బేసిక్స్ – ఫేస్‌బుక్ సెర్చింగ్ ప‌లు విధాలుగా…

ఇంటర్నెట్‌లో ప్రతి అవసరానికి ముందుగా మనం గూగుల్‌ సెర్చింగ్‌ చేయడం గురించి తెలిసిందే. ఇప్పుడు గూగుల్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ ఇంటర్నెట్‌లో నెంబర్‌వన్‌ స్థానం కోసం పోటి పడుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ ప్రకారం చూస్తే, నెటిజన్స్‌ కంప్యూటర్‌ను స్టార్ట్‌ చేసిన వెంటనే నేరుగా ఫేస్‌బుక్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తున్నారు. ఇక అందులోకి వెళ్లిన తర్వాత ఎక్కువ సమయం అందులోనే గడిపేస్తున్నాడు. చాటింగ్ చేయ‌డం, అక్క‌డి న్యూస్ చ‌ద‌వ‌డం, లైక్ చేయడం, ఇతర పోస్టుల‌ చూడటం, షేర్ చేయ‌డం.. వంటివి. అత్య‌దిక శాతం మంది అన‌వ‌స‌రం విష‌యాల‌కు ఉప‌యోగిస్తూ విలువైన స‌మ‌యాన్ని వృదా చేస్తున్నారు. మన అవసరాకు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తే సంతోషమే .. కానీ అనవసరంగా విలువైన సమయం వృధా చేయడం ద్వారా కెరీర్‌ నాశనమవుతుంది. నేడు అనేక మంది ముందుగా ఫేస్‌బుక్‌లోకి వెళ్లుతున్నారు. గతంలో అయితే గూగుల్‌ను ఓపెన్‌ చేసి కావాల్సిన సమాచారం కోసం వెతకడం చేసేవారు. కానీ నేడు ముఖ్యమైన పనుల‌ను పక్కన పెట్టి నేరుగా ఫేస్‌బుక్‌నే ఓపెన్‌ చేయడం వల‌న ఎటువంటి ప్రయోజనం ఉండదు.

ఫేస్‌బుక్‌ సెర్చింగ్‌ ఇలా …కొన్ని బేసిక్ అంశాల గురించి…
ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత అక్కడ కూడా మీకు కావాల్సిన వాటి గురించి పలు విధాలుగా సెర్చింగ్‌ చేయవచ్చు. బేసిక్‌ సెర్చింగ్‌ వచ్చి మనకు తెలిసిన స్నేహితుల పేర్లను ఫేస్‌బుక్‌ సెర్చ్‌ బాక్స్‌లో టైప్‌ చేయడం ద్వారా, మన స్నేహితులు ఫేస్‌బుక్‌లో ఉన్నారో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సెర్చింగ్‌ సాధారణంగా అందరు చేస్తుంటారు. మీ స్నేహితుల‌ ఇమెయిల్‌ అడ్రస్‌ తెలిసి ఉంటే నేరుగా ఇమెయిల్‌ అడ్రస్‌ ద్వారా కూడా మీ స్నేహితుల‌ను సెర్చింగ్‌ చేయవచ్చు. అలాగే మీ ఇమెయిల్‌ కాంటాక్ట్‌ను కూడా మీరు ఫేస్‌బుక్‌లోకి ఇంపోర్ట్‌ చేసుకుంటే ఫేస్‌బుక్‌ ఇమెయిల్‌ ఐడీ అదారంగా మీ స్నేహితుల‌ను మీకే రెఫర్‌ చేస్తుంది.
మీ స్నేహితులు కానప్పటికీ కొందరి పేర్లు మీకు తెలిసి ఉంటుంది. అలాగే మీ స్నేహితుల‌ యెక్క స్నేహితుల పేర్లు కూడా మీకు తెలిసి ఉంటుంది. ఇటువంటి వారి కోసం కూడా మీరు సెర్చింగ్‌ చేయవచ్చు. సాధారణంగా మీ స్నేహితుల‌లో ఎక్కువ మంది ఇతరుకు కూడా స్నేహితులుగా (Mutual friends) ఉంటే అటువంటి వారిని కూడా స్నేహితులుగా యాడ్‌ చేసుకోమని ఫేస్‌బుక్‌ రెఫర్‌ చేస్తుంది. కాబట్టి ఇక్కడ Mutual friends ను అధారంగా చేసుకుని కొత్తగా స్నేహితుల కోసం సెర్చింగ్‌ చేయండి.
ఒక్కోసారి మనం పేరుతో సెర్చింగ్‌ చేసినప్పుడు వారు ఫేస్‌బుక్‌లో ఉన్నారో లేదో కూడా తెలియకపోవచ్చు. పేరును వేరుగా పెట్టి ఉండ‌వ‌చ్చు. అలాగే మన వద్ద ఉన్న మన స్నేహితుల ఇమెయిల్‌ ఐడీని ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో ఉపయోగించకుండా ఉంటే కూడా మనకు మన స్నేహితుల‌ను వెతికినా కనిపించరు. ఇటువంటి సమయంలో మనం సెల్‌ ఫోన్‌ నంబర్‌ అదారంగా కూడా సెర్చింగ్‌ చేసి చూడండి. ఇలా చేయడం ద్వారా కూడా మన స్నేహితులు ఫేస్‌బుక్‌లో ఉన్నారో లేదో కూడా తెలుసుకోవచ్చు.

ఫ్రెండ్స్‌ సెర్చింగే కాకుండా ఫేస్‌బుక్‌లో ఉపయోగపడే సమాచారం ఉంటే తెలుసుకుని కాస్త విజ్ఞానం పొందితే మంచిదే కదా. అందుకే ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ను కూడా సెర్చింగ్‌ చేయవచ్చు. మీ సెర్చింగ్‌కు సరిపడే సింపుల్‌ కీవర్డ్‌ను ఉపయోగించి సెర్చింగ్‌ చేయడం ద్వారా దానికి దగ్గరకు ఉన్న పోస్ట్‌లు మీకు కన్పిస్తాయి.
ఫేస్‌బుక్‌లో అనేక గ్రూప్స్‌ ఉన్న విషయంలో తెలిసిందే. మీకు ప్రత్యేకంగా గ్రూప్స్‌ గురించి తెలుసుకోవడం లేదా వాటిలో యాడ్‌ కావాంటే గ్రూప్స్‌ పేరుతో సెర్చింగ్‌ చేయవచ్చు.
ఫేస్‌బుక్‌లో లోకేషన్‌ను కూడా సెర్చింగ్‌ చేసి చూడవచ్చు. ఒక లోకేషన్‌ను టైప్‌ చేసిన తర్వాత దానికి సంబందించి casual comments, news, events, check-ins … వంటి వన్నీ కూడా వస్తాయి. మీరు లోకేషన్‌ను ఎందుకు సెర్చింగ్‌ చేసారో దాన్ని బట్టి లోకేషన్‌ను వాడుకోవచ్చు.
https://www.facebook.com/me/allactivity …
ఈ లింక్‌ ద్వారా మీరు పోస్ట్‌ చేసిన మొత్తం పోస్ట్ లు లేదా మీ అక్కౌంట్‌లో జరిగే మొత్తం యాక్టివిటీని ఇక్కడ సింపుల్‌గా చూడవచ్చు. యాక్టివిటీ లాగ్‌లో మీ అక్కౌంట్‌లో జరిగిన ప్రతి వివరం ఉంటుందని గమనించగరు.
ఇటువంటి బేసిక్ అంశాల గురించి ఇక మీ వెబ్‌సైట్‌లో రెగ్యుల‌ర్‌గా ప‌బ్లిష్ చేస్తుంటాం.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *