టాస్క్ &  టైమ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌…

యాప్స్‌ .. యాప్స్‌.. నేడు ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్న మాట. స్మార్ట్‌ ఫోన్స్‌ వాడకం పెరగడంతో నేడు అనేక పనును స్మార్ట్‌ఫోన్స్‌ ద్వారానే పూర్తి చేస్తున్నారు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే అనేక పోన్లు మార్కెట్లోకి వెల్లువ‌లా  వచ్చి పడుతున్నాయి. రూ. 4000 నుంచే మంచి కాన్ఫిగరేషన్‌తో పాటు ప‌లు ఫీచ‌ర్స్ ను కలిగిన స్మార్ట్‌పోన్లు వాడుకలోకి రావడంతో అనేక మంది స్మార్ట్‌పోన్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి అవసరానికి యాప్స్‌ రావడంతో .. ఈ యాప్స్‌ను ఉపయోగించడం కోసం మొబైల్‌ను కొనుగోలు చేయడం వాటిని ఉపయోగించడం చేస్తున్నారు. ఇటీవ బాగా ప్రాచుర్యాన్ని పొందిన వాట్సాప్‌ గురించి తెలిసిందే.  ఆన్‌లైన్‌లో ప్రతి అవసరానికి యాప్స్‌ ఉన్నాయి. అత్యధిక శాతం ఉపయోగిస్తున్న మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అండ్రాయిడ్‌ కావడం వన, దీని కింద పనిచేసే యాప్స్‌ అనేకం వాడుకలోకి వచ్చాయి.

ల‌క్షల  కొద్ది యాప్స్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ల‌బిస్తున్నాయి. కానీ వీటినుంచి ఉపయోగపడే యాప్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం కష్టమే. అందుకే ముఖ్యమైన అండ్రాయిడ్‌ యాప్స్‌ గురించి క్ర‌మం త‌ప్ప‌కుండా మ‌న వెబ్‌సైట్‌లో తెలుసుకుందాం.ప్రస్తుతం ప్రతి ఒక్కరు బిజీనే. పనుల‌ను సులువు చేసి పెట్టే టెక్నాజీ వచ్చినప్పటికీ, ప్రతి దానికి కూడా పరుగు పెడుతూనే ఉండాలి. అనేక మంది ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతిదీ ప్లానింగ్‌ చేసుకుంటూ ఉంటారు. అలాగే మరుసటి రోజు చేయాల్సిన పనుల‌ను కూడా ముందే నోట్‌ చేసుకుని గుర్తు పెట్టుకుంటున్నారు. ఈ యాప్స్‌తో మీ టైమ్ మేనేజ్ మెంట్  & ప్లానింగ్‌ ఇలా … టెక్నాజీ ముఖ్యంగా స్మార్ట్‌ పోన్స్‌ వచ్చిన తర్వాత మెమోరీ తగ్గిందనే చెప్పాలి. అనేక పనును మనం మర్చి  పోకుండా ఉండటం కోసం, అలాగే మన పనుల్ని మనకు రిమైండ్‌ చేయడం కోసం అండ్రాయిడ్‌ యాప్స్‌ను ఉపయోగించే పరిస్థితి ఉంది. అనేక మంది ఈ యాప్స్‌ ద్వారా డైలీ షెడ్యూల్‌ను, ప్లానింగ్‌ను చక్కగా చేసుకుంటున్నారు. ఈ యాప్స్‌ను సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీ డే ప్లానింగ్‌ను సరిగ్గా చేసుకోవచ్చు. వీటి ద్వారా మీరు చేసే పనును గుర్తు పెట్టుకుని వచ్చే రిమైండర్స్‌ ద్వారా పనుల‌ను వేగంగా చేసుకోవచ్చు. గతంలో డైరీని ఉపయోగించేవారు… కానీ నేడు డిజిట‌ల్ డైరే అదేనండీ .. టాస్క్ మేనేజ్‌మెంట్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు.

1. Evernote … ఈ యాప్‌ అండ్రాయిడ్‌, ఐఓఎస్‌ .. రెండింటిలోను పనిచేస్తుంది. ఎవ్వర్‌నోట్‌ కార్పొరేషన్‌ తయారు చేసిన ఈ యాప్‌ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ ద్వారా మీ షెడ్యూల్స్‌ను, అలాగే మీ ప్లానింగ్‌ను సమర్దవంతంగా చేసుకోవచ్చు.  మనం చేసే పనుల‌ను బట్టి  ప‌లు చోట్ల  ప‌లు  విషయాలు  జరుగుతుంటాయి. వీటిని కూడా నోట్‌ చేసుకుంటూ అలాగే మీరు చేయాల్సిన వాటిని కూడా ఈ యాప్‌ ద్వారా ప్లానింగ్‌ చేసుకుంటూ ఉండ‌వ‌చ్చు.

2. OneNote Mobile … మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఈ ఓన్ నోట్‌ ప్రొగ్రామ్‌ డెస్క్‌టాప్‌లో కూడా బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ఇప్పుడు మొబైల్‌లో కూడా బాగా వాడుకలోకి వచ్చింది.  ముఖ్యమైన వాటి గురించి నోట్‌ చేసుకోవడం, అలాగే మనం చేసే ప్రాజెక్ట్‌కు సంబందించిన కీల‌క విషయాల‌ను మర్చిపోవచ్చు .. వాటిని నోట్‌ చేసుకోవడం చాలా అవ‌స‌రం. ఈ విషయాల‌ను ఇతరుల‌తో కూడా షేర్‌ చేసేకోవాంటే వారితో షేర్‌ చేయగ‌లం. ఇలా అనేక పనును దీని ద్వారా సులువుగా ప్లానింగ్‌ చేసుకునే  వీలు ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ టాస్క్‌మేనేజింగ్‌, అర్గనైజర్‌ యాప్స్ ఉప‌యోగించే వారికి పర్సనల్‌ సెక్రటరీగా పనిచేస్తాయని  చెప్పాలి.

3. Remember The Milk … ఇది వెబ్‌బేస్డ్‌ టాస్క్ &  టైమ్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌గా చెప్పవచ్చు. అయితే ఈ యాప్‌ను ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోగలం. ఈ యాప్‌ ద్వారా డైలీ ప్లానింగ్‌ కరెక్ట్‌గా చేసుకునే  వీలు ఉంది. మన టాస్క్‌ను మేనేజ్‌ చేసుకోవడం.. అంటే టాస్క్‌ను అర్గనైజ్‌ చేసుకుంటూ, అలాగే టాస్క్‌ రిమైండర్స్‌ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇక్కడ రిమైండర్స్‌ ఎందుకనే దానికి ఒక ఉదాహరణను చెప్పుకుందాం. మనం పని ఒత్తిడిలో ముఖ్యమైన వారికి పోన్‌ చేయడం మర్చిపోతుంటాం. ఇటువంటి వాటిని గుర్తు చేయడం కోసం రిమైండర్స్‌ అవసరం. మ‌న టాస్క్‌ల‌ను రిమైండ్ చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌నే మ‌ర్చిపోకుండా చూసుకోవాలి. ఇది మాత్రం మ‌న‌మేగుర్తు పెట్టుకోవాలి.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *