ఫైల్ క‌న్వ‌ర్ష‌న్ చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డే టిప్స్ – Part 4

ఆఫీస్ ఫైల్స్ క‌న్వ‌ర్ష‌న్ గురించి తెలుసుకుందాం…
ఆఫీస్‌ ఫైల్స్‌ అంటే వర్డ్‌, ఎక్సెల్‌, డేటాబేస్‌ ఫైల్స్‌, పవర్‌పాయింట్స్‌ ఫైల్స్‌, పిడిఎఫ్‌ … మొదలైనవి వస్తాయి. వీటిని ఒక ఫార్మాట్‌ నుంచి వేరొక ఫార్మాట్‌కు కన్వర్ట్‌ చేయడంలో అనేక టూల్స్‌ ఉచితంగా బిస్తున్నాయి. అయితే ఫైల్‌ను బట్టి ఇవి కన్వర్ట్‌ చేస్తాయి. ఖచ్చితమైన అవుట్‌పుట్‌ అనేది ఫైల్‌ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు తెలుగులో ఫైల్స్‌ ఉంటే వాటిని కన్వర్ట్‌ చేయలేం. ఇంగ్లీషులో టెక్స్‌ట్‌ (ఎక్కువగా ఫార్మాటింగ్‌.. టేబుల్స్‌, ఫార్ములా, ఈక్వేషన్స్‌ .. వంటివి) ప్లెయిన్‌గా కంటిన్యూగా కాకుండా పలు రకాల ఫార్మాటింగ్‌ ఫీచర్స్‌ ఉంటే ఇటువంటి ఫైల్స్‌ పూర్తిస్థాయిలో చక్కగా ఓరిజనల్‌ ఫైల్‌ మాదిరిగానే ఉండేలా కన్వర్ట్ చేయ‌డంమంటే కాస్త కష్టమేనే చెప్పాలి. అందుబాటులో ఉన్న కన్వర్టర్స్‌ను ఒక‌సారి ప‌రిశీలిద్దాం.
PDFMate …
పిడిఎఫ్‌ ఫైల్స్‌ను పలు ఇతర ఫార్మాట్స్‌లోకి మార్చడంలో ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. Word, Text, EPUB, HTML, SWF, JPEG … వంటి పలు ఆఫీస్‌ ఫార్మాట్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. మీ వద్ద ఉన్న పిడిఎఫ్‌ ఫైల్స్‌ను ఈ ఫార్మాట్‌లోకి మార్చాలంటే ఈ కన్వర్ట‌ర్‌ టూల్‌ను ఉపయోగించండి.
WinScan2PDF …
చాలా సింపుల్‌ టూల్‌. కేవం 30కెబిలో వచ్చే సాఫ్ట్‌వేర్‌. దీని ద్వారా మీవర్డ్‌ ఫైల్‌ను పిడిఎఫ్‌ ఫార్మాట్‌లోకి మార్చగం.
PDFTables
ఆన్‌లైన్‌లోనే పిడిఎఫ్‌ నుంచి ఎక్సెల్‌ ఫార్మాట్‌లోకి కన్వర్ట్‌ చేయాలంటే చాలా సులువుగా చేయగం. Excel, CSV, XML, HTML … వంటి ఫార్మాట్స్‌ను ఇది సపోర్ట్‌ చేస్తుంది.
Smallpdf …
ఫైల్స్‌ కన్వర్షన్‌లో ఉపయోగపడే చాలా బెస్ట్ మ‌రియు సింపుల్‌ టూల్‌. పిడిఎఫ్‌ రిలేటెడ్‌ అన్ని విషయాల‌ను చాలా సులువుగా క‌న్వ‌ర్ట్ చేసే వీలుంది. Word, PowerPoint, Excel, JPEG, HTML …వంటి ఫైల్స్‌ను సులువుగా క‌న్వ‌ర్ట్‌ చేస్తామనే కాన్సెప్ట్‌తో ఈ సాఫ్ట్‌వేర్ ల‌బిస్తుంది.
దీని ద్వారా పలు ఫైల్స్‌ను పిడిఎఫ్‌లోకి మార్చవచ్చు. అలాగే పిడిఎఫ్‌ ఫైల్స్‌ను ఇతర ఫార్మాట్స్‌లోకి మార్చవచ్చు. పిడిఎఫ్‌ ఫార్మాట్స్‌ను కంప్రెస్‌ చేయడం, స్పిల్ట్‌ చేయడం, మెర్జ్‌ చేయడం, ఆన్‌లాక్‌ చేయడం.. వంటి పలు రకాల ఫీచర్స్‌ను ఈ సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ చేస్తుంది. కొన్ని రకాల పిడిఎఫ్‌ ఫార్మాట్స్‌కు బేసిక్‌ పాస్‌వర్డ్‌ను ఇస్తుంటారు. వీటిని అన్‌లాక్‌ చేయడంలో ఈ టూల్‌ సహకరిస్తుంది.
CloudConvert Beta
ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా 206 రకాల‌కు పైగానే ఫార్మాట్స్‌ను మీకు కావాల్సిన ఫార్మాట్‌లోకి కన్వర్ట్‌ చేయగలం. ఆడియో, వీడియో, డాక్యుమెంట్‌, ఇ బుక్‌, స్ప్రెడ్‌షీట్‌…వంటి అనేక రకాల‌ ఫార్మాట్స్‌ను ఇది సపోర్ట్‌ చేస్తుంది. ఫైల్‌ కన్వర్షన్‌ చేయడం, మాక్సిమం ఫైల్‌ సైజ్‌ 100 ఎంబికి మించకుండా ఉండాలి.
Office to PDF
ప‌లు రకాల టూల్స్‌ను ఉపయోగించి ఫైల్‌ కన్వర్షన్స్‌ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌లోనే ప్రత్యేకంగా Export to PDF అనే ఆప్షన్‌ ఉండటం ద్వారా ఆఫీస్‌ ఫైల్స్‌ను పిడిఎఫ్‌ ఫార్మాట్‌లోకి మార్చవచ్చు.
ఈ విధంగా పిడిఎఫ్‌ కన్వర్షన్‌ చేసి చూడండి ..!
ఆఫీస్‌ ఫైల్స్‌ను పు రకాలుగా పిడిఎఫ్‌ చేయవచ్చు. థర్డ్‌పార్టీ టూల్స్‌ ద్వారాను, నేరుగా ఆన్‌లైన్‌లోను, ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌లోని ఆప్షన్‌ ద్వారాను చేయవచ్చు. కాకపోతే వీటికంటే బిన్నంగా కూడా చేయవచ్చు. ఈ విదంగా చేయడం ద్వారా పిడిఎఫ్‌ కరెక్ట్‌గా అవుతుంది. దీని కోసం ఇలా చేయాలి. ముందుగా క్యూట్‌ పిడిఎఫ్‌ రైటర్ (cute pdf writer) అనే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత  ఈ సాఫ్ట్‌వేర్‌ నేరుగా మీ ఆఫీస్‌లోకి చేరుతుంది.
ఏదేని ఆఫీస్‌ ఫైల్‌ని ఓపెన్‌ చేసిన తర్వాత పిడిఎఫ్‌ ఫైల్‌ చేయాలంటే ముందుగా ప్రింట్‌ ఆప్షన్‌ను (Ctrl – p) సెలెక్ట్‌ చేసుకోవాలి. ఈ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకున్న తర్వాత అందులో (printer name – cute pdf writer) ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఈ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకున్న తర్వాత అక్కడే ఉండే print to file అనే ఆప్షన్‌ను అక్కడే ఉండే చిన్న సర్కిల్‌లో క్లిక్‌ చేసి సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఫైల్‌ పేరుతో ఎక్కడ  సేవ్‌ చేయాలో ఫైల్‌ను అక్కడ సేవ్‌ చేయాలి.
ఈ విధంగా సేవ్‌ చేసిన ఫైల్‌ను పిఎస్‌ ఫైల్‌గా పివచ్చు. ఇప్పుడు దీన్ని పిడిఎఫ్‌గా మార్చుకోవాంటే యాక్రోబ్యాట్‌ డిస్టిల‌రీ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. యాక్రోబ్యాట్‌ డిస్టిరీ 5 వెర్షన్‌ చక్కగా పనిచేస్తుంది. పిఎస్‌ ఫైల్‌ను దీని ద్వారా ఓపెన్‌ చేయడం ద్వారా మీకు పిడిఎఫ్‌ ఫైల్‌ జనరేట్‌ అవుతుంది. పిఎస్‌ (పోస్ట్‌ స్క్రిప్ట్‌) ఫైల్స్‌ను నేరుగా యాక్రోబ్యాట్‌ డిస్టిల‌రీ ద్వారా పిడిఎఫ్‌ ఫైల్స్‌గా మార్చవచ్చు. డిస్టిరీ సెట్టింగ్స్‌లో  హై రెజ‌ల్యూష‌న్‌ను ఉంచాలి.కనీసం 2400 రెజ‌ల్యూష‌న్‌ను ఉంచి కొత్త పేరుతో సెట్టింగ్స్‌ను సేవ్‌ చేయండి.  పేజీమేకర్‌ ద్వారా మనం ఏవేని ఫైల్స్‌ను పిఎస్‌ చేసినా కూడా డిస్టిల‌రీ ద్వారానే పిడిఎఫ్‌గా క్రియేట్‌ చేస్తాం. పాత వెర్షన్‌ అయినా డిస్టిల‌రీ  చాలా చక్కగా పనిచేస్తుంది. పేజీమేకర్‌లో తయారైన ఫైల్‌ను ముందుగా ప్రింట్‌ డయలాగ్‌ బాక్స్‌లో పిఎస్‌ ప్రింటర్‌ డ్రైవర్స్‌ను సెలెక్ట్‌ చేసుకుని పిఎస్‌ చేయాలి. ప్రింటర్‌లో సైటక్స్‌, జిరాక్స్‌ వంటి పిఎస్‌ డ్రైవర్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. పేజీమేకర్‌లో కూడా ఫైల్‌ను నేరుగా పిడిఎఫ్‌ ఫార్మాట్‌లోకి ఎక్స్‌పోర్ట్‌ చేసుకునే వీలుంది.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *