ఆన్‌లైన్ ఎర్నింగ్స్ .. 20 ర‌కాలుగా – Part 1

ఇంటర్నెట్‌ ద్వారా అనేక అవకాశాలు ఉన్న మాట వాస్తవమే. అనేక మంది నేడు ఇంటర్నెట్‌ను అధారం చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉండే అవకాశాల‌ గురించి కంప్యూటర్స్‌ ఫర్ యు మ్యాగ‌జైన్ ద్వారా ప‌లు వ్యాసాల‌ను అందించాం. ఆన్‌లైన్‌లో ఉన్న అవకాశాల‌తో పలువురు ఆన్‌లైన్‌ ఎంట్రెపెన్యూర్‌ల‌గా మారిపోతున్నారు. ఆన్‌లైన్‌లో మీరు కూడా సంపాదించాంటే తప్పకుండా మీకు ఆన్‌లైన్‌లోపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఆప్‌డేటెడ్‌గా ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులో ఉన్న 20 రకాల‌ ఇన్‌కమ్‌ టెక్నిక్స్‌ గురించి తెలుసుకుందాం. సూక్ష్మంగా చెప్పాంటే ఆన్‌లైన్‌ ద్వారా మీరు కూడా బాగా సంపాదించాంటే ముందుగా మీ వద్ద కంప్యూటర్‌, నెట్‌ కనెక్షన్‌తో పాటు మంచి తెలివితేటలు కూడా ఉండాలి. ఆన్‌లైన్‌లో ఎదో ఒకటి చేస్తే డబ్బు వస్తాయనేది వాస్తవం కాదు. ఈజీ మనీ ఎంత మాత్రం మంచిది కాదు. తెలివితేటలే పెట్టుబడిగా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే ప్రయత్నం చేయండి. ఇంట‌ర్నెట్ గురించి కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా పదిమందికీ మీరు కూడా ఉపయోగపడేలా మారండి.
Note :  ఆన్‌లైన్‌లో ఎక్క‌డే కానీ డ‌బ్బులు క‌ట్ట‌మంటే క‌ట్ట‌వ‌ద్దు. మీరు ఆన్‌లైన్ ద్వారా ప‌నిచేస్తుంటే, మీకు డ‌బ్బులు చెల్లించాలి .. కానీ మీ వ‌ద్ద డ‌బ్బులు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.
ఆన్‌లైన్‌ ద్వారా ఆదాయానికి ప‌లు అవ‌కాశాలు…
ఆన్‌లైన్‌లో అవ‌కాశాలు ఉన్నాయి. కానీ వాటిని అందుకునే స‌త్తా మ‌న వ‌ద్ద ఉంటే ఇక అల‌స్యం చేయ‌వ‌ద్దు. అవ‌కాశాల‌ను స‌రిగ్గా
ఉప‌యోగించుకోవ‌డంలోనే మీ సత్తా దాగి ఉంటుంది. ఇప్పటికీ బాగా వాడుకలో ఉన్న ముఖ్యమైన పద్దతుల‌ గురించి.
ఈ పద్దతులు ఏమిటో తెలుసుకునే ముందు వాటిని ఇక్కడ లిస్ట్‌ చేస్తున్నాం. మీరు నిర్వహించే వెబ్‌సైట్‌ మొదుకుని ..
ఇతర థర్డ్‌పార్టీ వెబ్‌సైట్స్‌ ద్వారా డబ్బు సంపాదించే మీంది.
ఆన్‌లైన్‌ ద్వారా ఉన్న మార్గాల‌ను ఇక్కడ లిస్ట్‌ చేయడం జరిగింది. వీటిని మరింత సృష్టంగా ఇదే వ్యాసంలో తెలుసుకుందాం. ఆన్‌లైన్‌లో ఎర్నింగ్స్‌ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కూడా తెలుసుకుంటూ ఉండాలి.
1. వెబ్‌సైట్‌ లేదా బ్లాగ్‌ ఉండాలి… దానికి ప్రజాదరణ ఉండాలి.
2. న్యూస్‌ లెటర్స్‌ను నిర్వహించడం ద్వారా
3. యుట్యూబ్‌ చానల్‌ ద్వారా
4. మీరే సొంతంగా తయారు చేసినవాటిని అమ్మడం ద్వారా
5. ఆన్‌లైన్‌ స్టోర్‌ని క్రియేట్‌ చేసుకోవడం ద్వారా
6. బుక్స్‌ను పబ్లిష్‌ చేయడం ద్వారా
7. మీలో టీచింగ్‌ స్కిల్స్‌ ఉంటే
8. మీకు కోడింగ్ తెలిసి ఉంటే వాటి ద్వారా
9. ఒకరికి సహాయం చేయడం ద్వారా
10. యాప్స్‌, ఇతర డెవప్‌మెంట్‌ ద్వారా
11. డేటా వర్క్‌ కోసం అయితే
12. మీ మ్యూజిక్‌ను సేల్‌ చేయడం ద్వారా
13. అఫ్లియేట్‌ మార్కెటింగ్‌ ద్వారా
14. ఆన్‌లైన్‌ ట్యూషన్స్‌ ద్వారా
15. ప్రాపర్టీస్‌ను సేల్‌ చేయడం ద్వారా, లేదా ఇతర వస్తువును అమ్మడం ద్వారా
16. మీ క్రియేటివ్‌ పోటోల‌ను అమ్మడం ద్వారా
17. వెబ్‌సైట్‌ టెస్టింగ్‌ ద్వారా
18. టెక్‌ సపోర్ట్‌ ద్వారా
19. ప‌లు రకాల‌ సర్వీస్‌ల‌ ద్వారా
20. వెబ్‌సైట్‌ నేమ్స్‌ను అమ్మడం ద్వారా ..
ఇలా ప‌లు రకాల‌ అవకాశాలు ఆన్‌లైన్‌లో మీకోసం ఎదురు చూస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా అంత సులువేం కాదు. వస్తువును
అమ్మడం సులువే. కానీ వాటిని తయారు చేయాలి. మన వద్ద ఉన్న పాత వాటిని అమ్మడం మాత్రం సులువు. ఇంకా ట్యూషన్‌, కోడింగ్‌, డేటా వర్క్‌, ట్రాన్స్‌లేషన్‌, అర్టికల్‌ రైటింగ్‌, టెక్నికల్‌ సపోర్ట్‌, టెస్టింగ్‌ చేయడం … ఇలా ఏ పని అయినా కూడా స్కిల్‌తో కూడుకున్న పనే. ఆన్‌లైన్‌లో కూడా సులువుగా డబ్బు రావు. అలా ఎవరైనా చెప్పితే అది తప్పే. చాలా మంది ఆన్‌లైన్‌ను అడ్డం పెట్టుకుని డబ్బు గుంజడం కోసం ఇలా నాటకాలు అడుతుంటారు. కావున వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి.

1. వెబ్‌సైట్‌, బ్లాగు ద్వారా ..
మీ వద్ద స్కిల్స్‌ ఉంటే వాటినే పెట్టుబడిగా పెట్టి వెబ్‌సైట్‌ లేదా బ్లాగుని నిర్వహించండి. మీ వెబ్‌సైట్‌కు నెటిజన్స్‌ కూడా రావాలి.
అంటే వెబ్‌సైట్‌లోని కంటెంటే ముఖ్యం. కంటెంట్‌ను అప్‌డేట్‌ చేయడం, కంటెంట్‌ను ఇచ్చే విదానం కూడా క్రియేటివ్‌గా ఉండేలా చూడండి.  ఒకసారి మీ వెబ్‌సైట్‌కు మంచి ప్రచారాన్ని పొందితే ఇక మీకు తిరుగు ఉండదు. ఆన్‌లైన్‌లో పలు సంస్థ‌లు ప్రకటల‌ను ఇస్తాయి. అలాగే వెబ్‌సైట్‌కు మార్కెట్ వేల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ప్రకటను ఇవ్వడం కోసం గూగుల్‌ యాడ్‌సెన్స్‌, అప్లియేట్ యాడ్స్‌ వంటివి చాలా ఉన్నాయి. google adsense, affiliate websites, buy sell ads … మొదలైనవన్నీ యాడ్‌ నెట్‌వర్క్‌లే.
2. న్యూస్‌ లెటర్స్‌ ద్వారా ..
సొంతంగా న్యూస్‌ లెటర్స్‌ను పబ్లిష్‌ చేస్తున్నారా. మీకు తెలిసిన విషయాను పదిమందితో న్యూస్‌ లెటర్స్‌ ద్వారా షేర్‌ చేయానుకుంటే
ఆన్‌లైన్‌లో చేయండి. న్యూస్‌లెటర్స్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ తీసుకోవడం ద్వారా డబ్బు పొందగలం. ఉదాహరణకు
http://www.hackernewsletter.com/, http://nowiknow.com/ .. ఈ వెబ్‌సైట్స్‌ను ఒక సారి గమనించండి.
3. యుట్యూబ్‌ చానల్‌ ద్వారా
ఈ పద్దతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీని గురించి ఇది వరకే తెలుసుకున్నాం. యుట్యూబ్‌లో సొంత చానల్‌ ఏర్పాటు చేసుకొండి. ఇందులో వీడియో కంటెంట్‌ను నిరంతరం పోస్ట్‌ చేస్తూ ఉండండి. యుబ్యూబ్‌ వారే యాడ్స్‌ను ఇస్తుంటారు. ఇవే వీడియోల‌ను మీ వెబ్‌సైట్‌లో కూడా ఎంబెడ్‌ చేసుకోవచ్చు.
4. డిజైన్‌ చేసిన వాటిన అమ్మడం ద్వారా
ఆన్‌లైన్‌లో ల‌బించే DIY Skills (do it yourself projects) స్కిల్స్‌ ద్వారా ప‌లు ప్రాజెక్ట్‌ల‌ను పూర్తి చేయవచ్చు. అలాగే మనకు తెలిసిన విషయాల‌ ద్వారా తయారు చేసిన వేటినైనా ఆన్‌లైన్‌లోనే సేల్‌ చేయగరు. మీ వద్ద ఉండే క్రియేటివ్‌ వస్తువుల‌ను “etsy.com, ebay.com, artfire.com, amazon, flipkart … వంటి వెబ్‌సైట్స్‌ ద్వారా సేల్‌ చేసుకునే వీలు ఉంది. చాలా వరకు స్టోర్స్‌ ద్వారానే చేస్తున్నప్పటికీ కొన్ని రకా వస్తువులు కొన్ని చోట్ల బాగా సేల్‌ అయ్యే వీలు ఉంది.
5. ఆన్‌లైన్‌ స్టోర్‌ను క్రియేట్‌ చేసుకోవడం ద్వారా
ఆన్‌లైన్‌లో మీకంటూ ఒక స్టోర్‌ని క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే మీ వద్ద ఉండే వస్తువును, మీరు తయారు చేసే వాటిని అమ్మవచ్చు. దీని కోసం squarespace.com, eaby.in, amazon.in … వంటి వెబసైట్స్‌ సహాయం తీసుకొండి. సాదారణంగా పాత వాటిని లేదా సింపుల్‌గా మీరు తయారు చేసే కొన్ని రకాల‌ వస్తువుల‌ను అమ్మలాంటే క్విక్కర్‌, ఓఎల్‌ఎక్స్‌… వంటి వెబ్‌సైట్స్‌ ద్వారా అమ్మగల‌రు. కానీ పూర్తిస్థాయిలో  మీ కొత్త కొత్త ఉత్పత్తుల‌ను అమ్మాలంటే ఆన్‌లైన్‌లో స్టోర్‌ని ఏర్పాటు చేసుకొండి.
6. బుక్స్‌ను పబ్లిష్‌ చేయడం ద్వారా
మీ వద్ద పుస్తకాలు ఉన్నాయి. వాటిని ప్రింట్‌ చేసి బుక్‌స్టోర్‌కి పంపి అమ్మడం కంటే ఆన్‌లైన్‌లో కూడా అమ్మవచ్చు. మీ తెలివి తేటను, మీకు తెలిసిన అంశాల‌ను పుస్తక రూపంలో రాస్తూ .. అయా పుస్తకాను ఆన్‌లైన్‌లో కూడా అమ్మవచ్చు.దీని కోసం amazon kindle store, flipkart, eaby.in, dailyhunt, magzter, kinige, google play, i books, bookbaby, smashwords … వంటి వెబ్‌సైట్స్‌ ఉపయోగపడతాయి.  పుస్తకాల‌ కోసం సొంత వెబ్‌సైట్‌ను కూడా తయారుచేసి ఇక్కడ కూడా అమ్మవచ్చు. డబ్బు రావడానికి పేమెంట్‌ గేట్‌వేను తీసుకోవాలి.

మ‌రిన్ని ఆన్‌లైన్ ఎర్నింగ్స్ అంశాల‌ను పార్ట్ 2 లో తెలుసుకుందాం.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *