ఆకర్షించే ఇమెయిల్‌, మొబైల్ స్కామ్స్ : e స్కామ్‌ల పట్ల త‌స్మాత్ జాగ్ర‌త్త‌..! – Part 1

సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఉపయోగపడే శక్తివంతమైన ఇమెయిల్‌, స్మార్ట్‌ఫోన్స్ ను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ మోసాగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. మీరు అదృష్టవంతులు, మేం నిర్వహించిన డ్రాలో మీకు 50 కోట్ల బహుమతి వచ్చిందని… మేం నిర్వహించిన లాటరీలో మీ మెయిల్‌ ఐడీ లక్కీగా 50 వేల డాలర్లను సొంతం చేసుకుందని… మీ మొబైల్‌ నంబర్‌ కోకకోలా గ్రూప్‌ నిర్వహించిన డ్రాలో ఎంపికై 50 లక్షలు గెలుచుకుందని…ఇలా పలు మేసేజ్‌లు ఇమెయిల్స్‌, మొబైల్స్‌ ద్వారా వస్తుంటాయి. తర్వాత డబ్బులు డెలివరీ కోసం ప్రాసెసింగ్‌ కింద అయ్యే ఖర్చును చెల్లించమని, పన్నులు చెల్లించడం కోసం కొంత మొత్తం చెల్లించమని ఇలా ప్రలోభ పెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మాయలో పడి ఇప్ప‌టికే అనేక మంది మోసపోతున్నారు. ఈ సైబర్‌ నేరగాళ్ల వలలో పడ్డవారిలో విద్యావంతులు, ఉద్యోగస్తులు కూడా ఉంటున్నారు’.

సమాచార సాంకేతికతలో ఇంటర్నెట్ వినియోగం విప్లవాత్మకమైన మార్పు. ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉన్న అనేక సేవల కారణంగా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది రోజువారి జీవితంలో ఒక భాగం అయింది. ల్యాప్‌టాప్‌, డెస్క్ టాప్‌, ట్యాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్‌లు, స్మార్ట్‌ ఫోన్లు ఇలా మాధ్యమాలు ఏవైనా ఇంటర్నెట్ లేనిదే గడవని వారి సంఖ్య 2.5 బిలియన్లకు చేరుకుంది. ఇంటర్నెట్ అందిస్తున్న సేవల్లో ఇ మెయిల్‌కు ఒక ప్రత్యేక స్థానం. అనేక నూతన సర్వీస్‌లు వస్తున్నా, ప్రతి ఒక్కరు ఇమెయిల్‌కు ప్రాదాన్యత ఇస్తున్నారు. మొదటి ఇ మెయిల్‌ను రే టామ్‌ లిన్స్‌న్‌ అనే ఇంజనీర్‌ 1971 వ సంవత్సరం డిసెంబర్‌ 10 వ తేధిన పంపడం జరిగింది. ఇలా ప్రారంభమైన ఇ మెయిల్‌ నేడు నెట్‌ని వినియోగించే ప్రతి ఒక్కరికి చేరువయింది.

ఇ మెయిల్‌, మొబైల్‌ ద్వారా టోక‌రా …?
ఇది వరకు చెప్పుకున్నట్టు ప్రతి ఒక్కరికి ఇంటి అడ్రస్‌ వున్నట్టే ఇ మెయిల్‌ అడ్రస్‌ కూడా తప్పనిసరిగా వుంటుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా
ఇ మెయిల్‌, మొబైల్స్‌ను ఉపయోగించే వారు అత్యధిక శాతం ఉంటున్నారు. వీటిని ఆధారం చేసుకుని మోసగాళ్లు, ప్రజల బలహీనతలను అసరా చేసుకుని బురిడీ కొటిస్తున్నారు. ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణం ఆన్‌లైన్‌లో జరిగే మోసాల గురించి అవగాహన లేకపోవడం, మోసాగాళ్లు పంపే మేసేజ్‌ల పట్ల కనీస ఆలోచన చేయకుండా స్పదించడం…వంటివి చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నిత్యం జరిగే మోసాల పట్ల అవగాహన పెంచుకోవాలి. నిత్యం మీ మెయిల్‌ ఐడీకి వచ్చే మేసేజ్‌ల పట్ల జాగ్రత్తగా వుండాలి. మీరు కోకోకోలా పెప్సీ కంపెని వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ల‌క్కీ డ్రా లో ప్రపంచ వ్యాప్తంగా ఒకరిని ఎంపిక చేస్తాం… ఈసారి మీ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబ‌ర్ ఎంపిక అయింది. కంగ్రాట్స్ అంటూ మేసేజ్‌ వస్తుంది. మనం వారి అడిగిన ప్రకారం వివరాలు పంపిన వెంటనే, గెలుపొందిన మొత్తం బహుమతిని పొందడానికి కొరియర్‌, ఇన్‌కం ట్యాక్స్ చార్జీలు… అలాగే బహుమతి పొందిన మొత్తాన్ని మీ బ్యాంకు అక్కౌంట్‌కు పంపడానికి ట్రాన్స్‌ఫర్‌ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందనే మేసేజ్‌ వస్తుంది. ఈ క్రమంలో మనల్ని నమ్మించడానికి పలు రకాల అధారాలను పంపుతుంటారు. మద్య, మద్యలో ఫోన్‌లో కూడా మాట్లాడుతూ నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ విధంగా అనేక మంది ఇ మెయిల్‌ , మొబైల్‌ ద్వారా వచ్చే మెసేజ్‌ల మాయలో పడి లక్షల కొద్దీ డబ్బులను బ్యాంక్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసి నిలువునా మోసపోవడం జరిగింది. కొన్ని సందర్బాల్లో మీ పేరు చిరునామా, ఫోన్‌ నంబర్‌, బ్యాంక్ ఎక్కౌంట్‌, పాస్‌పోర్టు వివరాలు తెలుపమని అంటూ వచ్చే ఇమెయిల్స్ ఫేక్‌ ఇ మెయిల్సే. మిమ్మల్ని నమ్మించి మీరిచ్చే మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఇ మేసేజ్‌లు మరియు స్మార్ట్‌ఫోన్‌ల‌కు ఇచ్చే ఎస్ఎంఎస్‌లు ప్రతిరోజు కొన్ని లక్షల్లోనే ఉంటున్నాయి. ఇలా అందుకున్న వారిలో వాటి గురించిన (సైబ‌ర్ నేరాలు) అవ‌గాహ‌న లేక‌పోవ‌డం ద్వారా కానీ లేదా అత్యాశ ప‌డి వాటికి రిప్లై ఇచ్చి వాటిలో ట్రాప్‌లో ప‌డుతుంటారు. ఇలాంటి వాటికి స్పందించి లక్షల రూపాయలు పోగొట్టుకుంటు న్నవారికి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇలాంటి ఇ మెయిల్స్‌కు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనేక మంది ఆకర్షితులవుతున్నారు మోస‌పోతున్నారు.

సైబర్‌ నేరగాళ్ళ తాము సంపాదించిన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి ఫేక్ ఐడెంటీటిలను క్రియేట్ చేయడం ద్వారా అసాంఘిక కార్య క్రమాలకు పాల్పడుతున్నారు. మరియు ఏదైనా నేరాలకు పాల్పడినప్పుడు మీరు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కావున వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం శ్రేయోస్కరం కాదు.

పద్ధతిగా ఫ్రాడ్‌ చేస్తారిలా …?
సైబర్‌ నేరగాళ్లు తాము పంపే ఇ-మెయిల్స్‌ నిజమైనవని నమ్మించడానికి తరుచూ ఫోన్లు చేయడం, బహుమతికి సంబంధించిన ఫేక్ బ్యాంక్ చెక్కులు, డబ్బులు లేదా బ‌హుమ‌తులు (ఐ ఫోన్ లాంటివి) ఉన్నట్లు సూచించే బాక్స్‌ల పోటోలు మరియు నిజమైన లాటరీ సంస్థగా నిరూపించడానికి తయారు చేసిన నకిలీ దృవ పత్రాలు లేదా లాటరీ సంస్థకు ఏజెంట్‌గా నమ్మించేందుకు నకిలీ గుర్తింపు పత్రాలను ఇ-మెయిల్‌ ద్వారా నమ్మకం కలిగించే వరకు పంపుతూనే ఉంటారు. ఇటువంటి లాటరీలను నమ్మవద్దని తరుచుగా పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. సైబర్‌ నేరగాళ్ళ బారిన పడిన వారిలో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, సైంటిస్టులు, లాయర్లు మరియు అధ్యాపకులూ ఉన్నారు. ఈ మోసాలకు బాధితులు అయినవారు వేలల్లో ఉన్న, సైబర్‌ పోలీసులకు అందే ఫిర్యాదులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం మన సైబర్ చ‌ట్టాలపై అవగాహన లేకపోవటం, మోసపోయామని పదిమందికి తెలిస్తే, ఎక్కడ పరువు పోతుందోని భయం. కొంత మంది పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కడానికి ఇష్టపడని మనస్తత్వం ఉండటం వలన ఇటువంటి సైబర్‌ నేరాలు నమోదు కావడం లేదు.

Cyber Appellate Tribunal (CAT)

సైబర్‌ నేరస్తులను శిక్షించడానికి భారత ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. దీనికి ప్రధాన కారణం సైబర్‌ నేర విచారణ సాధారణ నేర విచారణతో పోల్చుకుంటే చాలా క్లిష్టమైనవి, దీనికి న్యాయపరిజ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమవుతుంది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాలలో కూడా  “Cyber Appellate Tribunal (CAT)” అందుబాటులో ఉంది.

తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్రాలకు సంభందించి ఆయా రాష్ట్రాల Information Technology Dept. కు చెందిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ (Prl Secretary) న్యాయాధికారిగా వ్యవహరిస్తారు. సైబర్‌ నేర బాధితులు నేరుగా న్యాయాధికారికి తమ ఫిర్యాదు చెయ్యవచ్చు. ఇందుకు న్యాయవాది సహాయం గాని, న్యాయాధికారి ఫిర్యాదు సమర్పించే ముందు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించవలసిన అవసరం కానీ లేదు. బాధితులకు సాంకేతిక పరిజ్ఞానం మరియు న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉన్నచో వారే వాదించుకునే అవకాశం ఉన్నది. ఫిర్యాదుదారులు ఫిర్యాదులో నామమాత్రపు ఫీజును డిడి రూపంలో “Adjudicating Officer, Information Technogy Act, (Telangana or AP) పేరు మీద తీసిన డిడిని ఫిర్యాదుకు జతపరచవలసి ఉంటుంది.

ఎక్కడ ఫిర్యాదు చెయ్యాలి…?

సోష‌ల్ మీడియా ద్వారా కానీ లేదా ఇంట‌ర్నెట్ ద్వారా కానీ ఎటువంటి ఇబ్బంది క‌ల్గించినా వేధించినా గాని బాధితులు సైబర్‌ నేర పరిశోధనా విభాగాలలో కాని లేక “Cyber Appellate Tribunal (CAT)” లో కాని ఫిర్యాదు చేయవచ్చు. రెండు తెలుగు రాష్ర్టాల‌లో  “Cyber Appellate Tribunal” అందుబాటులో ఉంటుంది.. కావున ఇక్క‌డ పైన చెప్ప‌కున్న‌ట్టు నేరుగా ఫిర్వాదు చేయ‌వ‌చ్చు.

For more details Please see Part 2 :

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *