దీన్ని గూగుల్‌కు అమ్మడం జరిగిపోయింది.
యుట్యూబ్‌లో కిడ్స్‌ కోసం..
యుట్యూబ్‌లో కిడ్స్‌ కోసం ఉపయోగపడే ప‌లు ఎడ్యుకేషన్‌ చానల్స్‌ ఉన్నాయి. కిడ్స్‌ కోసం rhymes, stories, funny videos.. అనేకం ఉన్నాయి. గూగుల్‌లో సెర్చింగ్‌ చేస్తే సరిపోతుంది. అయితే కిడ్స్‌ ఉపయోగపడే కొన్ని ఎడ్యుకేషన్‌ చానల్స్‌ ఇలా ఉన్నాయి. Whiz kid science, Reading rainbow, khan academy, TED Ed, Numberphile … వంటి చానల్స్‌ ద్వారా కిడ్స్‌కు మంచి విజ్ఞానాన్ని అందించగం.
యుట్యూబ్‌ను ఇందుకు మెచ్చుకోవాలి…
యుట్యూబ్‌లో పలు రకాల‌ ఆశ్లీల‌ వీడియోస్‌ ఉన్నప్పటికీ వీటికి కొంత పరిమితి ఉంటుంది. అంటే Halfnude వీడియోస్‌ ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే యుట్యూబ్‌లో పూర్తి అశ్లీల వీడియోలు ఎట్టి పరిస్థితులలో పోస్ట్‌ కావు. యుట్యూబ్‌కు ఉన్న టెక్నాల‌జీ కారణంగా ఇటువంటి వాటిని స్కాన్‌ చేసి వాటిని తొల‌గిస్తుంది. కానీ ఫేస్‌బుక్‌లోను వాట్సాప్‌లోను అనేక న్యూడ్‌ వీడియోస్‌ విపరీతంగా సర్కులేట్‌ అవుతున్నాయి. యుట్యూబ్‌లో పూర్తిస్థాయి Porn videos ను పోస్ట్‌ కాకండా నిరోధించడం చాలా మంచిది. అయిన‌ప్ప‌టికీ యుట్యూబ్‌లోని కొన్ని ర‌కాల వీడియోల‌ను పిల్ల‌లు చూడ‌కుండా ప్రైవ‌సీ సెట్టింగ్స్‌ను సెట్ చేసుకోవ‌డం ఎంతైనా అవ‌స‌రం.
యుట్యూబ్‌ చానల్‌ నిర్వహించాంటే..
యుట్యూబ్‌లో అనేక మంది తమ సొంత చానల్స్‌ను నిర్వహిస్తున్నారు. కానీ అనేక చానల్స్‌కు సరైన ట్రాఫిక్‌ లేకపోవడంతో వీరికి యుట్యూబ్‌ నుంచి ఆదాయం ఉండటం లేదు. కావున యుట్యూబర్స్‌ తాము తయారు చేసే కంటెంట్‌లో విషయం ఉందా లేదా అనేది చూడాలి. కంటెంట్‌ను రెగ్యుర్‌గా పోస్ట్‌ చేస్తూ ఉండాలి. కంటెట్‌ కూడా ప్రత్యేకతను కలిగి ఉండాలి. మనం వీడియోస్‌కు ట్రాఫిక్ రావాలంటే వీడియోలో దమ్ము ఉంటే అటోమేటిక్‌గా ట్రాపిక్‌ వస్తుంది. ఇటీవ అనేక మంది విద్యార్థు కూడా యుట్యూబ్‌లో వినూత్నమైన వీడియోను (Short films) తయారు చేసి ఉంచడం ద్వారా పేరొందారు. ఉదాహ‌ర‌ణ‌కు వైవా హ‌ర్ష షార్ట్‌ఫిల్మ్ ద్వారా పేరు పొంది నేడు సినిమా అవ‌కాశాల‌ను కూడా పొందుతున్నారు.
వీడియో క్లిప్స్‌ను GIF రూపంలో…
యుట్యూబ్‌లోని వీడియోను GIF రూపంలోకి కన్వర్ట్‌ చేయవచ్చు. దీని కోసం యుట్యూబ్‌ లింక్‌ను gifyoutube.com గా మార్చాలి. దీని ద్వారా థర్డ్‌పార్టీ సర్వీస్‌కు వెళ్లుతుంది. అక్కడే వీడియోలోని ఎంత బాగాన్ని కావాంటే అంత బాగాన్ని GIF రూపంలోకి మార్చవచ్చు. ఎంత వీడియో కావాలో ప్యారామీటర్స్‌ సెలెక్ట్‌ చేసిన తర్వాత Create GIF ని క్లిక్‌ చేయాలి.
వీడియోను ఎంబెడెడ్‌ చేయవచ్చు..
యుట్యూబ్‌ వీడియోను మీ వెబ్‌సైట్‌లో కావాలంటే షేర్‌ చేయవచ్చు. దీని కోసం వీడియో కింద ఉండే Share లింక్‌ను క్లిక్‌ చేసిన తర్వాత అక్కడ ఉండే కోడ్‌ను కాపీ చేసుకుని మీ వెబ్‌సైట్‌లో పేస్ట్‌ చేసుకోవాలి. అప్పుడు అ వీడియో మీ వెబ్‌సైట్‌లోకి కాపీ అవుతుంది. వీడియోను అక్కడే చూడాంటే చూడవచ్చు. లేదా అక్కడ క్లిక్‌ చేయడం ద్వారా నేరుగా యుట్యూబ్‌లోకి వచ్చి చూడవచ్చు. సిఎంఎస్‌ టూల్స్ (word press, zoomla, drupal) వంటి వాటిలో యుట్యూబ్‌ వీడియోను సులువుగా ఎంబెడెడ్‌ చేసుకుంటూ వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేసుకోవచ్చు.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *