ఆకర్షించే ఇమెయిల్‌, మొబైల్ స్కామ్స్ : e-స్కామ్‌ల పట్ల త‌స్మాత్ జాగ్ర‌త్త‌..! Part 2

ఇమెయిల్‌, మొబైల్స్ ద్వారా నిత్యం అనేక మోసాలు జ‌రుగుతున్నాయి. అయితే వీటిలో కొంత మంది మాత్ర‌త‌మే పోలీసుల‌కు ఫిర్వాదు చేస్తున్నారు. అనేక మంది సైబ‌ర్ నేరాల బారిన ప‌డిన త‌ర్వాత కూడా స్పందించ‌కుండా ప‌రువు పోతుంద‌నే లేదా ఇంకో భ‌యంతోనో ఫిర్వాదు చేయ‌కుండా ఉంటారు. ఇమెయిల్‌, మొబైల్ నెంబ‌ర్స్‌ను టార్గెట్ చేసుకుని నిత్యం అనేక సైబ‌ర్ మోసాలు జ‌రుగుతున్నాయి.

సింపుల్ విషయం – ఇక్క‌డ కాస్త సెన్స్ పెట్టి ఒక‌టి అలోచించండి… ఎవ‌రైనా మ‌నకు ఉచితంగా డ‌బ్బులు లేదా బ‌హుమ‌తులు ఎందుకు ఇస్తారు. అదీ కూడా మ‌న‌కు తెలియ‌ని వారు… పైగా మ‌న ఇమెయిల్ లేదా మొబైల్ వారికి మ‌నం ఇచ్చి ఉండం.. కానీ మ‌న వివ‌రాలు తెలుసుకుని మ‌రీ మేసేజ్‌లు, ఇమెయిల్స్ ద్వారా ట్రాప్ చేస్తుంటూనే ఉంటారు. కావున అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం ఎంతైనా అవ‌స‌రం. నిజ జీవితంలో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

మ‌న‌కు ప‌లు ఇమేజ్‌లు లేదా ఇమెయిల్స్‌ను పంపిన‌ప్ప‌డు వాటిలో ఉన్న వివ‌రాల‌ను గ‌మ‌నిస్తే అవ‌న్నీ కూడా ఫేక్‌గానే అన్పిస్తాయి. కాస్త అలోచిస్తే స‌రిపోతుంది. పై ఇమేజ్ చూడండి.

ఇవిగో నిదర్శనాలు …
మీరు చాలా అదృష్టవంతులు… మేం నిర్వహించిన డ్రాలో మీకు రూ.30 కోట్ల బహుమతి వచ్చింది కోకకోలా గ్రూప్‌కు చెందిన మా సంస్థ ప్రతి సారి నిర్వహించే లాటరీలో ప్రపంచవ్యాప్తంగా ఒకరిని ఎంపిక చేస్తాం. ఈసారి మీరు ఎంపికయ్యారు.కంగ్రాట్స్ … ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీరు గెలుపొందిన రూ.30 కోట్లను తీసుకోవడానికి రూ. 50 లక్షలు ప్రొసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. ఇది కూడా వైట్ మనీ రూపంలోనే చెల్లించాలి.

మీ ఖాతా నుండి మా ఖాతాకు డబ్బులు పంపిన 24 గంటల్లోనే మీ ఖాతాలోకి మీరు గెలిచిన రూ.30 కోట్లు వచ్చి చేరుతాయి. ఇది నైజరీయన్‌ ఫ్రాడ్‌ ముఠా నగరానికి చెందిన ఓ సైంటిస్టుకు పంపిన ఈ-మెయిల్‌ సందేశ సారంశం. ఆత్యాశపడిన ఆ సైంటిస్టు 50 లక్షలు వారు ఇచ్చిన బ్యాంకు అకౌంటుకు, ట్రాన్స్‌ఫర్‌ చేసి, తన విలువైన డబ్బులను కొల్పోవ‌డం జ‌రిగింది. తదుపరి సైబర్‌ ఫోలీసులకు ఫిర్వాదు చేసారు… కానీ ఇలాంటి నేరాలలో నిందుతులు దొరికి వారి నుంచి డ‌బ్బులు రిక‌వ‌రీ చేసే అవకాశం చాలా తక్కువ. ఎక్కువ‌గా విదేశీయులు ఇటువంటి మోసాల‌తో ల‌క్ష‌ల రూపాయాల‌ను గుంజుతుంటారు.

నగరానికి చెందిన ఒక బ్యాంకు ఉద్యోగికి నైజరీయన్‌లు లాటరీ తగిలిందని పంపిన ఇమెయిల్‌కు స్పందించి 23 లక్షలు పోగొట్టుకొని సైబరాబాద్‌ కమీష‌న‌రేట్‌లోని సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

అసిఫ్‌ నగర్‌కు చెందిన ఓ యువకునికి రూ. 10 లక్షలు గెలుచుకున్నారని మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. అది నిజమని నమ్మిన బాధితుడు వారు చెప్పిన ప్రకారం వారి బ్యాంక్ అక్కౌంట్‌లో రూ.40 వేలు డిపాజిట్ చేశారు. తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయాయని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్వాదు చేశారు.

నల్గొండ జిల్లా నకిరెకల్‌కు చెందిన ఒక ఉపాధ్యాయునికి మైక్రోసాఫ్ట్‌ యూనివర్సిటీ ప్రొమో లాటరీ వచ్చిందని 4 లక్షల విలువ చేసే బ్రిటన్‌ ఫౌండ్లు వస్తాయని పేర్కొంటు ఒక ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ఇమెయిల్‌ ద్వారా ఉపాధ్యాయిడు సంప్రదించిన వెంటనే, మార్క్స్‌, అలెక్స్‌ పేరు గల వారు ఉపాధ్యాయుడిని ఇమెయిల్‌ ద్వారా సంప్రదించారు.తర్వాత మార్క్స్‌ క్యాష్‌ కొటేడ్‌ బాక్స్‌తో హైదరాబాదు వచ్చి ఆ ఉపాధ్యాయుడిని కలిసి బాక్స్‌లో ఉన్న కాగితాలకు కొన్నిరసాయనాలు కలిపితే అవి డాలర్లుగా మారాయి. తర్వాత రెండు కాగితాలకు రసాయానాలు కలిపాడు, అవి డాలర్లుగా మారాయి. మిగిలిన సొమ్ము కూడా అలాగే వస్తుందని, కావాలంటే పరిక్షించుకొవచ్చని, చెప్పి ఓ నోటు ఇచ్చాడు, పరిక్షిస్తే అది నిజమని తెలిసింది. అప్పికే బుట్టలో పడిపోయిన ఉపాధ్యాయుడు రసాయనాలు, ఇతర ఖర్చుల కోసమని రూ. 18 లక్షలు చెల్లించమని కొరితే చెల్లించడం జరిగింది. తర్వాత తెచ్చుకున్న పెట్టెను తెరిచి చూస్తే మోసపోయానని గుర్తించాడు. వెంటనే సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

ఈ విధంగా నిత్యం అనేక మంది సైబ‌ర్ నేర‌గాళ్ల చేతిలో మోసపోతున్నారు. తరుచుగా ఇటువంటి న్యూస్‌ వింటూ ఉంటారు. కానీ మనకు అదృష్టం వచ్చిందోమోననే భ్రమతో మోసపోతుంటారు. అత్యాశ, స్పందించకపోతే మంచి అవకాశం కోల్పోతామనే ఒక అతి తెలివి ఆలోచనతో చాలా మంది బోల్తా పడుతుంటారు. ఇక్కడ వుండే సింపుల్‌ లాజిక్‌ను అర్థం చేసుకోరు. ఎవరైనా మనకు అంత డబ్బులు ఇస్తుంటే, తిరిగి మన వద్ద నుంచి ఎందుకు డబ్బులు ఆశిస్తున్నట్టు. కావున ఈజీ మనీ లేదా అత్యాశతో డబ్బుల గురించి ఆలోచించకుండా ఇటువివంటి సైబర్‌ మోసాలకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.

ఎందుకు చెల్ల‌ని చెక్కుల‌ను కూడా ఇలా పంపిస్తుంటారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి…

1. ఇ మెయిల్‌, మొబైల్స్‌ను ఉపయోగించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలనే కానీ, వీటి ద్వారా మ‌న‌ల్ని టార్గెట్ చేసే ఇటువంటి ఫ్రాడ్స్‌ను అసలు నమ్మవద్దు. మనం ఎటువంటి ల్యాటరీ స్కీమ్‌లో కానీ, ఎటువంటి డ్రాలో కానీ పాల్గొనకుండానే, మనకు ఎలా వస్తాయనే ఆలోచన రావాలి. కొంత మంది ఎంతో జాగ్రత్తగా ఉన్నప్ప‌టికీ, అటువైపు నుంచి వచ్చే కమ్యూనికేషన్‌కు స్పందిస్తూ ఉంటారు… కాస్త మ‌న వైపు నుంచి రెస్పాన్ వ‌చ్చిన వెంట‌నే సైబ‌ర్ నేర‌గాళ్ల మ‌న‌ల్ని పూర్తిగా ట్రాప్‌లోకి ప‌డేస్తారు. కావున మెయిల్‌ను, మొబైల్‌ను ఉపయోగించే యూసర్స్‌ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

2. గుర్తు తెలియని వ్యక్తుల నెంబర్లు నుంచి మీ మెబైల్‌, ఈ మెయిల్‌కు వచ్చే లక్కీ డ్రాలో విజేతలని, మా డ్రాలో మీరే విన్నరని లేదా ఒక కోటీశ్వరుడు వాలంటరీగా డబ్బులు ఇస్తున్నాడని…ఇలా వచ్చే మేసేజ్‌లను నమ్మకండి. వెంటనే వాటిని డిలీట్‌ చేయండి. తిరిగి వారి వైపు నుంచి ఎటువంటి స్పంద‌న ఉండ‌దు. మ‌నం స్పందించడం ద్వారా అవతలివైపు వున్న వారు మిమ్మల్ని నిరంతరం ఫాలో చేస్తూ టార్చ‌ర్ చేయ‌డం లేదా నెమ్మ‌దిగా ట్రాప్‌లో ప‌డేస్తారు.

3. మీకు లాటరి తగిలిందనో, కంపెని తీసిన డ్రాలో ఒక బహుమతి వచ్చిందనో మేసేజ్‌ వస్తే వెంటనే మీరు అలాంటి పోటీలో పాల్గొన్నారో లేదా గుర్తుకు తెచ్చ‌కొండి. ముఖ్యంగా మీకు తెలిసిన వారి దగ్గరి నుంచి లేదా మీకు తెలిసిన సంస్థనుంచి వచ్చిందో లేదో చూడాలి. తెలియని వ్యక్తులు లేదా సంస్థలనుంచి వచ్చే వాటి పట్ల కేర్‌లెస్‌గా వుండాలి. మీకు వ‌చ్చిన మేసేజ్‌ను చూస్తేనే మీకు తెలిసిపోతుంది.. అది ఫేక్ మేసేజ్ అని ఆలాగే మీకు ఏ మాత్రం సంబందం లేని ఇమెయిల్ లేదా మొబైల్ అని.

4. నిజంగా లాటరి తగిలితే డబ్బు పొందేందుకు ఏ చార్జీలు చెల్లించనవసరం లేదు. టాక్స్‌ మనం స్వయంగా క‌ట్టాల్సి ఉంటుంది. పైగా మీరు లాట‌రీ టికెట్ కొన్నారో లేదా మీకు తెలిసే ఉంటుంది క‌దా. పైగా అ టికెట్ దాని నంబ‌ర్ మీద‌గ్గరే ఉంటుంది క‌దా. దాదాపు భారత దేశంలో లాటరీలు నడుపుతున్న సంస్థ ద్వారా లాటరి వస్తే వ్యక్తిగతంగా మాత్రమే వివరాలు అందిస్తుంది. ఇ మెయిల్స్‌ పంపించరనే విషయం గుర్తించుకోవాలి.

5. పదే పదే ఇలాంటి మెయిల్స్‌ వస్తే ఒకసారి మీ ఇమెయిల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇలాంటి మెయిల్స్‌ అపేందుకు స్పామ్‌కి రిపోర్ట్‌ చేయండి.
అపరిచితులకు, అపరిచిత ఇమెయిల్స్‌కి ఎట్టి పరిస్థితుల్లోను మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు, పాస్‌పోర్ట్‌ వివరాలు ఇవ్వకండి.
అవి సంఘ విద్రొహుల చేతుల్లోకి వెళ్లితే మనకు ఎంతో ప్రమాదం.

6. అపరిచిత ఇమెయిల్స్‌ను చూడటం, వాటికి ప్రతిస్పందించడం చేయకూడదు.కొన్ని సందర్బాల్లో ఇమెయిల్‌ను తెరిచిన వెంటనే సదరు వ్యక్తికి మీ వ్యక్తిగత వివరాలు డేటాబేస్‌ ద్వారా చేరుతాయనే విషయం గుర్తించుకోవాలి.

7. కొంత మంది హ్యాకర్స్‌ కూడా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వున్న వారికి తరుచుగా మీ ఆన్‌లైన్ అక్కౌంట్‌, పాస్‌వర్డ్‌ ఒకసారి సరిచూసుకోండనే మేసేజ్‌ పంపుతుంటారు. మీరు వెంటనే మీ అక్కౌంట్ లేదా యూసర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌…వంటివి టైప్‌ చేయడం ద్వారా అవతలి వారు మీ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వివరాలు తీసుకుని వెంటనే ఆన్‌లైన్‌ ద్వారానే డబ్బులను మీ అక్కౌంట్ నుంచి వారి అక్కౌంట్స్‌కు మార్చుకుంటూ ఉంటారు. దీన్నే ఫిషింగ్‌ అని పిలుస్తాం. కావున ఇంట‌ర్నెట్‌ను ఉపయోగించడమే కాదు… ఇంటర్నెట్ ద్వారా వస్తున్న సమస్యలను గుర్తిస్తూ వుండాలి. సైబర్‌ క్రైమ్స్‌ గురించి అవి జరిగే విధానం గురించి, తగు జాగ్రత్తల గురించి..తెలుసుకుంటూ ఉండాలి.

నమ్మించడం కోసం అనేక నాటకాలు…!

పేరుకు ఏమో అమెజాన్ నుంచి కానీ ఒరిజ‌న‌ల్ వెబ్‌సైట్ మాత్రం అమోజాన్ కాకుండా ఇంకేదో ఉంటుంది.

మెయిల్‌ ఐడీకి, మొబైల్‌కు మేసేజ్‌ పంపడంతో పాటుగా మనం వారు పంపిన మేసేజ్‌లకు స్పందించినా, స్పందించకపోయినా…వారిని మనం నమ్మేలా అనేక నాటకాలు అడుతుంటారు. వారి ఐడెంటీటిని పంపడం, మన పేరు మీద చెక్‌ తయారైనట్టు చెక్‌ ఫ్రూఫ్‌ పంపడం, క్యాష్‌ బాక్స్‌ల పోటోలను, బ‌హుమ‌తుల పోటోల‌ను మెయిల్‌ చేయడం…ఇలా అనేక జిమ్మిక్కులు చేస్తుాంరు.

మనల్ని నమ్మించడం కోసం లాటరీ మనకే తగిలినట్టు చూపించే సర్టిఫికేట్‌ను పంపుతుంటారు. అందులో పేరు, లాటరీ మొత్తం విలువ ఉంటుంది.

క్యాష్‌ పంపిస్తున్నామని అ క్యాష్‌ బాక్స్‌లు కొరియర్‌లో బుక్‌ చేశామని తెలిసే పోటోలను ఇలా పంపి కూడా మోసం చేస్తుంటారు.

మన పేరు మీద చెక్‌ను పంపుతున్నట్టు ఇలా డూప్లికేట్ చెక్‌ల పోటోలను కూడా పంపుతుంటారు.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *