యుట్యూబ్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు … Part 2

అనేక వీడియోల‌ కోసం యుట్యూబ్‌లోనే..
యుట్యూబ్‌లో ల‌క్ష కొద్ది వీడియోస్‌ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిత్యం అనేక సంఘటనలు జరుగుతుంటాయి. వెంటనే అ సంఘటనలు వీడియోల రూపంలో యుట్యూబ్‌లో చేరుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు యుట్యూబ్‌లోకి వెళ్లి వారికి కావాల్సిన వీడియోల‌ను చూస్తున్నారు. ఏదేని మ‌న‌కు న‌చ్చిన వీడియోను చూడాలంటే యుట్యూబ్‌కు వెళ్లి సెర్చింగ్ చేస్తే స‌రిపోతుంది.
లేటెస్ట్‌గా జరిగిన ఎటువంటి వీడియో క్లిప్పింగ్స్‌ అయినా యుట్యూబ్‌లో ల‌బిస్తాయి. టివిలో ఏదేని లైవ్‌ ఈవెంట్స్‌ మిస్‌ అయినా
కూడా వెంటనే యుట్యూబ్‌లో ల‌బిస్తాయి.
వీడియో బఫరింగ్‌ సమయంలో…
యుట్యూబ్‌ వీడియోలు ఓపెన్‌ చేసిన వెంటనే కంటిన్యూగా ప్లే అవుతూ ఉంటుంది. కానీ నెట్‌ స్పీడ్‌ను బట్టి వీడియో ఓపన్‌ అవుతుంది. నెట్‌ కనెక్షన్‌ స్లోగా ఉంటే వీడియో వెంటనే ఓపెన్‌ కాకుండా బఫరింగ్‌ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో యుట్యూబ్‌లోనే arrow key ని ప్రెస్‌ చేయడం ద్వారా snake గేమ్‌ అడవచ్చు.
యుట్యూబ్‌లో కూడా లైవ్‌గా…
యుట్యూబ్‌లో మనం అనేక వీడియోలు చూస్తూ ఉంటాం. మనం చూసే వీడియోలు చాలా వరకు ఇది వరకే అప్‌లోడ్‌ అయి ఉంటాయి. ఇవే కాకుండా అనేక లైవ్‌ ఈవెంట్స్‌ కూడా యుట్యూబ్‌ ద్వారా బ్రాడ్‌కాస్ట్‌ అవుతుంటాయి. అనేక న్యూస్‌ చానల్స్‌ను కూడా యుట్యూబ్‌ ద్వారా చూడగలం. తెలుగులోని అన్ని ర‌కాల చానల్స్‌ యుట్యూబ్‌ ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి. చానల్స్‌ను అందించే మరో వెబ్‌సైట్‌ ఉంది అదే yupp tv.
అమెరికాలో కేబుల్‌ నెట్‌వర్క్‌ కంటే ఎక్కువగానే…
యుట్యూబ్‌ ప్రభావం ఎంతగా ఉందంటే ఇటీవ కాలంలో కేబుల్‌ నెట్‌వర్క్‌ను లేదా టివిని పూర్తిగా పక్కకు తప్పించి యుట్యూబ్‌నే ముందు స్థానంలో ఉంటుంది. అమెరికాలో 18-49 సంవత్సరాల‌ వయస్సులో ఉన్నవారు టివి కంటే యుట్యూబ్‌నే ఎక్కవగా చూస్తున్నారని సర్వేలు చెప్పుతున్నాయి. నెట్‌స్పీడ్‌ ఎక్కువగా ఉంటే మనకు కావాల్సిన ప్రతి వీడియోను కూడా ఎటువంటి బఫరింగ్‌ లేకుండా వేగంగా టివిలో చూసిన విదంగానే యుట్యూబ్‌లో కూడా చూడగం.
ఐదు రోజుల్లో 100 మిలియన్‌ వ్యూస్‌ ..
2015లో “Hello” అనే వీడియో కేవం 5 రోజుల్లోనే 100 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇది ఒక రికార్డు. దీనికి ముందు
Gentleman అనే మరో వీడియో కూడా 100 మిలియన్‌ వ్యూస్‌ మార్క్‌ను దాటింది. Hello వీడియో కేవం 48 గంటలోనే 50 మిలియన్‌ మార్క్‌ను దాటింది. యుట్యూబ్‌లో ఇటువంటి రికార్డు అనేకం జరుగుతుంటాయి.
యుట్యూబ్‌ సెర్చింగ్‌లో ఇవే టాప్‌లో ఉన్నాయి..
యుట్యూబ్‌లో Music and Movies అనే పదాల‌ను మినహాయిస్తే ఇతర పదాలు కూడా బాగా పాపుర్‌ల‌గా ఉన్నాయి. Minecraft”, “Frozen”, “Drake”, “Beyonce”, “PewDiePie”, “Happy” and “Eminem .. వంటి ప‌లు ప‌దాలు యుట్యూబ్‌లో టాప్‌ సెర్చింగ్స్‌ కింద ఉన్నాయి. ఈ ప‌దాలు ట్రెండ్‌ను బ‌ట్టి మారుతూ ఉంటాయి. ఇది గ‌తంలో జ‌రిగిన దానికి ఉదాహ‌ర‌ణ‌గా ఇచ్చాం.
80 శాతం అమెరికా బయటే …
యుట్యూబ్‌ను చూసేవారిలో అత్యధిక శాతం అంటే 80 శాతంకు పైగానే అమెరికా బయట ప్రాంతా నుంచి వ్యూస్‌ వస్తున్నాయి. కేవలం 20 శాతం మాత్రమే అమెరికా నుంచి వ్యూస్‌ వస్తున్నాయి.
అత్యధిక శాతం మంది చూసిన వీడియో ఏది…?
యుట్యూబ్‌లో అత్యదిక శాతం చూసిన వీడియో ఏది అంటే Gangnam Style వీడియో. 2.6 బిలియన్‌కు పైగానే వ్యూస్‌ను కలిగి ఉంది. ఈ పుస్తకం చదివే సమయానికి ఈ కౌంట్‌ కూడా మారిపోవచ్చు. యుట్యూబ్‌లో సాదారణంగా కౌంట్‌ లిమిట్‌ అనేది ఉంటుంది. ఈ లిమిట్‌ను కూడా దాటిపోయింది. యుట్యూబ్‌ను తయారు చేసిన కోడర్స్‌ ప్రతి వీడియోకు కొంత కౌంట్‌ లిమిట్‌ ఉండేలా రాసారు. ఈ కౌంట్‌ లిమిట్‌ 2,147,483,647 ను కూడా Gangnam వీడియో దాటింది.
ఫేస్‌బుక్‌కే ఫాలోయింగ్‌ ఎక్కువా…
ప్రపంచవ్యాప్తంగా యుట్యూబ్‌ ఎంత సంచనం సృష్టించిదో, ఫేస్‌బుక్‌ కూడా అదే రీతిలో నెటిజన్స్‌కు చేరువ అయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఫేస్‌బుక్‌లోకి వెళ్లి అక్కడ వీడియోల‌ను చూస్తున్నారు. ఇక్కడ కూడా అప్‌లోడ్‌ చేసే వీడియోకు యుట్యూబ్‌ లింక్‌ ఉంటుంది. లేదా యుట్యూబ్‌ ద్వారా మనం వీడియోను ఫేస్‌బుక్‌లోని మన అక్కౌంట్‌ ద్వారా షేర్‌ చేయవచ్చు. అమెరికాలో 77 శాతం మంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తుంటే, అదే యుట్యూబ్‌ను 63 శాతం మంది ఉపయోగిస్తున్నారు. దీని తర్వాత లింక్‌డ్‌ఇన్‌, ట్విట్టర్‌, గూగుల్‌ ప్లస్‌ ఉన్నాయి.
యుట్యూబ్‌ మొదట్లో డేటింగ్‌ వెబ్‌సైట్‌గా…
మొదట్లో యుట్యూబ్‌ డేటింగ్‌ వెబ్‌సైట్‌గా ప్రారంభమై నప్పుడు, అమెరికాలో జరిగిన కొన్ని పొరపాట్లు అంటే ఏదేని ఫంక్షన్‌లో సినీతార డ్రెస్‌ జారిపోయినప్పుడు వాటి వీడియోను యుట్యూబ్‌లో పోస్ట్‌ చేసేవారు. ఇటువంటి వీడియో పట్ల యుట్యూబ్‌ ఫౌండర్స్‌ అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కానీ తర్వాత ఇది పూర్తిగా వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌గా పేరు గాంచింది. పాత యుట్యూబ్‌ ఎలా ఉందనేది చెక్‌ చేసుకోవాలంటే Wayback Machine’s archive లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు.
యుట్యూబ్‌ ఇన్‌స్టాంట్‌గా …
యుట్యూబ్‌ ఇన్‌స్టాంట్‌ అనేది కూడా చాలా పాపుర్‌గా మారింది. యుట్యూబ్‌లో అనేక వీడియోలు ఉంటాయి. నేరుగా యుట్యూబ్‌ను ఓపెన్‌ చేసినప్పుడు అనేక వీడియోస్‌ ఇతర సమాచారం మొత్తం గజిబిజీగా ఉంటుంది. నేరుగా టివీ మాదిరిగా చూడాంటే…http://youtube.com/tv  అనే లింక్ ద్వారా చూడ‌వ‌చ్చు. ఇలా కూడా కాకుండా ఇన్‌స్టాంట్‌గా మీరు సెర్చింగ్‌ చేసే పలితాలు డిస్‌ప్లే అవుతూనే వెంటనే ప్లే కూడా  కావాలి. దీని కోసం యుట్యూబ్ YTInstant ను అందిస్తుంది. http://ytinstant.com/ అనే లింక్‌ ద్వారా నేరుగా యుట్యూబ్‌ ఇన్‌స్టాంట్‌ను యాక్సస్‌ చేయవచ్చు. ఒకసారి దీనికి అలవాటు పడితే యుట్యూబ్‌ను చాలా సువుగా చూడవచ్చు.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *