ఆన్‌లైన్ ఎర్నింగ్స్ 20 ర‌కాలుగా … Part 2

ఆన్‌లైన్ ఎర్నింగ్స్ గురించిన ప‌లు విష‌యాల‌ను ఇది వ‌ర‌కు వ్యాసంలో తెలుసుకున్నాం. మిగ‌తా వాటి గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.  ఆన్‌లైన్ ఎర్నింగ్స్ చేయ‌డం క‌ష్ట‌మేమి కాదు. కాస్త ఓపిక‌తో పాటు, ఇంట‌ర్నెట్‌పై అవ‌గాహ‌న‌తో పాటు మన‌కు కూడా స్కిల్స్ ఉండాలి. ఇది వ‌ర‌కు చెప్పుకున్న‌ట్టు ఆన్‌లైన్‌లో ఎవ‌రికో మ‌నం డ‌బ్బులు క‌డితే మ‌న‌కు ఊరికే డ‌బ్బులు ఇస్తార‌న‌ది నిజం కాదు… అదంతా మోసమ‌ని గ్ర‌హించాలి. ఇది వ‌ర‌కు 6 అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 7 నుంచి 20 వ‌ర‌కు మిగ‌తా అంశాల గురించి తెలుసుకుందాం.

7. టీచింగ్‌ స్కిల్స్‌ ఉంటే…
కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో అమ్మడం ద్వారా అనేక మంది బాగా సంపాదిస్తున్నారు. నేడు అన్‌లైన్‌లో కంటెంట్ రైట‌ర్స్ కు మంచి డిమాండ్ ఉంది. అలాగే మీలో టీచింగ్‌ స్కిల్స్‌ ఉంటే కూడా ఆన్‌లైన్‌ ద్వారా సులువుగా సంపాదించగరు. దీని కోసం udemy, skillshare… వంటి వెబ్‌సైట్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఇన్‌స్ట్రకర్‌గా జాయిన్‌ కావడం ద్వారా టీచింగ్‌ చేస్తూ డబ్బు సంపాదించే వీలుంది.
8. కోడింగ్ తెలిసి ప్రొగ్రామింగ్‌ స్కిల్స్‌ ఉంటే…
మీరే ఏదేని ప్రొగ్రామ్స్‌ను తయారు చేసారు. వాటిని ఆన్‌లైన్‌లో అమ్ముకొండి. అలాగే మీకు కోడింగ్‌ తెలిసి ఉండి, ఏదేని కోడింగ్‌ను డెవల‌ప్‌ చేసి ఉంటే .. guru, elance, rent a coder … వంటి వెబ్‌సైట్స్‌ ద్వారా మీ కోడింగ్‌ స్కిల్స్‌తో డబ్బు సంపాదించవచ్చు. కోడింగ్‌ నేర్పించడానికి కూడా ఆన్‌లైన్‌లో అనేక వెబ్‌సైట్స్‌ ఉన్నాయి.
9. ఒకరికి సహాయం చేయడం ద్వారా
ఆన్‌లైన్‌లో సపోర్ట్‌ చేయడం లేదా మీరు వర్క్‌ చేయడం ద్వారా సంపాదించగరు. వర్చువల్‌ ఆఫీస్‌ అస్టిసెంట్‌, టెక్నికల్‌ అసిస్టెన్స్‌,
లైవ్‌ వీడియో ద్వారా సమాచారం ఇవ్వడం… ఇలా ఏ పని చేసినా కూడా డబ్బులు వస్తాయి. వీటి కోసం taskrabbit, odesk,
google help outs, elance … వంటి వెబ్‌సైట్స్‌ చూడండి.
10. యాప్స్‌, ఇతర డెవప్‌మెంట్‌ ద్వారా …
స్క్రిప్ట్‌లు, బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్స్‌, యాప్స్‌, ప్లగ్‌ఇన్స్‌ .. ఇలా ప‌లు ర‌కాల టూల్స్ లేదా ఉప‌యోగ‌ప‌డే వాటిని మీరు తయారు చేసి ఉంటే వాటిని  code canyon, chupa mobile.com, bin press .. వెబ్‌సైట్స్‌ ద్వారా సేల్‌ చేయండి. మీరు డెవ‌ల‌ప్ చేసిన గేమ్స్ ఏవేని ఉంటే కూడా ఆన్‌లైన్‌లో సేల్ చేసే అవ‌కాశం ఉంది.
11. డేటా వర్క్‌ కోసం అయితే …
ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి. వారి అవసరాల‌ను ఇతరుల‌తో చేపిస్తుంటారు. ఒకవిధంగా ఆన్‌లైన్‌లో అవుట్‌సోర్సింగ్‌ ద్వారా పనులు అవుతుంటాయి. మీకు ఏదేని వర్క్‌ కావాంటే ఇతరుకు కొంత డబ్బు చెల్లించి చేయించుకుంటారు. ఆన్‌లైన్‌లో అవుట్‌సోర్సింగ్‌ వర్క్‌ను ఇవ్వడం కోసం ప‌లు వెబ్‌సైట్స్‌ ఉన్నాయి. అమెజాన్‌ సర్వీస్‌ అయిన mturk.com , elance, guru, odesk, people per hour, crowdspring, 99 designs, design crowd .. వంటి వెబ్‌సైట్స్‌ చూడండి.
12. మ్యూజిక్‌ను సేల్‌ చేయడం ద్వారా…
మ్యూజిక్స్‌ను రికార్డు చేసి వాటిని ఆన్‌లైన్‌లో పెట్టి అమ్మండి. మీ పాటు వినసొంపుగాను, క్రియేటివ్‌గాను ఉంటే ఆన్‌లైన్‌లో మంచి సేల్స్‌ ఉంటాయి. ఆన్‌లైన్‌లో DistroKid, Tunecore, loudr.fm and CDBaby … వంటి ప‌లు వెబ్‌సైట్స్‌ ద్వారామీ మ్యూజిక్ అల్బ‌మ్స్‌ను సేల్‌ చేసుకోవచ్చు. అలాగే మీకు మంచి వాయిస్‌ ఉంటే అడియో నరేటర్‌గా లేదా వాయిస్‌ ఓవర్‌ అర్టిస్ట్‌గా సేవలిచ్చి డబ్బు సంపాదించవచ్చు. దీని కోసం VoiceBunny, Voice123… వంటి వెబ్‌సైట్స్‌ను ఉపయోగించుకోవాలి.
13. అఫ్లియేట్‌ మార్కెటింగ్‌ ద్వారా
ఇది చాలా ముఖ్యమైన పద్దతి. దీని గురించి కంప్యూట‌ర్స్ ఫ‌ర్ యు మ్యాగ‌జైన్‌లో వివ‌రంగా అందించాం. త్వ‌రలో అఫ్లియేట్ మీద మంచి వ్యాసాన్ని కూడా అందిస్తాం. మీ వెబ్‌సైట్‌ లేదా బ్లాగ్‌లో ప‌లు సంస్థ‌ల యాడ్స్‌ను తీసుకుంటూ డబ్బు సంపాదించవచ్చు. యాడ్స్‌ను ఇచ్చే ప‌లు అఫ్లియేట్‌ మార్కెటింగ్‌ సైట్స్‌ commission juntion, click bank, value click , double click, linkshare, vigilink … వంటి వెబ్‌సైట్స్‌ను ఉపయోగించుకోవాలి.
14. ఆన్‌లైన్‌ ట్యూషన్స్‌ ద్వారా
ఆన్‌లైన్‌ ట్యూటర్‌గా డబ్బు సంపాదించగల‌రు. ఎడ్యుకేటర్స్‌, టీచర్స్‌ తదితర‌ ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థుల హోం వర్క్‌ చేయడం, వారి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం, ముఖ్యమైన సబ్జెక్టును టీచ్‌ చేయడం… వంటివి చేయడంద్వారా డబ్బు పొందగల‌రు. దీని కోసం Tutor.com, InstaEdu , TutorVista … వంటి వెబ్‌సైట్స్‌ను బ్రౌజింగ్‌ చేయండి.
15. ప్రాపర్టీస్‌ను సేల్‌ చేయడం ద్వారా, లేదా ఇతర వస్తువును అమ్మడం ద్వారా…
ఇతర ప్రాపర్టీస్‌ను (బ్రోకర్‌గా ఉంటూ) అమ్మడం ద్వారా సంపాదించవచ్చు. అలాగే మీ వద్ద ఉండే పాత పుస్తకాలు, టాయ్స్‌, డివిడిలు, గాడ్జెట్స్‌, ఫర్మినిచర్ … వంటి వేటినైనా కూడా ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. వీటి కోసం airbnb.com, quickr, olx … ఈ వెబ్‌సైట్స్‌ను బ్రౌజింగ్‌ చేయండి.
16. మీ క్రియేటివ్‌ పోటోల‌ను అమ్మడం ద్వారా…
పోటోగ్రఫీ మీ హాబీ అయితే దాని ద్వారా డబ్బు పొందగల‌రు. మీరు తీసిన పోటోల‌కు మెరుగు దిద్ది వాటిని ఆన్‌లైన్‌లో అమ్మే వీలుంది. మీ పోటోల‌ను అమ్మడానికి ఆన్‌లైన్‌లో Creative Market, PhotoDune, iStockPhoto or ImgEmbed … వంటి ప‌లు వెబ్‌సైట్స్‌ వాడుకల‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అనేక మందికి నిత్యం అనేక పోటోలు అవసరమవుతాయి. పోటోకు మంచి డిమాండ్‌ ఉంటుంది.
17. వెబ్‌సైట్‌ టెస్టింగ్‌ ద్వారా…
వెబ్‌సైట్స్‌ను టెస్ట్‌ చేయడం ద్వారా అలాగే వెబ్‌సైట్స్‌ను రివ్యూ చేయడం వల‌న కూడా డబ్బు పొందగల‌రు. దీని కోసం User testing.com వెబ్‌సైట్‌ను ఒకసారి చూడండి.
18. టెక్‌ సపోర్ట్‌ ద్వారా…
ఆన్‌లైన్‌లో మీకు తెలిసిన విషయాను ఇతరుల‌కు తెలియచేయడం ద్వారా వారికి సపోర్ట్‌ ఇచ్చినట్టు ఉంటుంది. స్కైపీ, క్రోమ్‌ రిమోర్ట్‌ డెస్క్‌టాప్‌ షేరింగ్‌ .. వంటి వాటి ద్వారా మీ సపోర్ట్‌ను అందిస్తూ డబ్బు గడించ‌వ‌చ్చు.
19. ప‌లు రకాల‌ సర్వీస్‌ల ద్వారా …
ట్రాన్స్‌లేషన్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, ఎస్‌ఈఓ, అర్టికల్‌ రైటింగ్‌, డాక్యుమెంటేషన్‌, టెక్‌ సపోర్ట్‌ … వంటి ప్రతి సర్వీస్‌ను అందిస్తూ ఆన్‌లైన్‌లో సంపాదించగరు. దీని కోసం ప‌లు వెబ్‌సైట్స్‌ మద్యవర్తిగా ఉంటూ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్స్‌ ద్వారానే మనకు ప‌లు రకాల‌ పనులు వస్తుంటాయి. వాటిని పూర్తి చేసి ఇవ్వడం ద్వారా డబ్బు పొందగలం. Fiverr , PeoplePerHour… వంటి వెబ్‌సైట్స్‌ను ఉపయోగించుకోవాలి. ఇటువంటి సర్వీస్‌ల‌ను అందించే పలు వెబ్‌సైట్స్‌ను కింది విధంగా ఉన్నాయి.
skillshare, elance.com, guru, peopleperhour.com, freelancer.com, mturk.com , www.udemy.com… మొద‌లైన‌వి.
20. వెబ్‌సైట్‌ నేమ్స్‌ను అమ్మడం ద్వారా …
ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్స్‌ పేర్లు కీల‌కమైనవి. అనేక మంది ముఖ్యమైన మంచి నేమ్‌ను కలిగిన వాటిని రిజిష్టర్‌ చేసి పెట్టుకుంటారు. తర్వాత ఈ వెబ్‌సైట్స్‌ను అవసరం ఉన్న వారికి అమ్ముకుంటారు. దీన్నే Domains flipping అని పిుస్తారు. దీనికోసం ఆన్‌లైన్‌లో Flippa, GoDaddy Auctions, Sedo … వంటి పలు వెబ్‌సైట్స్‌ వాడుకలో ఉన్నాయి. వీటి ద్వారా మీ వద్ద ఉన్న వెబ్‌సైట్‌కు మంచి డిమాండ్‌ను సృష్టించుకుని అమ్మవచ్చు.
Note : ప్రతి ఆన్‌లైన్‌ ఎర్నింగ్‌ టెక్నిక్‌ను ఇక్కడ ఇచ్చాం. మీ వద్ద వాటికి తగిన స్కిల్స్‌ ఉంటే డబ్బు సంపాదించగరు. ఈ టెక్నిక్స్‌పై పట్టు ఉంటే ఇంటి వద్ద నుంచే డబ్బు పెద్ద మొత్తం సంపాదించగరు. అంతే కానీ ఆన్‌లైన్‌ ఏవరో చెప్పారని డబ్బు కట్టి మోసపోవద్దు. అవకాశాం ఉన్న ప్రతి చోట ప్రజల‌ను దోచుకోవడం కోసం అనేక మంది మోసగాళ్లు పుట్టుకొస్తుంటారు. కావున జాగ్రత్తగా వ్యవహరించండి.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *