ఉప‌యోగ‌ప‌డే ఉచిత మ‌ల్టీమీడియా టూల్స్‌

ఉచితంగా లబించే పలు అప్లికేషన్‌ టూల్స్‌ ద్వారా మీ పర్సనల్‌ కంప్యూటర్‌లో పలు రకాల పనులను నిర్వహించవచ్చు. ముఖ్యంగా మల్టీమీడియాతో పనిచేస్తుంటే…దాన్ని పలు విధాలుగా తయారుచేసి అందించడానికి అనేక సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. పోటోలను చక్కగా తయారు చేయడానికి, ఇమేజ్‌లను క్రియేట్ చేయడంలోను, పోస్టర్‌ ప్రింంగ్‌లోను, అడియో ఎడిటింగ్‌లోను వీడియో ట్రాన్స్ కోడింగ్‌లోను, 3డి మోడిలింగ్‌లోను, వీడియో క్యాప్చరింగ్‌లోను, వీడియో ఎడిటింగ్‌లోను…ఇలా అనేక రకాల మల్టీమీడియా పనులను అయా టూల్స్‌ను ఉపయోగించి సులువుగా పూర్తి చేయగలం. ఉపయోగకరమైన కొన్ని మ‌ల్టీమీడియా టూల్స్‌ గురించి …

మల్టీమీడియా కంటెంట్‌ను మీకు కావాల్సిన రీతిలో తయారుచేసుకోవాలంటే పలు టూల్స్‌ వాడుకలో ఉన్నాయి. మీ వద్ద వుండే పోటోలు మొదలుకుని, ఇమేజెస్‌, అడియో, వీడియో, 3డి మోడలింగ్‌…వంటి పలు రకాల కంటెంట్‌ను సులువుగా, ఎటువంటి ఖర్చు లేకుండా తయారు చేయడానికి ఉపయోగపడే పలు రకాల టూల్స్‌ గురించి వాటి వెబ్‌సైట్స్‌ను ఇక్కడ పొందుపరిచాం. ఇక్కడ పొందుపరిచిన
పది రకాల టూల్స్‌…మల్టీమీడియా ఫైల్స్‌తో చాలా సమర్దవంతంగా పనిచేస్తాయి. ఇమేజ్‌, అడియో, వీడియో, పోస్టర్‌, 3డి, వీడియోక్యాప్చర్‌… వంటి పలు రకాల పనులను చేస్తూ మీకు కావాల్సిన చక్క‌టి మల్టీమీడియా కంటెంట్‌ను తయారు చేయడంలో ఈ టూల్స్‌ చక్కగా ఉపయోగపడతాయి.

ఇమేజ్‌ క్రియేషన్‌…
ఉచితంగా అనేక ఇమేజ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉంటాం. వీటిని ఉపయోగించి మనం కొత్త కంటెంట్‌ను క్రియేట్ చేయగలం. దీని కోసం Andrea Mosaic అనే టూల్‌ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ వద్ద వుండే పోటోలన్నింటిని తీసుకుని, వాటిని అసెంబుల్‌ చేయడం ద్వారా చూడచక్కని పోటో మోజియాక్‌ ఎర్పడుతుంది. ఉచితంగా లబించే ఈ టూల్‌ ద్వారా మనం 200 మోగా పిక్షల్స్‌ను కలిగిన ఇమేజ్‌లను తయారుచేయగలం. ఈ టూల్‌ను “www.andreaplanet.com” వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

అడియో ఎడిటర్‌…
అడియో ఫైల్స్‌తో పనిచేస్తున్నప్పుడు ఉపయోగపడే పలు రకాల యుటిలిటీస్ గురించి గత సంచికలలో తెలుసుకున్నాం. ఇక్కడ చెప్పుకునే టాప్‌ టూల్స్‌లో ముఖ్యమైన అడియో ఎడిటర్‌ గురించి తెలుసుకుందాం. ఈ టూల్‌ కూడా ఉచితంగా లబిస్తుంది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, నిత్యం అనేక అడియోస్‌ను డౌన్‌లోడ్ చేస్తుంటాం. అలాగే మనం కూడా ఆసక్తిని బ‌ట్టి ట్యూన్స్‌ తయారు చేస్తుాంం. మీరు సేకరించిన అడియోలను, అలాగే రికార్డు చేసిన వాటిని కావాల్సిన విధంగా ఎడింగ్‌ చేయాలంటే పలు టూల్స్‌ వాడుకలో ఉండవచ్చు. కానీ వీటిలో ఉచితంగా లబిస్తూ… చక్కగా పనిచేసే టూలే అడాసిటీ. ఇందులో అనేక ఎడిటింగ్ అప్షన్స్‌ ఉండటం వలన ఎడిటింగ్ మీకు కావాల్సిన విదంగా పూర్తి చేయగలం. అడియోను క‌ట్ చేయడం, పేస్ట్‌ చేయడం…వంటివి చాలా సులువుగా ఈ టూల్‌ ద్వారా చేయగలం. ఈ టూల్‌ ద్వారా మీ వద్ద ఉన్న అడియోలను సులువుగా నిర్వహించగలరు. ఉచితంగా లబించే టూల్స్‌లో బెస్ట్‌గా చెప్పుకునే టూల్స్‌ అడాసిటీ ఒక‌టి. దీన్ని http://audacity.sourceforge.net వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మ్యూజిక్‌ను సేకరించి మ్యూజిక్‌ ప్రియిలకు ఇటువంటి టూల్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకెందుకు అలస్యం ఒకసారి ట్రై చేసి చూడండి దీని పనితనం తెలుస్తుంది.

వీడియో ట్రాన్స్ కోడింగ్‌..
స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్స్ ప్రవేశంతో నేడు అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో ఉచితంగా లబిస్తున్నాయి. అలాగే మనం షూట్‌ చేసే వీడియోలు, సేకరించిన వీడియోలతో మీ హార్డ్‌డిస్క్‌ ఫుల్‌గా ఉండే ఉంటుంది. మీ వద్ద ఉన్న వీడియోలను ఒక ఫార్మాట్ నుంచి వేరొక ఫార్మాట్‌లోకి కన్వర్ట్‌ చేయడానికి ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. సాదారణంగా మనం ఉపయోగించే కొన్ని వీడియోలు ప్లే కాకపోవచ్చు. లేదా వాటిని వేరొక చోట ప్లే చేయాలంటే వేరే ఫార్మాట్ అవసరం ఎర్పడవచ్చు. ఇటువంటి సమయంలో హ్యాండ్‌ బ్రేక్‌ టూల్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో రిప్పింగ్‌ చేయలేం. డివిడిలోకి మార్చడం, బ్లూ రేడిస్క్‌లోకి మార్చడం..వంటివి చేయలేం. హ్యాండ్‌బ్రేక్‌ను www.handbrake.fr అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

పోటోషాపే ఎందుకు…
పోటో ఎడింగ్‌ చేయడం కోసం పోటోషాప్‌ను ఉపయోగిస్తుంటాం. ఖచ్చితంగా పోటోషాప్‌నే ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీటిలో కెల్లా జింప్‌ టూల్‌ చాలా శక్తివంతమైన టూల్‌గా చెప్పవచ్చు. పోటోషాప్‌ అవసరం లేకుండానే మీ వద్ద ఉండే ఎటువంటి పోటోనైనా సులువుగా, వేగంగా, చక్కగా ఎడిటింగ్‌ చేసుకోవడానికి ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. పైగా ఉచితంగా కూడా లబిస్తుంది. ఇందులో అనేక ఫీచర్స్‌ ఉండటం వలన ఇమేజ్‌ను ఎడిటింగ్‌ బాగా చేయ‌వ‌చ్చు. ఉదాహరణకు కలర్‌ కరెక్షన్‌ అప్షన్స్‌… hue, saturation, color balance…వంటి వాటి వలన పోటో ఎడిటింగ్ సమర్దవంతంగా పూర్తి చేయగలం. ఈ టూల్‌ను “www.gimp.org వెబ్‌సైట్స్ నుంచి డౌన్‌లోడ్‌ చేయగలరు. పోటో సేకరణ హాబీ ఉన్న వారికి ఇటువంటి తేలికపాటి, సులువైన టూల్స్‌ అందుబాటులో ఉండటం వలన పోటో ఎడిటింగ్‌, నిర్వహణ తేలికగా ఉంటుంది.

3డి మోడలర్‌…
గేమ్స్‌, సిజి మూవీలలో 3డి మోడల్స్‌ను ఉపయోగిస్తూ ఉంటాం. 3డి కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ను జనరేట్ చేయడంలో బ్లెండర్‌ అనే ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించాలంటే, పూర్తిగా తెలుసుకోవాలి. 3డి మోడల్స్‌ను తయారు చేయాలంటే టెక్షరింగ్‌, రిగ్గింగ్‌, కాంపోజింగ్‌…వంటివన్నీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే “www.blender.org” అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కండి. పెయిడ్‌ సాఫ్ట్‌వేర్స్‌లో 3డిఎస్‌మాక్స్‌ సాఫ్ట్‌వేర్‌ బాగా ప్రాచుర్యాన్ని పొందింది.

వీడియో క్యాప్చర్‌ …
వీడియో క్యాప్చర్‌ చేయడానికి పలు రకాల టూల్స్‌ వాడుకలో ఉన్నాయి. డెస్క్‌టాప్ స్క్రీన్‌లను క్యాప్చర్‌ చేయాలంటే “Ctrl – Print Screen” అనే కీస్‌ను ఉపయోగిస్తాం. అదే వీడియోను క్యాప్చర్‌ చేయాలంటే ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. ఉచితంగా లబించే క్యామ్‌ స్టూడియో ఓపెన్‌సోర్స్‌ ప్రొగ్రామ్‌ద్వారా వీడియోతో పాటుగా అడియోను కూడా క్యాప్చర్‌ చేయగలం. డెస్క్‌టాప్ పై వచ్చే వీడియోల‌ను వీటి ద్వారా సులువుగా క్యాప్చర్‌ చేయగలం. దీని ద్వారా వీడియోను కావాలంటే .AVI ఫార్మాట్‌లోకి కూడా మార్చవచ్చు. ఇందులో బిల్ట్‌ఇన్‌ స్ట్రీమింగ్‌ ఫ్లాష్‌ వీడియో కన్వర్టర్‌ వలన ఫ్లాష్‌ వీడియోలోకి కన్వర్ట్‌ చేయగలం. ఇటువంటి వీడియోలను నేరుగా యుట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేయవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ కోసం “http://camstudio.org” అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కండి.

వీడియో ఎడిటర్‌…
విండోస్‌ మూవీ మేకర్‌ ద్వారా కూడా వీడియో ఎడిటింగ్‌ను నిర్వహించగలం. అడోబ్‌ సంస్థ అందించే ప్రీమియర్‌ ద్వారా కూడా ఎడిటింగ్‌ను నిర్వహించగలం. ఇవే కాకుండా పలు ఉచిత టూల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీడియో పాడ్‌ ద్వారా వీడియో ఎడింగ్‌ను నిర్వహించగలం. ఇందులోనే 50 రకాల ఎఫెక్ట్స్ & ట్రాన్సిటిష‌న్స్ ఉంటాయి. నేరుగా ఎడిటర్స్‌ టైమ్‌లోని డ్రాగ్‌ & డ్రాప్‌ ద్వారా వీడియోలను తీసుకుని ఎడిటింగ్‌ చేయగలం.

వెక్టార్‌ గ్రాఫిక్స్‌…
ఇమేజ్‌ ఎడింగ్‌ టూల్‌ జింప్‌ గురించి తెలుసుకున్నాం. వెక్టార్‌ టైప్‌ గ్రాఫిక్స్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం కోరల్‌ డ్రాను ఉపయోగించాల్సి ఉంటుంది. అదే ఉచితంగా లబించే వెర్షన్స్‌లో అయితే ఇంక్‌స్పేస్‌ అందుబాటులో ఉంది. అడాబ్‌ ఇల్లస్ట్రేటర్‌ను కూడా ఉపయోగించే వీలుంది. వెక్టార్ టాస్క్‌ల‌ను ఈ టూల్‌ ద్వారా చాలా చక్కగా పూర్తి చేయగలం. దీన్ని http://inkscape.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొండి.

స్క్రీన్‌ కాస్టింగ్‌ టూల్ …
ఓపెన్‌ బ్రాడ్‌కాస్టర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా గేమింగ్‌ అడే సమయంలో లైవ్‌గా మీ స్క్రీన్‌ మీద జరిగేది బ్రాడ్‌కాస్ట్‌ చేయవచ్చు. ఇందులో అన్ని రకాల టూల్స్ ఉంటాయి. స్క్రీన్‌ మీద జరిగేది ఏది అయినా ఈ టూల్‌ ద్వారా నేరుగా రియల్‌టైమ్‌లో స్ట్రీమ్‌ చేయగలం. దీన్ని “http://obsproject.com” వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *