ఎంప్లాయ‌బిలిటీ స్కిల్స్‌ను పెంచుకోవాలి..

ఎంప్లాయ‌బిలిటీ స్కిల్స్‌ను పెంచుకోవాలి..
ఇంజ‌నీరింగ్ విద్య‌ను అభ్య‌సించేవారిలో అత్య‌ధిక శాతం మందికి ఈ స్కిల్స్ త‌క్కువ‌గానే ఉంటున్నాయి.

టెక్నిక‌ల్ స్కిల్స్‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, ప్రాబ్ల‌మ్ సాల్వింగ్ స్కిల్స్ .. ఈ మూడే చాలా కీల‌కం.

ఇదీ ప్రస్తుత పరిస్థితి…
ఇంజినీరింగ్‌, పీజీ పూర్తి చేసిన ప్రెషర్స్‌ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్ప‌టికే గత రెండు, మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి ఉద్యోగాలు లేక ఖాలీగా వుండే అనేక మంది విద్యార్థులు సరైన దిశగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇంజినీరింగ్‌ పూర్తియ్యే విద్యార్థులు అయా విభాగాల్లో పూర్తిగా టెక్నికల్‌ స్కిల్స్‌ను పొందలేకున్నారు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థి కంప్యూటింగ్‌లోని కొన్ని బేసిక్ పాయింట్స్ అడిగితే చెప్పలేకపోతున్నాడు. ఇతర విబాగాల్లోని విద్యార్థులకు అయా సబ్జెక్ట్‌లపై వున్న నాలెడ్జి తక్కువనే చెప్పాలి. దీని కారణంగా విద్యార్థుల్లో చదువు పట్ల నిర్లక్ష్యంతోపాటు, అనేక ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కనీస వసతులు కూడా ఉండటం లేదు. ఫ్యాకల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌…వంటివన్నీ డొల్లనే. ఇటువంటి కాలేజీల్లో శిక్షణ పూర్తి చేసుకుంటే పాస్‌కావడమే గగనంగా వుంటుంది… ఇక ఇండస్ట్రీకి ఉపయోగపడే స్కిల్స్‌ ఎక్కడినుంచి వస్తాయి. ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌కు ఉండాల్సిన ఎంప్లాయ‌బిలిటీ స్కిల్స్ గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

యాజమాన్యాలు కోరుకునే స్కిల్స్‌ ఏవి…?
దేశంలో ‘అత్యుత్తమ నాణ్యత’ కలిగిన ప్రొఫెనల్‌ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్నట్లు ఎవరెంత చెప్పుకున్నా, మన ఇంజినీరింగ్‌ కాలేజీల్లో, అలాగే పీజీ కాలేజీల్లో (ఎంబిఎ, ఎంసిఎ) చదువుక్ను విద్యార్థులు చాలా మంది ‘ఎంప్లాయబిలిటీ (‘ఉద్యోగం పొందగల)నైపుణ్యాలను పోందలేకపోతున్నారని అనేక సర్వేలు తెలియచేస్తున్నాయి.
పని చక్కగా చేసేందుకు, ఉద్యోగంలో ఎదిగేందుకుగాను విద్యార్థులు కొన్ని నిర్ధిష్ట ప్రాథమిక నైపుణ్యాలు కలిగి ఉండాలని యాజమాన్యాలు ఆశిస్తున్నాయి. తమకు తాముగా కొత్త విషయాలు నేర్చుకోగలిగిన, కొత్త బాధ్యతలు స్వీకరించగల అభ్యర్థుల కోసమే సాధారణంగా ఆయా సంస్థలు చూస్తుంటాయి. మూడు ‘ఆర్‌’ (రీడింగ్‌, రైటింగ్‌, అర్థిమేటిక్‌)ల కన్నా మిన్నగా నేటి ప్రాథమిక నైపుణ్యాలున్నాయి. కమ్యూనికేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, టెక్నికల్‌ స్కిల్స్ వీటిల్లో ముఖ్యమైనవి. అసెస్‌మెంట్ టెస్ట్స్‌, గ్రూప్‌ డిస్కషన్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూస్ లాంటి వాటినన్నింటిని ఆధారం చేసుకొని అయా కంపెనీలు తాజా అభ్యర్థులను రిక్రూట్ చేసుకునేందుకు ఉపయోగించే టెస్ట్‌లన్నీ కూడా అభ్యర్థుల ముఖ్యమైన ఎంప్లాయబిటిటీ స్కిల్స్‌ను మదింపు వేసేందుకు రూపుదిద్దుకున్నవే. ఈ మూడు ప్రధాన నైపుణ్యాలపై విద్యార్థుల శక్తిసామర్థ్యాలను అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తే … ఆ పరీక్షల ఫలితాలేవీ అంతగా ఆనందించదగ్గ స్థాయిలో లేవు. అప్పడప్పుడే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరిన వారిలో కేవలం 7 శాతం విద్యార్థులు మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. మిగతా విద్యార్థులు కమ్యూనికేషన్‌, ప్రాబ్లమ్‌ స్వాలింగ్‌, టెక్నికల్‌ స్కిల్స్‌ల్లో ఏదైనా ఒక దానిలో బాగా వెనుకబడి ఉన్నారు.

మధ్య, చిన్నస్థాయి పట్టణాల్లో విద్యార్థులకు విషయానికి వస్తే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అనేది ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. అందుకే తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు 80 శాతం మంది అర్హత స్థాయిని సాధించలేరంటే అందులో పెద్దగా ఆశ్చర్యపోనవసరంలేదు. కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌లో ఫర్వాలేదనుకున్న ఈ మిగిలిన 20 శాతం మంది ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌లోనో లేదా టెక్నికల్‌ స్కిల్స్‌లోనో వారు వెనుకబడే ఉంటున్నారు.

ఉద్యోగ ప్రాథమ్యాలు రెండు రకాలుగా వుంటాయి… మొదిటిది అర్హత ప్రాథమ్యం. రెండోది ఎంపిక ప్రాథమ్యం. మొదలు అర్హత లభిస్తే, ఆ తరువాత ఎంపిక విషయం ఆలోచించకోవచ్చు. పరిశ్రమలో సాంకేతిక ఉద్యోగాల విషయానికొస్తే కమ్యూనికేషన్‌ స్కిల్‌ అనేది ప్రాథమికంగా అర్హత ప్రాథమ్యానికి సంబంధించినది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను గనుక అర్హత / ఎంపిక ప్రాథమ్యంగా పరిగణనలోకి తీసుకొకుంటే, ఉద్యోగం పొందగల విద్యార్థుల శాతం 7 నుండి 13కు పెరిగేది.

అన్నింటి కంటే ఆశ్చర్యం కలిగించే అంశం మరొకి ఉంది. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్‌ (సమస్య పరిష్కార నైపుణ్యాలు) విషయానికి వస్తే 80 శాతం మంది విద్యార్థులు సాధారణ స్థాయినీ చేరుకోలేకపోతున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌లో సహాజంగానే నైపుణ్యం కలిగి ఉంటార‌నే నమ్మకానికి భిన్నంగా విద్యార్థులు నైపుణ్యం లోపాలతో సతమతమ వుతున్నారు. ఈ విషయంలో జాతీయ సగటున 35 శాతం కాగా, తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల సగటున 25 శాతం మాత్రమే ఉంది. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌లో 25 శాతం కంటే తక్కువ స్కోర్‌ చేసిన వారు 50 శాతం కంటే ఎక్కువే ఉన్నారు. దీంతో వీరంతా కూడా ‘శిక్షణ ఇవ్వడం కష్టతరం’ కేటగిరిలోకి పడిపోతున్నారు. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు తగినంతగా లేకపోవడం కూడా విద్యార్థులు తగిన రీతిలో ఉద్యోగాలు పొందలేకపోవడానికి అతిపెద్ద అవరోధంగా నిలుస్తోంది. చాలా సందర్భాల్లో వీరు ఇంజినీరింగ్‌ పూర్తి చేసినప్ప‌టికీ, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలతో రాజీ పడాల్సి వస్తోంది. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ పెంచుకోవడం వల్ల ఉద్యోగాలు పొందేవారి శాతం 7 నుండి 16 శాతానికి పెరుగగలదు.

ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి 60 శాతం కంటే ఎక్కువ విద్యార్థులు టెక్నికల్‌ స్కిల్క్‌లో ఎంప్లాయబిలిటీ ప్రాథమ్యాన్ని అందుకోలేకపోతున్నారు. టెక్నికల్‌ స్కిల్స్‌ను గనుక ఓ ప్రాథమ్యంగా గనుక ఆయా సంస్థలు గుర్తించని పక్షంలో 11 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. టెక్నికల్‌ స్కిల్స్‌ ప్రాథమ్యాన్ని అందుకున్న ఈ 30 శాతనికి మించిన విద్యార్థులు కూడా, యాజమాన్యాలకు సంబంధించినంత వరకూ, ఇప్ప‌టికీ, ‘తక్షణ నియామకానికి సిద్ధంగా’ ఉన్నట్లేమీ కాదు. ఈ విద్యార్థులను రిక్రూట్ చేసుకున్న అనంతరం కూడా విధులు నిర్వర్తించేందుకు వీలుగా వారికి 3 నుండి 4 నెలలపాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలం ఎన్నో సవాళ్ళుతో కూడుకున్నది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నిరుద్యోగుల సంఖ్యను గణనీయంగా పెంచనుంది. దీంతో ఎంట్రీ లెవల్‌ ప్రోఫెషనల్స్‌ ప్రత్యేకించి ఉద్యోగం పొందేందుకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు లేనివారు ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. నేడు ఎన్నో కంపెనీలు, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, చేరిన మొద‌టి రోజు నుంచి సమర్ధంగా పని చేయాలని ఆశిస్తున్నాయి. శిక్షణ పేరిట వారిపై డబ్బును, సమయాన్ని వెచ్చించేందుకు అవి సిద్ధంగా లేవు. వీటన్నింటి అర్ధం ఒక్కటే… విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. పరిశ్రమ అవసరాలకు సిద్ధంగా ఉండాలి. ఏదో కాలేజీకి వెళ్లాం. చదువు పూర్తి చేసుకున్నాం…అంటే కుదరదు.

విద్యార్థుల్లో 25 శాతం కంటే ఎక్కువ మంది 30-40 శాతం పని తీరు కనబరుస్తున్న వారే. వీరు తగు శిక్షణ ద్వారా తమ ఎంప్లాయబుల్‌ స్కిల్స్‌ (ఉద్యోగం పొందగల నైపుణ్యాలు) పెంచుకోవచ్చు. ఇలాంటి వారు ముఖ్యంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌, టెక్నికల్‌ స్కిల్స్‌పై దృష్టి సారించాల్సి ఉంటుంది. అన్నింటి కంటే విచారకరమైన అంశం మరోకటుంది. 36 వాతం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ‘ఇంజనీరింగ్‌ జాబ్‌’ చేసే అవకాశము ఎంత మాత్రం లేదు. కారణం, ఈ మూడు నైపుణాల్లోనూ అర్హత ప్రాథమ్యం వీరు పొంద లేకపోయారు.
ఇలాంటి వారికి ఉద్యోగం ఇచ్చి, అందులో వారికి శిక్షణ ఇవ్వడం ఎంతో కష్టమని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఫలితంగా వారు తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది.

స్కిల్స్‌ పెంచుకునే ప్రయత్నం చేయండి…
ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు ఏదో కాలేజీకి వెళ్లామని కాకుండా, చదువుకునే సమయంలోనే ఒక లక్ష్యంతో శ్రమించాలి. విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది ఎలాగైనా ఇంజనీరింగ్‌, డిగ్రీ,పీజీ…ఇలా చదువుతున్న కోర్సు ఏదైనా పాస్‌ కావాలనే చదువుతుంటారు. అంతే తప్ప, ఈ కోర్సు తర్వాత వారు త‌ర్వాత ఏమి చేయాల‌ని ఆలోచించరు. ఒక కాలేజీ మొత్తం విద్యార్థుల్లో చాలా తక్కువ శాతం మంది కోర్సు తర్వాత భవిష్యత్‌ ఏమిటి..?, మనం లక్ష్యం ఎలా వుండాలి..?, దాన్ని ఎలా చేరాలని అలోచిస్తుంటారు. ఇటువంటి విద్యార్థులు మొత్తం విద్యార్థుల్లో 10 శాతం మంది మాత్రమే వుంటారు. స్వతహాగా వారు అలోచించే విధానం, ఇతర విద్యార్థులకు బిన్నంగా వుంటుంది. ఇటువంటి విద్యార్థులు చదువుకునే సమయంలోనే, కోర్సు పూర్తయిన తర్వాత ఎలాగు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. ఏదో ఒక‌టి సాధించాలనే ఆలోచన వుండి వుంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు ఏటువంటి ఉద్యోగాలను కోరుకుంటున్నారు… వారికి వుండవలసిన స్కిల్స్‌ ఏమిటి అంచనా వేసుకోవాలి. మీ అకడమిక్స్‌ను ఒకవైపు కొనసాగిస్తూనే మరోవైపు వీటి పైన కూడా దృష్టి పెట్టండి. ఉదాహరణకు ఇంజనీరింగ్‌, ఎంసిఎ…వంటి కోర్సులు చేసే విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టెక్నికల్‌ స్కిల్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌…వంటివి తప్పకుండా వుండాలి. కోర్సు పూర్తయిన తర్వాత ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే, కోర్సు చేస్తున్న సమయంలో పైన చెప్పుకున్న స్కిల్స్‌ పట్ల దృష్టి పెట్టండి. ఒకవైపు సబ్జెక్ట్‌పై పట్టు సాధించి, ప్రతి సబ్జెక్ట్‌లోను మంచి స్కోరింగ్‌ కోసం ప్రయత్నం చేయాలి. అదే సమయంలో ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్‌ కోసం నిరంతరం శ్రమించాలి. మంచి పుస్తకాలు చదవాలి, మీరు పెంచుకోవాల్సిన స్కిల్స్‌ పట్ల నిరంతరం ప్రాక్టీస్‌ చేయాలి. వేసవి సెలవులను ప్రత్యేక శిక్షణ కోసం సద్వినియోగం చేసుకోవాలి.విద్యార్థి ద‌శ‌లో జీవితాన్ని ఎంజాయి చేయడమే కాదు, కోర్సు పూర్తయిన తర్వాత పది మంది మెచ్చుకునేలా ఉద్యోగాలు వెతుకుంటూ రావాలి. అలా లేని ప‌క్షంలో మ‌న కెరీర్ స‌రైన దిశ‌లో కొన‌సాగ‌దు.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *