మీడియా ఫైల్స్ ఫార్మాట్ క‌న్వ‌ర్ట్ చేయ‌డంలో ఉప‌యోగించే టూల్స్ – Part 2

మీడియా ఫైల్స్ ఫార్మాట్ క‌న్వ‌ర్ట్ చేయ‌డంలో ఉప‌యోగించే మ‌రికొన్ని ర‌కాల టూల్స్ గురించి
ఇక్క‌డ తెలుసుకుందాం.
Foobar 2000
ఆడియో, వీడియో ఫైల్స్‌ ఒక్కోసారి సరిగ్గా ప్లే కావు. వీటికి సంబందించిన మీడియా యాడ్స్‌అన్‌ మిస్‌ అయ్యాయి అనే మేసేజ్‌ వస్తుంది. ఒక ఫార్మాట్‌ నుంచి ఇంకో ఫార్మాట్‌కు కన్వర్ట్‌ చేసే సమయంలో యాడాన్స్‌ మిస్‌ కాకుండా చూస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌.
AAC, AIFF, ALAC, FLAC, Ogg, Opus, WAV ..వంటి ప‌లు ర‌కాల‌ ఫార్మాట్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కన్వర్షన్‌
చేసే ముందు మనం ప‌లు ర‌కాల‌ ఎన్‌కోడర్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
వీటిని foobar2000.org/encoderpack వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకొండి. ఈ సాఫ్ట్‌వేర్‌కోసం
అదనంగా ప‌లు ఎన్‌కోడర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఈ సాఫ్ట్‌వేర్‌ను మనమే కస్టమైజ్‌ చేసుకుని కావాల్సిన‌ విదంగా తయారు చేసుకునే వీలుంది. ప్రత్యేకంగా ఇది ఎన్‌కోడర్‌  ప్యాకేజీను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా మరిన్ని ఎక్కువ ఫార్మాట్స్‌ను కన్వర్ట్‌ చేసుకోగలం. దీని కోసం rarewares.org వెబ్‌సైట్‌ ఉపయోగపడుతుంది. ఇందులో ప‌లు ఎన్‌కోడర్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
Audacity
ఆడియో టూల్స్‌లో బాగా ప్రాచుర్యాన్ని పొందిన వాటిలో ఇది ఒకటి. ఓపెన్‌సోర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో అడాసిటీ ఒకటి. సోర్స్‌ఫోర్జ్‌ వెబ్‌సైట్‌లో ఈ టూల్‌ బిస్తుంది. ఈ టూల్‌ ద్వారా ప్రతి ఫార్మాట్‌ను కన్వర్ట్‌ చేయవచ్చు. AIFF, FLAC, MP3, OGG, WAV … వంటి ప‌లు ఫార్మాట్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. అనేక ఆడియో ఫార్మాట్స్‌ను ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్ట్‌ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఓపెన్‌ చేసిన తర్వాత File-Import-Audio సెలెక్ట్‌ చేసుకోవాలి. తర్వాత అడియో ట్రాక్స్‌ను ఎంచుకోవాలి. తర్వాత కన్వర్ట్‌ చేయాలి. దీని కోసం File-export audio ఎంచుకున్న తర్వాత ఎక్కడ సేవ్‌ చేయాలో సెలెక్ట్‌ చేసుకోవాలి.
Super
ఆడియో, వీడియో ఫార్మాట్స్‌లో అనేక ఫార్మాట్‌ను ఈ టూల్‌ ద్వారా కన్వర్ట్‌ చేయగం. FFmpeg, MEncoder, MPlayer, x264,
MusePack, Monkey’s audio, Shorten audio, TAK audio, True audio, WavPack … వంటి వాటి అన్నింటికి ఇది
జియుఐ (గ్రాఫిక‌ల్ యూస‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌) ప్యాకేజిగా పనిచేస్తుంది. ఒక విధంగా చెప్పాంటే ఇవన్ని కలిసిన శక్తివంతమైన టూల్‌గా దీన్ని చెప్పవచ్చు.
సిస్టమ్‌ నెమ్మదిగా పనిచేయడం, తక్కువ ర్యామ్‌ ఉండటం ద్వారా ఇటువంటి సాఫ్ట్‌వేర్స్‌ సిస్టమ్‌ను సతాయిస్తుంటాయి. కావున సిస్టమ్‌ పనితనం బాగుంటే దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొండి. మొదట్లో చెప్పుకున్నట్టే దీని ద్వారా ఎటువంటి ఆడియో, వీడియో ఫార్మాట్‌నైనా సులువుగా కన్వర్ట్‌ చేసుకునే వీలుంది.
మ‌రిన్ని టూల్స్ గురించి పార్ట్ 3 లో వివ‌రంగా తెలుసుకుందాం.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *